





Best Web Hosting Provider In India 2024

మొటిమలను, మచ్చలను తగ్గించే నేచురల్ ఫేస్ ప్యాక్‌లు ఇవిగో, వీటిని ఇంట్లోనే వేసుకోవచ్చు
వేసవిలో మొటిమలు-మొటిమల చర్మం ఉన్నవారికి టెన్షన్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ముఖంపై సరైన సంరక్షణ అవసరం. ఇక్కడ మేము కొన్ని ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేయాలో వివరిస్తున్నాము. వీటిని ప్రయత్నించడం ద్వారా చురుకైన మొటిమలు, మొటిమల మచ్చలు మరియు మచ్చలను వదిలించుకోవచ్చు.
ముఖంపై మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారు ఎంతో మంది. ముఖ్యంగా అమ్మాయిలకే ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అమ్మాయిలందరూ మచ్చలేని, ప్రకాశవంతమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు.
అయితే వేసవి కాలంలో పరిశుభ్రమైన చర్మాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మొటిమల చర్మాన్ని నిర్వహించడానికి సరైన జాగ్రత్తలు అవసరం. మచ్చలేని చర్మాన్ని పొందడానికి వీలయ్యే కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి ఇక్కడ చెప్పాము. ఇంట్లోనే తయారుచేసుకునే నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
తేనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్
ప్రతి ఇంట్లో తేనె, దాల్చిన చెక్క ఉంటుంది. వీటితోనే మీరు అదిరిపోయే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. తర్వాత తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్
ఇక పసుపు, పెరుగు లేని ఇళ్లే ఉండవు. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు. ఒక టీస్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. తర్వాత పెరుగులో పసుపు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేయాలి. చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
తేనె, నిమ్మకాయ ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి. తర్వాత దీన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
వేప, పసుపు ఫేస్ ప్యాక్
రెండు టేబుల్ స్పూన్ల వేప పొడి, ఒక టీస్పూన్ పసుపు, రోజ్ వాటర్ తీసుకోండి. తర్వాత రోజ్ వాటర్ లో వేప పొడి, పసుపు మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
పసుపు, పాలు ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ తయారీకి రెండు టీస్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
ఇక్కడిచ్చిన ఫేస్ ప్యాక్ వేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. కాబట్టి బ్యూటీ పార్లర్ కు వెళ్లి వందలు ఖర్చుపెట్టే బదులు ఇలా ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటే మంచిది.