జీ5 ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన 7 మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Best Web Hosting Provider In India 2024

జీ5 ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన 7 మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..

Hari Prasad S HT Telugu

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మీరు అభిమానులైతే జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీస్ ను మిస్ కాకుండా చూడండి. వీటిలో కొన్ని తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉన్నాయి. మరి ఆ మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏవో తెలుసుకోండి.

జీ5 ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన 7 మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జీ5లో కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. వీటిలో ఈ మధ్యే వచ్చిన టొవినో థామస్, త్రిష నటించిన ఐడెంటిటీ నుంచి మరెన్నో సినిమాలను చూడొచ్చు. మరి ఈ ఓటీటీలో ఉన్న వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో చూడండి.

ఐడెంటిటీ

ప్రముఖ మలయాళ నటుడు టొవినో థామస్, త్రిష నటించిన మూవీ ఐడెంటిటీ. ఇదొక సూపర్ క్రైమ్ థ్రిల్లర్. ఓ పోలీస్ ఆఫీసర్, ఓ జర్నలిస్ట్, ఓ స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరిగే కథ. అమ్మాయిలను వేధించే ఓ క్రిమినల్ ను హత్య చేసింది ఎవరు? ఆ కేసును దర్యాప్తు చేసే తీరుతెన్నులను చూపిస్తూ సాగే కథ. ఊహకందని ట్విస్టులతో ఈ ఐడెంటిటీ థ్రిల్ ను పంచుతుంది.

పాకులమ్ పాతిరవుమ్

కుంచకో బొబన్, రజిషా విజయన్ నటించిన మూవీ ఈ పాకులమ్ పాతిరవుమ్. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మావోయిస్టుల నియంత్రణలో ఉండే వయనాడ్ అడవుల బ్యాక్‌డ్రాప్ లో మూవీ సాగుతుంది. మైఖేల్ అనే ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓ సీక్రెట్ మిషన్ లో భాగంగా అక్కడికి వెళ్తాడు. మూవీలోని ట్విస్టులు అలరిస్తాయి. 2023లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.

వోల్ఫ్

అర్జున్ అశోకన్, సంయుక్త మేనన్ నటించిన మూవీ వోల్ఫ్. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. సంజయ్ అనే యువకుడు తన కాబోయే భార్య ఆశను చూడాలని అనుకుంటాడు. కానీ ఈ జర్నీలో అతడు కొన్ని ఊహించని పరిణామాలను ఎదుర్కొంటాడు.

పాప్పన్

సురేష్ గోపి, నీతా పిళ్లై నటించిన మూవీ పాప్పన్ (Paappan). ఇదొక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓ హోమిసైడ్ కేసును పరిష్కరించడానికి తిరిగి వచ్చే ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే మూవీ ఇది. ఈ మూవీలో సురేష్ గోపి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇని ఉత్తరం

అపర్ణ బాలమురళీ, కలాభవన్ షాజోన్ నటించిన మూవీ ఇని ఉత్తరం (Ini Utharam). ఈ సినిమా జానకి అనే డాక్టర్ చుట్టూ తిరుగుతుంది. తాను ఓ హత్య చేసినట్లు ఆమె అంగీకరిస్తుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ, అందులో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

పుతియ నియమం

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, నయనతార నటించిన మూవీ పుతియ నియమం (Puthiya Niyamam). ఇదొక రివేంజ్ థ్రిల్లర్. తన సొంత మనిషిపైనే ప్రతీకారం తీర్చుకోవాలని చూసే వాసుకి అనే మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో మమ్ముట్టి, నయనతార నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఆపరేషన్ జావా

ఆపరేషన్ జావా మూవీ ఓ సైబర్ క్రైమ్ థ్రిల్లర్. బాలు వర్గీస్, లుక్మన్ అవరన్ లీడ్ రోల్స్ లో నటించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సైబర్ నేరాలను తీసుకొని వాటి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుందో ఈ మూవీలో చూపించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024