




Best Web Hosting Provider In India 2024

సీరియల్స్‌ను అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు, కానీ.. సమంత మూవీ రైటర్ వసంత్ మరింగంటి కామెంట్స్
సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గానే కాకుండా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. హారర్ కామెడీ జోనర్‌లో శుభం సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది సమంత. మే 9న శుభం రిలీజ్ కానుండగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శుభం మూవీ రైటర్ వసంత్ మరింగంటి సీరియల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. శుభం అనే హారర్ కామెడీ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన శుభం సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.
కీ రోల్ పోషించిన సమంత
సమంత కూడా కీ రోల్ పోషించిన శుభం మూవీ మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత మూవీ శుభం రైటర్ వసంత్ మరిగంటి సీరియల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సమంత వల్లే
రచయిత వసంత్ మరింగంటి మాట్లాడుతూ .. “సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. సమంత గారి వల్లే ఈ ప్రాజెక్ట్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రవీణ్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వం. సినిమా పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. మేం ‘సినిమా బండి’కి కలిసి పని చేశాం” అని అన్నారు.
తక్కువ చేస్తారు
“రాజ్ గారు మాకు ఎన్నో ఇన్‌పుట్స్ ఇచ్చారు. సీరియల్స్‌ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ, నాకు వాటిపై చాలా గౌరవం ఉంటుంది. అదే ఇందులో హారర్ ఫామ్‌లో చూపించాం. కుటుంబ సమేతంగా ఈ మూవీని చూడొచ్చు. మే 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని సమంత నిర్మించిన మూవీ శుభం రచయిత వసంత్ మరింగంటి తెలిపారు.
చాలా బాధగా అనిపించింది
ఇదే ఈవెంట్‌లో నటుడు చరణ్ మాట్లాడుతూ .. “వైజాగ్‌లో షూటింగ్ చేసి వెళ్లిన తరువాత చాలా బాధగా అనిపించింది. వైజాగ్‌ను వదిలి వెళ్లాలని అనిపించలేదు. ఇక్కడ షూట్ చేసిన చిత్రాలన్నీ హిట్ అవుతుంటాయి. మా కాలేజీలో సమంతకి ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. సమంత గారంటే నాకు చాలా అభిమానం. ఆమె చాలా కష్టపడుతుంటారు. సినిమాల పట్ల ఆమెకు చాలా ప్యాషన్ ఉంటుంది” అని అన్నాడు.
హారర్ కామెడీ ఇలా
“ప్రవీణ్ అన్న, వసంత్ అన్న కాంబినేషన్ బాగుంటుంది. మే 9న మా చిత్రం రాబోతోంది. హారర్, కామెడీ ఇలా అన్ని అంశాలుంటాయి. కచ్చితంగా థియేటర్‌లోనే శుభం సినిమా చూడండి” అని యాక్టర్ చరణ్ తెలిపాడు.
చాలా డేరింగ్‌గా
అలాగే, నటుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ .. “సమంత గారు చాలా డేరింగ్‌గా ‘శుభం’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మాతగా కనిపిస్తారు. ఈ చిత్రంతో ఎంతో మంది ఆర్టిస్టుల్ని పరిచయం చేసి మాతగా మారారు. ఇంకా ఇలాంటి చిత్రాలెన్నో నిర్మించాలి” అని అన్నాడు.
మంచి స్నేహితులు అయ్యారు
“ప్రవీణ్ కండ్రేగుల చాలా మంచి వ్యక్తి. వసంత్ గారి రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. హిమాన్ గారు సెట్స్‌లో చాలా సీరియస్‌గా ఉండేవారు. మృదుల కెమెరా వర్క్ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంతో నాకు చాలా మంది మంచి స్నేహితులు అయ్యారు. మే 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడదగ్గ చిత్రం శుభం” అని యాక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి పేర్కొన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్