





Best Web Hosting Provider In India 2024

పెద్దవాళ్లకు సరే చిన్నపిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? ఈ మార్పుకు కారణం ఏమిటి?
ఇవరై ఏళ్లు, ముప్పై ఏళ్ల వయసులో ఉన్న వారి జుట్టు తెల్లబడడం మనం చూస్తూనే ఉంటాం. కానీ చిన్నపిల్లల జుట్టు కూడా తెల్లబడడం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకలా జరుగుతోంది?
ఒకప్పుడు యాభై ఏళ్లు దాటితే గాని తెల్ల జుట్టు కనిపించేది కాదు. ఇప్పుడు యువతరంలో జుట్టు తెల్లబడే సమస్య అధికంగా మారింది. అందుకే రంగులు వేసుకొని మేనేజ్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 20 లేదా 30 ఏళ్ల వయసులో ఉన్న వారి జుట్టు తెల్లబడిందంటే ఒక అర్థం ఉంది.
కానీ చిన్నపిల్లల్లో కూడా జుట్టు తెల్లబడే సమస్య కనిపిస్తోంది. ముఖ్యంగా పదేళ్ల వయసులోపు పిల్లల్లో కూడా జుట్టు రంగు మారడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. దీనికి కారణాలను వివరిస్తున్నారు వైద్య నిపుణులు.
జన్యుపరమైన కారణాలు
పిల్లల్లో జుట్టు తెల్లబడడానికి అతిపెద్ద కారణం జన్యుపరమైనవి అని చెప్పాలి. తల్లిదండ్రులకు లేదా కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చే సమస్య ఉంటే వారి పిల్లలకు కూడా చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇది జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తిలో లోపం వల్ల జరిగే ప్రక్రియ. కాబట్టి జన్యుపరమైన కారణాలు వల్ల పిల్లల్లో జుట్టు తెల్లబడుతుంది.
పోషకాహారం అందక
పిల్లలు జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాలకే ఈ కాలంలో ఎక్కువ ఇష్టపడుతున్నారు. దానివల్ల వారి శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్ బి12, కాపర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు లేక మెలనిన్ హార్మోను ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుందో జుట్టు తెల్లబడడం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తినిపించేందుకు ప్రయత్నించండి. మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా జరిగితే పిల్లలు జుట్టు రంగు మారకుండా ఉంటుంది. మీ పిల్లలు పోషకాహార లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
మానసిక ఒత్తిడి
ఇప్పటి పిల్లల జీవనశైలి ఎంతో మారిపోయింది. చదువుల్లో పోటీ ఏర్పడింది. ఒకపక్క సోషల్ మీడియా కూడా వారిలో ఒత్తిడిని పెంచేస్తోంది. పదేళ్ల వయసు వస్తే చాలు సోషల్ మీడియాలో ఖాతాను తెరిచేస్తుంది. వారి సంఖ్య ఎక్కువే ప్రతిసారి ఆ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి చూడడం వల్ల వారికి తెలియకుండానే ఒత్తిడికి గురి అవుతున్నారు. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇది జుట్టు మూలాలను దెబ్బతీసి తెల్లబడడానికి కారణమవుతోంది. కాబట్టి మీ పిల్లల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి.
రసాయన ఉత్పత్తుల వాడకం
ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు కుంకుడుకాయలని మాత్రమే తలకి రాసేవారు. శీకాయా వంటి సాధారణ సహజమైన ఉత్పత్తులను వాడేవారు. కానీ ఇప్పుడు షాంపూ, కండిషనర్ వంటి రసాయనాలు ఉత్పత్తులను చుట్టుకు వాడుతున్నారు. వీటిలో సల్ఫేట్, పారాబెన్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. పిల్లల సున్నితమైన జుట్టు ఈ రసాయనాలకు గురి అయిన తర్వాత తెల్లబడడం ప్రారంభమవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు వీలైనంత వరకు కుంకుడుకాయ రసం తీసి స్నానం చేయించేందుకు ప్రయత్నించండి. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా.
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు
పిల్లల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వారి జుట్టు తెల్లబడే అవకాశం ఉంది. ముఖ్యంగా థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, బొల్లి ఉన్న పిల్లల్లో జుట్టు తెల్లబడే అవకాశం ఎక్కువ. ఈ వైద్య పరిస్థితిలో మెలనిన్ ఉత్పత్తిని అదుపు చేస్తాయి. దీనివల్ల నలుపు రంగు ఉత్పత్తి కాక తెల్ల జుట్టు తెల్లగా మారిపోతుంది.
టాపిక్