నిన్ను కోరి మే 8 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన కామాక్షి- జగదీశ్వరి అనుమతి, ఘోర అవమానం- గుడిలో చంద్రకళ ప్రదక్షిణలు

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 8 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన కామాక్షి- జగదీశ్వరి అనుమతి, ఘోర అవమానం- గుడిలో చంద్రకళ ప్రదక్షిణలు

నిన్ను కోరి సీరియల్ మే 8 ఎపిసోడ్‌లో జరిగిందంతా నిజం చెబుతాదమని జగదీశ్వరి ఇంటికి చంద్రకళ వెళ్తుంది. కానీ, కామాక్షి అడ్డుకుంటుంది. చంద్రకళను బయటకు పంపించేయమని జగదీశ్వరి అనుమతి ఇవ్వడంతో కామాక్షి మెడపట్టి గెంటేస్తుంది. తర్వాత గుడిలో 108 ప్రదక్షిణలు చేసి విరాట్‌తో పెళ్లి కావాలని కోరుకుంటుంది చంద్రకళ.

 
నిన్ను కోరి సీరియల్ మే 8 ఎపిసోడ్‌
 

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం మావయ్య జీవచ్ఛంలా ఉండటానికి కారణం పెద్దనాన్నే. మనం ఏం చేయలేదు. జరిగింది అంతా అత్తయ్యతో, విరాట్ బావతో నిజం చెబుతానని సుభద్ర, సౌజన్య, బామ్మకు చెబుతుంది చంద్రకళ. దాంతో వాళ్లు జగదీశ్వరి ఇంటికి చంద్రకళను నిజం చెప్పడం కోసం పంపిస్తారు.

 

నమ్మక ద్రోహం ఎలా చేశారో చెబుతావా

జగదీశ్వరి ఇంటికి వెళ్లిన చంద్రకళను అంతా విడ్డూరంగా చూస్తారు. జగదీశ్వరి ఇంట్లో ఎవరు కూడా చంద్రకళతో మాట్లాడరు. ఇక ఇంటికి వచ్చిన చంద్రకళపై కామాక్షి రగిలిపోతుంది. నానా మాటలు అంటుంది. విరాట్ బావతో మాట్లాడాలి, జగదీశ్వరి అత్తయ్యకు నిజం చెప్పాలి అని చంద్రకళ అంటుంది. కానీ, ఇంకా ఏం చెబుతావ్. మాకు ఎలా నమ్మకద్రోహం చేశారో చెబుతావా అని శృతి, శాలిని, కామాక్షి అంటారు.

బయటకు పంపించేయమన్న జగదీశ్వరి

అయినా చంద్రకళ అత్తయ్యతో మాట్లాడాలని మొండిగా ప్రవర్తిస్తుంది. అదంతా మేడ పై నుంచి జగదీశ్వరి, విరాట్ చూస్తుంటారు. విరాట్ సర్, అత్తయ్య మీతో మాట్లాడాలి అని చంద్రకళ ప్రాధేయపడుతుంది. కానీ, వాళ్లు ఒప్పుకోరు. ఇక విరాట్ కళ్ల ముందే తనను బయటకు పంపించేయమని జగదీశ్వరి అనుమతినిస్తూ చెబుతుంది. ఆ మాటను అలుసుగా తీసుకున్న శృతి, శాలిని, కామాక్షి చంద్రకళ మెడ పట్టి బయటికి గెంటేస్తారు.

మమ్మల్ని మాట్లాడమంటావా

జగదీశ్వరి ఇంట్లో తనకు జరిగిన ఘోర అవమానాన్ని తలుచుకుంటూ ఏడుస్తుంటుంది చంద్రకళ. బాధతో కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ తన ఇంటికి వెళ్లిపోతుంది. అది సుభద్ర చూసి మీ అత్తయ్యకి నిజం చెప్పావా అని చంద్రకళను అడగడుతుంది. లేదు అమ్మ అని జగదీశ్వరి ఇంట్లో జరిగినదంతా తల్లికి చంద్రకళ చెబుతుంది. అయ్యో అలా జరిగిందా. మరి మేము అయినా ఫోన్ చేసి మాట్లాడమంటావా అని సుభద్ర అంటుంది.

 

ఎలాగైనా నువ్వే చెప్పు

లేదమ్మా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయ్. నేను ఎలాగైనా విరాట్ బావతో నిజం చెప్తాను. సమయం సందర్భం చూసుకుని ఎలాగైనా విరాట్ బావతో మాట్లాడుతాను అని చంద్రకళ తల్లికి నచ్చజెబుతుంది. చంద్రకళ మీద నమ్మకంతో సుభద్ర, సౌజన్య, బామ్మ ముగ్గురు సరే అంటారు. నువ్వే ఎలాగైనా చెప్పు అని చెబుతారు.

నా మెడలో తాళి కట్టాలి

ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే గుడికి వెళ్తుంది చంద్రకళ. దేవుడికి దండం పెట్టుకున్న చంద్రకళ ఎలాగైనా విరాట్ బావ నా మెడలో తాళి కట్టాలి. మా ఇద్దరి పెళ్లి అవ్వాలని వేడుకుంటుంది. అలా అయితేనే నేను ఏ తప్పు చేయలేదనే నిజం బావకు తెలుస్తుంది అని చంద్రకళ అనుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పూజారి ఈరోజు మంచి రోజు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఏ కోరికలు కోరుకున్న మంచి జరుగుతుంది అని చెబుతాడు.

చంద్రకళ 108 ప్రదక్షిణలు

దాంతో చంద్రకళ దేవుడితో విరాట్ బావతో నా పెళ్లి జరిగేలా చూడు స్వామి అని వేడుకొని పంతులు గారు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకుంటుంది. 108 సార్లు గుడిలో ప్రదక్షిణలు చేస్తుంది. దేవుడికి దండం పెట్టుకొని విరాట్ బావతో తన పెళ్లి జరగాలని చంద్రకళ కోరుకుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 

Best Web Hosting Provider In India 2024