




Best Web Hosting Provider In India 2024
అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్, నలుగురు మావోయిస్టులు మృతి
అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతాబలగాలు రెండు ఏకే-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా వై.రామవరం, జీకే వీధి మండలా సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగారు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ-ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్
తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గత 15 రోజులుగా కర్రెగుట్టల్ని కేంద్ర సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు.
కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో గత కొన్ని రోజులుగా దాదాపు 24 వేల మంది సాయుధ బలగాలు కొండల్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో 90 కిలోమీటర్లకు పైగా పొడవున విస్తరించి ఉన్న కర్రెగుట్టల్ని అణువణువు తనిఖీ చేస్తున్నాయి.
జవాన్లకు గాయాలు
ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో స్వల్ప సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి జవాన్లు గాయపడుతున్నారు. ఎండ తీవ్రతకు జవాన్లు అలసిపోతున్నారు. డీ హైడ్రేషన్ బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు.
మరోవైపు కాల్పులు విరమించి, చర్చలు జరపాలని మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో భార ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ ధృవీకరించారు. మృతులను గుర్తించాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్