ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తున్న తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..

Best Web Hosting Provider In India 2024

ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తున్న తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..

Hari Prasad S HT Telugu

ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్: తమన్నా నటించిన థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఊహించినదాని కంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తున్న తమన్నా థ్రిల్లర్ మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్

ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్: ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. బడ్జెట్ లో కనీసం సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. మరికొన్ని గంటల్లోనే ఓదెల 2 డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్

తమన్నా భాటియా నటించిన ఓదెల 2 మూవీ గురువారం (మే 8) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓదెల 2 స్ట్రీమింగ్ కాబోతోంది.

ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు.

ఓదెల 2 మూవీ ఎలా ఉందంటే?

తమన్నా భాటియా చాలా రోజుల తర్వాత నటించిన తెలుగు మూవీ ఈ ఓదెల 2. అందులోనూ ఓదెల రైల్వేస్టేషన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్, హారర్ జానర్లో తెరకెక్కించారు. తొలి సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ మొదలవుతుంది.

పెళ్లయిన ఆడవాళ్లను పాశవికంగా అనుభవించే ఓ సైకో చనిపోయి ప్రేతాత్మగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఓదెల 2ను తెరకెక్కించారు. ఇందులో తమన్నా ఓ నాగసాధువుగా నటించడం విశేషం. ఓ థ్రిల్లర్ మూవీ కావడంతో కథను అందుకు తగినట్లుగానే నడిపించినా, మ్యూజిక్ అందుకు ప్లస్ అయినా.. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఓదెల 2 బాక్సాఫీస్ దగ్గర మేకర్స్ కు నష్టాలను మిగిల్చింది. ఈ మూవీని రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ 20 రోజుల్లో ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్లు రూ.6 కోట్లు కూడా దాటలేదు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024