Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 8 ఎపిసోడ్: సత్య ఎంగిలి తాగిన రామ్- ఒకేలా ఆలోచించిన యామిని రుద్రాణి- గతం గుర్తుకొచ్చి స్పృహ కోల్పోయిన రాజ్!
Brahmamudi Serial May 8th Episode: రిసార్టులో సత్యం ఎంగిలి నీల్లను రామ్ తాగుతాడు. దాంతో కావ్య కోపంగా వెళ్లిపోతుంది. మనసులో మాట చెప్పడానికి రామ్ ట్రై చేస్తుంటే యామిని అడ్డుకుంటుంది. రాజ్, కావ్య లవ్ స్టోరీని కల్యాణ్, అప్పు తమ కథగా చెబుతారు. దాంతో రాజ్‌కు గతం గుర్తుకు వచ్చినట్లు అవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రామ్‌కు సత్య ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంది. అది రామ్ తీసుకుంటాడు. దాంతో కోపంగా కావ్య ప్లేట్ పగులకొడుతుంది. ఓహో.. నేనే వేరే అమ్మాయికి క్లోజ్‌గా ఉంటే మేడమ్ గారెకి కోపం వస్తుందన్నమాట అని రామ్ మనసులో అనుకుంటాడు.కావ్య కోపంగా వచ్చి రామ్ పక్కనే కూర్చొంటుంది.
సత్య ఎంగిలి
ఏంటీ కళావతి గారు ప్లేట్ పగులగొట్టారు. నాకోసం తీసుకొస్తున్నారనుకున్నాను అని రామ్ అంటే.. మీకోసం తీసుకొచ్చేవారు చాలా మంది ఉన్నారుగా అని కావ్య అంటుంది. తర్వాత రాజ్‌కు పొలమారడంతో పక్కనే ఉన్న గ్లాస్ తీసుకుని తాగుతాడు. కావ్య ఇచ్చిన గ్లాస్ తీసుకోడు. రామ్ నీళ్లు తాగిన తర్వాత.. అది నేను ఎంగిలి చేసిన గ్లాస్ అని సత్య అంటుంది. అందుకేనా నీళ్లు అంత స్వీట్‌గా ఉన్నాయని రామ్ పులిహార కలుపుతాడు.
దానికి కావ్య కోపగించుకుంటే.. అంతా ఏయ్.. ఏయ్.. అని ఆట పట్టిస్తారు. మీ అన్నయ్య కన్నయ్య అనుకుంటున్నాడా రెచ్చిపోతున్నాడు అని కల్యాణ్‌తో గొడవ పడుతుంది అప్పు. సారీ రామ్. మీరిద్దరు లవర్స్ అని తెలియక నేను నీకు ఫుడ్ తీసుకొచ్చాను అని సత్య అంటుంది. మేము లవర్స్ ఏంటీ అని రాజ్ అంటాడు. ఏం తెలియనట్లు మాట్లాడకండి. కళావతి గారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు తెలియదా అని సత్య అంటాడు.
మీకు ఇంకా అర్థం కాలేదా. నేను మీకు ఫుడ్ తీసుకొచ్చాను అని తను ప్లేట్ కిందపడేసింది. నేను తాగిన నీళ్లు మీరు తాగాను అని తను వెళ్లిపోయింది. ఇప్పుడు వెళ్లి నిలదీయండి సార్. తన మనసులో మాట చెప్పకపోతే నాపేరు సత్యే కాదు అని సత్య అంటుంది. దాంతో తీస్తా అని రాజ్ వెళ్లిపోతాడు. ఏం చెప్పావ్. అలా వెళ్లిపోతున్నాడు అని అప్పు అడుగుతుంది.
కవర్ చేసిన కావ్య
నేను ఒక నిజం చెప్పాను. అది తెలుసుకోడానికే వెళ్తున్నాడు. కళావతి గారు రామ్‌ను ఇష్టపడుతుందని చెప్పాను అని సత్య అంటుంది. దాంతో షాక్ అయిన కల్యాణ్ చంపేశావ్ అని అప్పుతో వెళ్లిపోతారు. రాజ్ మీద కోపం డెకరేషన్ వాళ్లపై చూపిస్తుంది కావ్య. దాంతో వచ్చి అడుగుతాడు రామ్. కావ్య కవర్ చేస్తుంది. రాజ్, కావ్య మాట్లాడుకోవడం యామిని వింటుంది.
మీరు చేసిందే కరెక్ట్ అనుకుంటారు. ఎదుటివాళ్ల మనసులో ఏముందో తెలుసుకోకుండా బాధపెడతారు అని కావ్య అంటుంది. మీ మనసులో ఏముందో చెప్పండి అని రాజ్ అంటాడు.ఏం తెలియనట్లు అడుగుతారు. నా మనసులో ఏముందో మీకు తెలియదా.. అని ఆగిపోతుంది కావ్య. ఏదో చెపుతూ ఆగిపోయారు. చెప్పండి. మీ మనసులో అని రాజ్ అడుగుతాడు.
ఇది నిజం చెప్పేలా ఉందని యామిని భయపడిపోతుంది. ఏదో ఉంది.. దాస్తున్నారు. అందుకే మొహం చాటేస్తున్నారు అని పదే పదే అడుగుతాడు రాజ్. అయినా ఏం దాచట్లేదని కావ్య చెబుతుంది. మీకు చెప్పడం ఇష్టంలేదో. నాతో చెప్పాలని చూస్తున్నారో నాకు తెలియదు. కానీ, నేనే చెబుతాను. రోడ్డు మీద మిమ్మల్ని చూసినప్పటి నుంచి తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మనకు ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని రాజ్ అంటాడు.
అడ్డుకున్న యామిని
ఇన్నాళ్లు నాలో కలిగిన ఫీలింగ్స్‌కు అర్థమేంటో తెలియకా మౌనంగా ఉండిపోయాను. ఇక ఉండలేను. మీరు నేను కూడా అనుకున్నట్లే ఫీల్ అవుతున్నారని ఆశిస్తున్నాను. నేను మిమ్మల్ని.. అది అంటూ నీళ్లు నములుతాడు. ఎక్కడ ప్రేమిస్తున్నాడో అని భయపడిన యామిని బావ అని పిలిచి అడ్డుకుంటుంది. ఇక్కడ ఉన్నావా. నీకోసం రిసార్ట్ మొత్తం వెతుక్కుంటూ వస్తున్నాను అని యామిని అంటుంది.
నేను తింటే కంపెనీ ఇద్దువు దా అని రాజ్‌ను బలవంతంగా తీసుకెళ్తుంది యామిని. ఏం చేయలేక రాజ్ వెళ్లిపోతాడు. కావ్య కోపంగా చూస్తూ ఉంటుంది. కల్యాణ్, అప్పు వెళ్లి యామిని అంతా కావాలని చేస్తుందని అంటారు. ఎంత చేస్తుంది. ఆయనకు గతం గుర్తుకు వస్తుంది. ఇవాళ రాత్రి మనం అనుకుంది జరిగితే చాలు అని కావ్య అంటుంది. ఒక్కసారి అన్నయ్యకు గతం గుర్తుకు వస్తే చాలు ఈ యామిని కథ అయిపోయినట్లే అని కల్యాణ్ అంటాడు.
రాత్రి అవుతుంది. అప్పు చీర కట్టుకుని అందంగా రెడీ అవుతుంది. కావ్య దగ్గర రాజ్ కూర్చోవడానికి ట్రై చేస్తుంటే.. అందులో యామిని వచ్చి కూర్చుంటుంది. స్టేజీ మీద సందీప్ తమ మ్యారేజ్ యానివర్సరీ గురించి మాట్లాడుతాడు. శ్రుతికి కావ్య సైగ చేస్తుంది. దాంతో సందీప్ వాళ్ల దగ్గరికి వెళ్లి మీ పరిచయం, పెళ్లి ఎలా జరిగిందో చెప్పమని శ్రుతి అడుగుతుంది.
100 ఇయర్స్ సందర్భంగా
అక్కడ జరిగేదంతా రుద్రాణి, రాహుల్ వెయిటర్స్ గెటప్‌లో ఉండి చూస్తుంటారు. మాది జస్ట్ స్టోరీ మాత్రమే. కానీ, మా పెళ్లి చేసింది మాత్రం కల్యాణ్, అప్పు. కాబట్టి వాళ్ల స్టోరీ గురించి వాళ్ల నోటీతోనే విందాం అని సందీప్ అంటాడు. మీది లవ్ స్టోరీనా. అయితే చెప్పండి అని రామ్ అంటాడు. దాంతో అప్పు, కావ్య స్టేజీపైకి ఎక్కి నిల్చుంటారు. మా కంపెని పెట్టి 100 ఇయర్స్ జరుపుకుంటున్నందుకు వినాయకుడి విగ్రహం పెట్టాలనుకున్నాం అని కల్యాణ్ చెబుతాడు.
రాజ్, కావ్య కలిసింది తాము కలిసినట్లుగా చెబుతాడు కల్యాణ్. దాంతో రామ్‌కు గతంలో జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత కావ్య ఇంటికి వచ్చింది, ఇంట్లో ముగ్గు వేయడం, స్వప్న డ్యాన్స్ చూసి పడిపోయాను అని కల్యాణ్ అంటాడు. అక్కను చూసి పడిపోతే చెల్లిని ఎలా పెళ్లి చేసుకున్నావ్ బ్రో అని టోనీ అడుగుతాడు. యామిని ఈ కథ నేను ఎక్కడో విన్నట్లుంది అని రామ్ అనుమానంగా అంటాడు.
ఊరుకో బావ. వీళ్లను కలుస్తుందే ఇప్పుడు కదా అని కవర్ చేస్తుంది యామిని. స్వప్నతో పెళ్లికి ఒప్పుకోవడం, సరిగ్గా పెళ్లి సమయానికి వాళ్ల అక్క పారిపోవడం, ఇంటి పరువు కాపాడటం కోసం ముసుగు వేసుకుని అక్క ప్లేసులో కావ్య కూర్చోవడం చెబుతారు కల్యాణ్, అప్పు. మరి తాళి ఎవరి మెడలో కట్టారో చెప్పండి. టెన్షన్‌గా ఉందని టోనీ, వాకర్ అంటారు. కల్యాణ్ సైగ చేస్తాడు.
అర్ధాంత్రంగా ఆపాలి
దాంతో మీకు ఎవరికైనా తెలుసా అని అందరిని అడిగిన టోనీ, వాకర్ చివరిగా నీకు తెలుసారా అని రామ్‌ను అడుగుతారు. ఇదంతా గతాన్ని గుర్తు చేయడానికి ప్లానా అని యామిని భయపడుతుంది. వీడేంట్రా రాజ్‌కు గతం గుర్తుకు తేవడానిటి ట్రై చేస్తున్నాడు. రిస్క్ తీసుకోకూడదురా. గతం గుర్తుకు వస్తే యామినిని వదిలేసి మన ఇంటికి వస్తాడు. అలా జరగకూడదంటే ఈ పార్టీ అర్థాంత్రంగా ఆగిపోవాలి అని రుద్రాణి అంటుంది.
తర్వాత టోనీ వాకర్ నేను చెబుతాను అని కల్యాణ్ పిలుస్తాడు. నాకు తలనొప్పిగా ఉంది. వెళ్లిపోదామని యామిని అంటే.. రానని, నువ్ వెళ్లి రెస్ట్ తీసుకో. నన్ను డిస్టర్బ్ చేయకు అని రామ్ అంటాడు. చెప్పాను కదా యామిని ఈరోజు జరిగేది ఎవరు ఆపలేరు. మా పరిచయం నుంచి శ్రీశైలంలో యాక్సిడెంట్ వరకు కవిగారు చెబుతూనే ఉంటారు. ఆఖరికి నువ్ ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశించావో కూడా చెప్పబోతున్నారు అని కావ్య అంటుంది.
ఈ రిసార్ట్ మొత్తానికి పవర్ సప్లై అయ్యే ఫ్యూజ్ వెతికి తీసేస్తే పార్టీ ఆగిపోతుంది అని మెయిన్ స్విచ్ కోసం వెతుకుతుంటారు రుద్రాణి, రాహుల్. ఈ స్టోరీ చెప్పకుండా చేయాలంటే ఆ మైక్ ఆగిపోవాలి. పవర్ తీసేస్తే పార్టీ ఆగిపోతుంది. తర్వాత మమ్మీకి చెప్పి ఈ సైడ్ పవర్ రాకుండా చేయొచ్చు అని యామిని వెళ్తుంది. రాజ్‌కు ముసుగు తీసి చూస్తే ఎవరో ఉన్నట్లు గుర్తుకు వస్తుంది.
స్పృహ కోల్పోయిన రాజ్
ఒకేలా ఆలోచించినా రుద్రాణి, రాహుల్, యామిని అనుకున్నట్లుగానే పవర్ తీసేస్తారు. కానీ, పార్టీలో ఉన్నవాళ్లంతా మొబైల్ లైట్స్ ఆన్ చేసి కల్యాణ్‌ను చెప్పమంటారు. రామ్ మరి వాళ్ల దగ్గరికి వెళ్లి చెప్పమంటాడు. దాంతో కల్యాణ్ చెబుతాడు. అది విన్న రాజ్‌కు గతం గుర్తుకు వచ్చి స్పృహ కోల్పోయి కిందపడిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.