




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు.. 6 చాలా స్పెషల్.. తెలుగులో 4 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 6 మూవీస్ ఉంటే అందులో కూడా మరింత ఇంట్రెస్టింగ్‌గా తెలుగు భాషలో 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, క్రైమ్, యాక్షన్, రొమాంటిక్ కామెడీ వంటి జోనర్స్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ అయ్యాయో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 08
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 08
జాక్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
ఫరెవర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 08
బ్లడ్ ఆఫ్ జీయూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 08
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె (ఇండోనేషియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- మే 08
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఓదెల 2 (తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 08
టెన్ హవర్స్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 08
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 08
ఓటీటీలో ఇవాళ 9 స్ట్రీమింగ్
ఇలా ఇవాళ (మే 08) ఒక్కరోజే 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సిద్ధు జొన్నలగడ్డ-వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్‌గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జాక్ మూవీ స్పెషల్‌గా ఉన్నాయి.
హారర్-క్రైమ్
అలాగే, మిల్కీ బ్యూటి తమన్నా మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓదెల 2, యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు-దీపికా పిల్లి యాక్ట్ చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితోపాటు హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ మిస్ కె, తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం టెన్ హవర్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
9 స్పెషల్-తెలుగులో 4
అయితే, ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన 9 సినిమాల్లో 6 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో కూడా తెలుగు భాషలో నాలుగు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇదెలా ఉంటే, నేటి ఓటీటీ రిలీజ్‌లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లో 6 డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి.
సంబంధిత కథనం