Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చావుబతుకుల్లో దీప – కన్నీళ్లతో ప్రాధేయపడిన కార్తీక్ – బేరాలు ఆడిన జ్యోత్స్న
కార్తీక్ దీపం 2 మే 8 ఎపిసోడ్‌లో దీపకు బ్లడ్ ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడమని సుమిత్రతో చెబుతాడు దశరథ్. కానీ సుమిత్ర హాస్పిటల్ వెళ్లకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. బ్లడ్ ఇచ్చి దీపను కాపాడాలంటే ఖాళీ బాండ్ పేపర్స్‌పై సంతకం పెట్టమని కండీషన్ పెడుతుంది..
కత్తి పోట్లకు గురైన దీప చావుబతుకుల్లో ఉంటుంది. దీప బతకాలంటే బ్లడ్ అవసరమని డాక్టర్లు చెబుతారు. దీప, సుమిత్రది ఒకటే బ్లడ్ గ్రూప్ కావడంతో దీపకు రక్తం ఇచ్చి బతికించమని సుమిత్ర కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాడు కార్తీక్. కానీ సుమిత్ర అతడి మాటలకు కరగదు. కార్తీక్‌ను అవమానించి ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు శివన్నారాయణ.
బతికినా…జైలుకు వెళ్లాల్సిందే…
కార్తీక్ వెళ్లిపోగానే.. భార్యకు ప్రమాదం జరిగిందని వచ్చాడు కానీ…మావయ్యకు ఎలా ఉందో చూడటానికి వచ్చాడా అని పారిజాతం అంటుంది. కార్తీక్ రావాలని నేనేం కోరుకోలేదని శివన్నారాయణ అంటాడు. ఒకవేళ దీప బతికిన తర్వాత అయినా జైలుకు వెళ్లాల్సిందేనని చెబుతాడు. జైలుకు వెళుతుందో…పైకి వెళుతుందో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని అంటాడు.
దొంగ సాక్ష్యాలు చెప్పించినోడికి…
కాళ్లు పట్టుకున్నారని కరిగిపోవద్దని, దొంగ సాక్ష్యాలు చెప్పించినోడికి…రక్తం తెప్పించుకొని పెళ్లాన్ని బతికించుకోవడం తెలియదా అని కార్తీక్‌ను ఉద్దేశించి మనసులో కోపంగా అంటుంది పారిజాతం. నువ్వెమనుకుంటున్నావని సుమిత్రను అడుగుతాడు దశరథ్. దీప కోసం బ్లడ్ ఇవ్వడానికి వెళ్లాల్సిన అవసరం మనకు లేదని సుమిత్ర బదులిస్తుంది. కార్తీక్ కూడా మారిపోయాడని, దీప ఏం చెబితే అదే నిజమని నమ్మే స్థితిలో ఉన్నాడని సుమిత్ర నిందలు వేస్తుంది.
పొందిన సాయాన్ని మర్చిపోవద్దు…
పొందిన సాయాన్ని ప్రాణాలు ఉన్నంత వరకు మర్చిపోవద్దని భార్యతో అంటాడు దశరథ్. దీప ఒకప్పుడు నీ ప్రాణాలు కాపాడిందని, నువ్వు దీపకు రుణపడి ఉన్నావని, ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెబుతాడు. కానీ దీప అని సుమిత్ర అనబోగా…జ్యోత్స్న ప్రాణాలు తీయాలని అనుకుంది అంటావు.
నిజాలు సాక్ష్యాలతో నిరూపణ అయ్యే వరకు ఎవరు దోషులు కాదని సుమిత్రకు సర్ధిచెబుతాడు దశరథ్. ముందు నువ్వు వెళ్లి దీపకు రక్తమివ్వమని చెబుతాడు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్న వెంటనే వెళ్లమని చెబుతాడు. మీ కోసం వెళతానని దశరథ్‌కు బదులిస్తుంది సుమిత్ర.
నేను వెళతాను…
సుమిత్ర హాస్పిటల్‌కు వెళ్లకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. మమ్మీ బదులు తాను హాస్పిటల్‌కు వెళతానని చెబుతుంది. దీప ప్రాణాలు కాపాడి నా తల్లి రుణం నేను తీర్చుకుంటానని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది. జ్యోత్స్న గొప్ప మనసు చూసి సుమిత్ర పొంగిపోతుంది. జ్యోత్స్న గురించి నీకు పూర్తిగా తెలియదని మనసులో అనుకుంటాడు దశరథ్. దాసుకు గతం గుర్తుకు రావాలి, దీప బతకాలి…దీపకు దాసు చెప్పాలనుకున్న దానికి ఏదో సంబంధం ఉందని ఆలోచిస్తాడు.
కష్టం ఎందుకు తీసుకొచ్చావు…
శివన్నారాయణ, సుమిత్ర అన్న మాటలు గుర్తుచేసుకొని కార్తీక్ బాధపడతాడు. దీప బ్లడ్ గ్రూప్ కోసం తనకు తెలిసిన వారిని అందరిని అడుగుతాడు కార్తీక్. డోనర్స్ ఎవరు దొరకరు. అక్కడే వినాయకుడి విగ్రహం కనిపించడంతో…నా భార్యకు ఎందుకు ఇలాంటి కష్టం తీసుకొచ్చావు..తన ఎవరికి ఏం అన్యాయం చేసింది అని ఆవేదనకు లోనవుతాడు కార్తీక్. సాటి ఆడదాని జీవితం ఓ వెధవకు బలైపోతే కాపాడాలని అనుకుంది అది తప్పా అని అంటాడు.
దీప లాంటి మనిషికి అందమైన జీవితం ఉండకూడదా? అంటే నాశనం చేస్తావా అని నిలదీస్తాడు. నా వల్ల కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీప బతకాలంటే నేనే ఏం చేయాలి. నా కూతురు అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పమని దేవుడిని వేడుకుంటాడు కార్తీక్.
స్వప్న ప్రశ్నలు…
అప్పుడే డాక్టర్ ఫోన్ డోనర్ దొరికాడని, అర్జెంట్‌గా హాస్పిటల్‌కు రమ్మని అంటుంది. దీప చావుబతుకుల్లో ఉందని తెలిసి సుమిత్ర ఇంటి నుంచి ఒక్కరూ కూడా ఆమెను కాపాడటానికి రాకపోవడం బాధను కలిగిస్తుందని స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. స్వప్నను కాశీ ఓదార్చుతాడు. జ్యోత్స్న, కార్తీక్ ప్రేమించుకున్నారా? వాళ్ల ప్రేమను విడదీసి కార్తీక్‌ను దీప పెళ్లి చేసుకుంటే తప్పయ్యేది. అసలు కార్తీక్ మనసులో జ్యోత్స్న పట్ల ఎలాంటి ప్రేమ లేదని స్వప్న అంటుంది. దీపను పెళ్లిచేసుకోవాలని రాసిపెట్టిఉండటంతోనే ఆమె మెడలో కార్తీక్ తాళి కట్టాడని అంటుంది.
జ్యోత్స్నను చంపాలని అనుకుంది…
జైలు నుంచి బయటకు వచ్చిన దీపను వదిలిపెట్టలేదని, దీపను చంపాలన్న అవసరం జ్యోత్స్నకు తప్ప ఎవరికి ఉంటుందని స్వప్న అంటుంది. స్వప్న మాటలను దాసు వింటాడు. జ్యోత్స్ననే ఈ పనిచేసి ఉంటుందని అనుకుంటాడు. వెంటనే వెళ్లి దీపను చూడాలని కాశీ, స్వప్నకు కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోతాడు. స్వప్న హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకుంటే…కార్తీక్ వద్దన్నాడని ఆమెను కాశీ ఆపేస్తాడు.
పల్స్ డౌన్…
దీప పల్స్ డౌన్ అవుతుందని, ఆమె చనిపోతుందని నర్స్ అంటారు. ఆమె మాటలతో కాంచన, అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమిత్ర, జ్యోత్స్న ఎక్కడని కాంచన అంటుంది. వాళ్లు రామని అన్నారని కార్తీక్ బాధగా చెబుతాడు. డోనర్‌ను అరగంటలో తీసుకురావాలని కార్తీక్‌తో అంటుంది డాక్టర్. ఆ డోనర్‌కు కార్తీక్ ఫోన్ చేస్తాడు. అతడు హాస్పిటల్ బయటే ఉన్నానని, కానీ లోపలికి రాలేనని అంటాడు. టెన్షన్‌గా కార్తీక్ హాస్పిటల్ బయటకు వస్తాడు. కానీ డోనర్ ఎక్కడ కనిపించడు. ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుంది.
జ్యోత్స్న ఎంట్రీ…
కారులో నుంచి దిగిన జ్యోత్స్న టెన్షన్‌గా ఉన్న కార్తీక్ దగ్గరకు వస్తుంది. డోనర్‌కోసం చూస్తున్నావా అని అడుగుతుంది. ఆడిగిన సాయం చేయకుండా బంధువులు పరాయి వాళ్లు అయితే…అడక్కుండా సాయం చేసి పరాయివాళ్లు బంధువులు అయ్యారని జ్యోత్స్నతో కోపంగా అంటాడు కార్తీక్. మరి డోనర్ ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది.
డోనర్‌కు కాల్ చేస్తాడు కార్తీక్. అతడి ఫోన్ స్విఛాఫ్ అని వస్తుంది.నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసిన అతడి ఫోన్ స్విచాఫ్ అనే వస్తుందని జ్యోత్స్న అంటుంది. అతడిని తానే పంపించానని చెబుతుంది. జ్యోత్స్న చెప్పినప్పుడే ఆ డోనర్ నుంచి కార్తీక్‌కు కాల్ వస్తుంది…చెప్పినప్పుడే అతడి ఫోన్ స్విచాఫ్ అవుతుంది.
చనిపోయిందనే మాట వింటే…
దీప చనిపోయిందనే మాట వింటేగాని ప్రశాంతంగా ఉండవా…దీపకు ఎమైనా అవ్వాలి నిన్ను అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇవ్వబోతాడు కార్తీక్. ఇది వార్నింగ్ ఇచ్చే టైమ్ కాదని, దీప డెత్ బెడ్ మీద నిమిషాలు లెక్కబెడుతుందని, నువ్వు ఇప్పుడు దీపను కాపాడుకుంటావా? నాతో గొడవపడతావా అని జ్యోత్స్న అంటుంది.
జ్యోత్స్న బేరాలు…
నా భార్యను బతికించుకోవడానికి పదిహేను నిమిషాలే టైమ్ ఉందని, నీకు నా మీద ఏమన్న కోపం అంటే తర్వాత తీర్చుకో కానీ…డోనర్స్‌ను రాకుండా అపొద్దని బతిమిలాడుతాడు కార్తీక్. అతడు ఎంత బతిమిలాడిన జ్యోత్స్న కరగదు. మనుషులను చావు బతుకుల మధ్య నిలబెట్టి బేరాలు ఆడటం నీకు అలవాటే కదా…దీపను చంపడానికి కాకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నావని నిలదీస్తాడు.
చంపాలని అనుకుంటే నేను ఇక్కడి వరకు వచ్చేదానికి కాదని, నీ ముందుకు రాకుండానే డోనర్స్ ఆపేదానిని అని జ్యోత్స్న బదులిస్తుంది. దీపకు ఏదన్నా అయితే నువ్వు మరో కార్తీక్‌ను చూస్తావని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.
కార్తీక్ సంతకం…
దీప బతకాలి అంటే నువ్వో పనిచేయాలని ఖాళీ బాండ్ పేపర్స్ ఇచ్చి వాటిపై కార్తీక్‌ను సంతకం చేయమని జ్యోత్స్న అంటుంది. ఖాళీ పేపర్స్ మీద సంతకం పెట్టాలంటే ఏంటి అర్థం? నువ్వేం రాసుకుంటావో నాకు తెలుసు అని కార్తీక్ కోపంగా అంటాడు. నీకు దీప ప్రాణాలు, నాకు ఈ పేపర్స్‌పై నీ సంతకం కావాలి అని జ్యోత్స్న అంటుంది. నేను ఏం చెప్పిన చేస్తాను…వింటాను అని మనసా వాచా ప్రమాణం చేయడమే ఈ సంతకం సారాంశం అని జ్యోత్స్న అంటుంది.
టైమ్ వేస్ట్ చేయద్దు…
నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి నన్ను నీ దగ్గర తాకట్టు పెట్టుకోవాలా అని కార్తీక్ అంటాడు. మాటలతో టైమ్ వేస్ట్ చేయద్దని, ఆపరేషన్ చేయడానికి డబ్బు, బ్లడ్ కావాలని జ్యోత్స్న అంటుంది. ఒక్క సంతకం నువ్వు పెడితే అన్ని నేనే ఇస్తానని అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
కార్తీక్ దీపం 2 మే 8 ఎపిసోడ్‌లో దీపకు బ్లడ్ ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడమని సుమిత్రతో చెబుతాడు దశరథ్. కానీ సుమిత్ర హాస్పిటల్ వెళ్లకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. బ్లడ్ ఇచ్చి దీపను కాపాడాలంటే ఖాళీ బాండ్ పేపర్స్‌పై సంతకం పెట్టమని కండీషన్ పెడుతుంది.