థ్రిల్లింగ్‍గా సాగే క్రైమ్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది.. యూట్యూబ్‍లో తెలుగులో ఫ్రీగా చూడొచ్చు.. మిస్ అవొద్దు!

Best Web Hosting Provider In India 2024

థ్రిల్లింగ్‍గా సాగే క్రైమ్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది.. యూట్యూబ్‍లో తెలుగులో ఫ్రీగా చూడొచ్చు.. మిస్ అవొద్దు!

యూట్యూబ్‍లో ఉచితంగా థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి కొన్ని మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మలయాళ చిత్రాలు తెలుగులో ఉచితంగా చూసేయవచ్చు. అలాంటి ఓ మూవీ గురించి ఇక్కడ తెలుసుకోండి.

థ్రిల్లింగ్‍గా సాగే క్రైమ్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది.. యూట్యూబ్‍లో తెలుగులో ఫ్రీగా చూడొచ్చు

కొన్ని మలయాళ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍‍లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సబ్‍స్క్రిప్షన్ లేకున్నా వీటిని ఉచితంగా చూసేయవచ్చు. వాటిలో కోల్డ్ కేస్ (Cold Case) మూవీ కూడా ఉంది. ఈ మలయాళ క్రైమ్ హారర్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ట్విస్టులతో థ్రిల్లింగ్‍గా ఈ చిత్రం సాగుతుంది. వివరాలు ఇవే..

యూట్యూబ్‍లో ఎక్కడ చూడొచ్చు!

కోల్డ్ కేస్ సినిమా తెలుగు డబ్బింగ్‍‍లో తెలుగు ఫిల్మ్ నగర్ అనే యూట్యూబ్‍ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని ఆ ఛానెల్‍లో ఉచితంగా చూడొచ్చు.

కోల్డ్ కేస్ చిత్రం 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మలయాళంలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ తర్వాత తెలుగు డబ్బింగ్‍తో ఆహా ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్‍లోనూ తెలుగు డబ్బింగ్‍తో అందుబాటులో ఉంది. యూట్యూబ్‍లో ఉచితంగా చూడొచ్చు.

కోల్డ్ కేస్ మూవీ గురించి..

కోల్డ్ కేస్ చిత్రానికి శ్రీనాథ్ వీ నాథ్ కథను అందించగా.. తనూ బాలక్ దర్శకత్వం వహించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‍తో పాటు హారర్ టచ్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ట్విస్టులతో ఈ స్టోరీ సాగుతుంది. నరేషన్ కూడా చాలా చోట్ల గ్రిప్పింగ్‍గా ఉంటుంది. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్‍తో పాటు ఆదిత్ బాలన్, పూజా మోహన్‍రాజా, అనిల్ నెడుమంగద్, సుచిత్ర పిళ్లై, ఆత్మీయ రాజన్ కీలకపాత్రలు పోషించారు.

కోల్డ్ కేస్ మూవీకి ప్రకాశ్ అలెక్స్ సంగీతం అందించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, ప్లాన్ జే స్టూడియోస్, ఏపీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, జోమోన్ టీ జాన్, షమీర్ మహమ్మద్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. ఈ సినిమా మలయాళంలో 2021 జూన్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి నేరుగా వచ్చింది. కరోనా ప్రభావంతో అప్పట్లో థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు మేకర్స్. దీంతో ఓటీటీలోకి తీసుకొచ్చారు.

కోల్డ్ కేస్ స్టోరీలైన్

క్షుద్రపూజలు తరచూ జరుగుతున్న చోట కవర్‌లో చుట్టి ఉన్న ఓ పుర్రెను జాలరి చూస్తాడు. అక్కడి ఏసీపీ సత్యజిత్ (పృథ్విరాజ్ సుకుమారన్) ఈ కేసు దర్యాప్తును చేపడతాడు. ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీని, కిల్లర్‌ను కనుగొనేందుకు విచారణ మొదలుపెడతాడు. జర్నలిస్ట్ మేధా (అదితి) కూడా ఈ కేసు గురించి ఆరా తీస్తుంటారు. అసలు ఆ పుర్రె ఎవరిది? ఆ హత్య ఎవరు చేశారు? క్షుద్రపూజల సంగతేంటి? ఈ మిస్టరీని సత్యజిత్ ఛేదించాడా? ఈ కేసుతో మేధాకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు కోల్డ్ కేస్ సినిమాలో ఉంటాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్‍తో పాటు హారర్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024