పాకిస్థాన్‍పై భారత్ చేసిన మెరుపు దాడుల ఆధారంగా వచ్చిన ఈ 4 సినిమాలను మిస్ అవొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

Best Web Hosting Provider In India 2024

పాకిస్థాన్‍పై భారత్ చేసిన మెరుపు దాడుల ఆధారంగా వచ్చిన ఈ 4 సినిమాలను మిస్ అవొద్దు! ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే..

 

పాకిస్థాన్‍పై ‘మిషన్ సిందూర్’ పేరిట భారత సాయుధ దళాలు దాడులు చేశాయి. ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ తరుణంలో గతంలో పాక్‍పై ఇండియా చేసిన వైమానిక దాడుల ఆధారంగా తప్పక చూడాల్సిన టాప్ 4 సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

 
పాకిస్థాన్‍పై భారత్ చేసిన మెరుపు దాడుల ఆధారంగా వచ్చిన ఈ 4 సినిమాలను మిస్ అవొద్దు!
 

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‍లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. గతంలోనూ పాకిస్థాన్‍పై భారత సాయుధ దళాలు కొన్ని సందర్భాల్లో దాడులు చేశాయి. వీటిలో కొన్నింటి ఆధారంగా సినిమాలు తెరకెక్కాయి. పాక్‍పై భారత దళాలు చేసిన మెరుపు దాడుల ఆధారంగా రూపొందిన 4 ముఖ్యమైన చిత్రాలు ఏవో.. ఏ ఓటీటీల్లో ఉన్నాయో వివరాలివే..

 

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్

ఉరిలోని ఆర్మీ హెడ్‍క్యార్టర్స్ మీద 2106లో ఉగ్రవాదులు చేసిన దాడికి బదులుగా పాకిస్థాన్‍పై భారత్ విరుచుకపడింది. పాక్ గడ్డపై అడుగుపెట్టి ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. ఇందుకోసం భారీ మిషన్ చేశారు. ఈ దాడుల ఆధారంగా 2019లో ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమా చిత్రం వచ్చింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో పరేశ్ రావల్, రజిత్ కపూర్, రాజ్వీర్ చౌహాన్ కీలకపాత్రలు చేశారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. భారత సైనికులు చేసిన సాహసాన్ని, వీరత్వాన్ని కళ్లకు కట్టింది. ఈ మూవీ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమాను ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చు. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఫైటర్

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు మరణించారు. ఈ దారుణానికి భారత సాయుధ దళాలు గట్టిగా బదులిచ్చాయి. పాకిస్థాన్‍లో బాలాకోట్‍పై భారత వైమానిక దళం విజృంచింది. వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా 2024లో ‘ఫైటర్’ సినిమా వచ్చింది.

 

ఫైటర్ చిత్రంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించగా.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్‍గానూ హిట్ సాధించింది. ఫైటర్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

స్కైఫోర్స్

1965లో పాకిస్థాన్‍లోని సర్గోదా ఎయిర్‌బేస్‍పై భారత్ దాడి చేసింది. పాక్‍పై ఇండియా చేసిన తొలి వైమానిక దాడి ఇదే. దీని ఆధారంగా బాలీవుడ్‍లో స్కైఫోర్స్ చిత్రం రూపొందింది. అక్షయ్ కుమార్, వీర్ పహారియా లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఈ ఏడాది జనవరి 24వ తేదీన విడుదలైంది.

స్కైఫోర్స్ సినిమాకు సందీప్ కెల్వానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆపరేషన్ వాలెంటైన్

భారత ఎయిర్‌ఫోర్స్ చేసిన బాలాకోట్ వైమానిక దాడి ఆధారంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం రూపొందింది. తెలుగు హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ 2024 మార్చి 1న విడుదలైంది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. అయితే, కమర్షియల్‍గా ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024