



Best Web Hosting Provider In India 2024

గర్భధారణ సమయంలో నాభికి నూనె రాసుకోవడం మంచిదేనా? ఏ నూనె రాసుకోవాలి?
గర్భధారణ సమయంలో మహిళలు చాలా విషయాల గురించి అయోమయంలో ఉంటారు. ఈ సమయంలో కొందరు పొట్ట మీద నూనె రాసుకుంటే మంచిది అంటే మరికొందరు వద్దు అంటారు. ఈ రెండింటిలో ఏది నిజం? ఒకవేళ నూనె రాసుకుంటే నాభికి ఏ నూనెతో మసాజ్ చేసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుందాం రండి.
తల్లి కావడం అనేది ఆడవారికి అత్యంత ఆనందించదగిన విషయం. ప్రతి స్త్రీ అమ్మ అవడానికి అన్ని విధాలా తాపత్రయ పడుతోంది. ఇందుకోసం ఎన్నో శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు ఈ మార్పులు గర్భధారణ ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తాయి. గర్భాధారణ సమయంలో శరీర బరువు పెరగడం , హార్మోన్ల ప్రభావం వల్ల మహిళల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని ఫలితంగా కాళ్ళు, నడుము నొప్పి వంటి సమస్యలు సర్వసాధారణం.
ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి శరీరాన్ని రిలాక్స్ చేయడానికి అనేక మంది మొదటి త్రైమాసికం తర్వాత నూనెతో మర్దన చేసుకోవడం సురక్షితమని చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తారు. మరికొందరు కాదంటారు. అయితే, గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా బొడ్డుకు నూనె రాసుకోవడం మంచిదేనా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు , తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
గర్భధారణ సమయంలో బొడ్డుకు నూనె రాసుకోవడం మంచిదేనా?
నివేదికల ప్రకారం గర్భధారణ సమయంలో బొడ్డు, దాని చుట్టూ నూనె రాసుకోవడం మంచిదే. ఇది ఒక ఒక సాంప్రదాయ పద్ధతి. ఇలా చేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంతో పాటు స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించవచ్చని నమ్ముతారు. అంతేకాదు ఈ పద్ధతి వల్ల చర్మానికి తేమ లభిస్తుంది. అయితే దీని కోసం సరైన నూనెను ఎంచుకోవడంతో పాటు దానిని సరిగ్గా అప్లై చేయడం ముఖ్యం. ఎలాగో చూద్దాం..
గర్భధారణ సమయంలో బొడ్డుకు ఏ నూనెను ఎలాంటి ప్రయోజనాలను పొందచ్చు?
గర్భధారణ సమయంలో బొడ్డుకు నూనె రాసుకోవడానికి అనేక రకాల సహజ నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మీ అవసరాలు , చర్మ తత్వాన్ని బట్టి సరైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం. అవేంటో వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
బాదం నూనె:
బాదం నూనె తేలికగా ఉంటుంది, చర్మంలోకి సులభంగా గ్రహించబడుతుంది. ఇందులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, తేమను నిలుపుకోవడానికి , సాగే గుణాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంట్లోని శాంతపరిచే లక్షణాలు చర్మానికి హాయినిస్తాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది చర్మానికి కావలసినంత తేమను అందించి, పొడిబారకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా , ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆలివ్ నూనె:
నూనెలో ఒలీక్ ఆమ్లం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి పోషణను అందించి, మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఆముదం నూనె:
సాధారణంగా ఆముదం నూనెను మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల కోసం ఉపయోగిస్తారు. బొడ్డుకు రాసుకున్నప్పుడు ఇది కడుపు నొప్పి, వాపు , తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడవచ్చు అని కొందరు నమ్ముతారు. అయితే, గర్భధారణ సమయంలో దీని వినియోగం గురించి వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.