Best Web Hosting Provider In India 2024

కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది!! వచ్చే ఏడాది ప్లీనరీ ఆ తర్వాత ప్రజల్లో పాదయాత్ర ప్రకటించిన వైఎస్ జగన్
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని, 2027లో ప్రజల్లో పాదయాత్ర నిర్వహిస్తానని ప్రకటించారు. పార్లమెంటు నియోజక వర్గాల పరిశీలకులు, కో ఆర్డినేటర్లతో జగన్ సమావేశమయ్యారు.
వైసీపీ హయంలో అమలు చేసిన ప్రతి పథకాన్ని ఆపేయడంతో పాటు, సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేయక పోవడంపై ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే ఆయుధం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. సరైన సమయంలో చంద్రబాబుకు ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో ఆఖండ విజయం తో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిమాణాలపై చర్చించి, పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
వైసీపీని అభిమానించే వారిని కొడుతున్నారని ఇబ్బంది పెడుతున్నారని తనను అభిమానించినందుకే వారికి దెబ్బలు తగులుతున్నాయని, వారిని రక్షించు కోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు.
జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని కార్యకర్తలకు మొదటి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యకర్తల్లో ఇప్పటికే చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో ఆరా చక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
రాజకీయా లతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటంపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉందని తెలిపారు. వైసీపీ హయాంలో పథకాలతో పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారన్నారు.
2027లో పాదయాత్ర
కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకొచ్చే అవకాశం లేదని 2027లో మళ్లీ పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నామని వివరించారు. ప్లీనరీలోనే పాదయాత్రతో పాటు పార్టీ రాజకీయ వ్యూహ నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు.
2014లో ఆదికా రంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసగించారని బాబు మోసాలపై పాదయాత్ర చేసి ప్రజలకు భరోసానివ్వగలిగానన్నారు. దాని వల్లే చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేకత, వైసీపీపై సానుకూలత 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. అదే తరహా పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు. . హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్ర బాబు మోసం చేస్తున్నారని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 2027లో నేను మరోసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.