ములుగు జిల్లాలో మందుపాతర పేలి ముగ్గురు గ్రౌహౌండ్స్‌ జవాన్ల మృతి.. వాడేజు-పేరూరు అడవుల్లో విషాదం

Best Web Hosting Provider In India 2024

ములుగు జిల్లాలో మందుపాతర పేలి ముగ్గురు గ్రౌహౌండ్స్‌ జవాన్ల మృతి.. వాడేజు-పేరూరు అడవుల్లో విషాదం

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

తెలంగాణలో మావోయిస్టుల మందుపాతరకు ముగ్గురు గ్రేహౌండ్స్‌ జవాన్లు బలయ్యారు. ఓ వైపు కర్రెగుట్టల్లో సీఆర్‌పిఎఫ్‌ బలగాలు పెద్దఎత్తున మావోయిస్టులపై విరుచుకు పడుతున్న వేళ, తెలంగాణలో మందు పాతర పేలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

ములుగు జిల్లాలో మావోయిస్టుల మందుపాతర పేలి ముగ్గురు జవాన్ల మృతి (AFP)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

తెలంగాణలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు- పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది.

ఆపరేషన్‌ కగార్‌ పేరిట చత్తీస్‌గడ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న వేళ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ములుగు జిల్లాలో తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులు లక్ష్యంగా ల్యాండ్ మైన్‌ను పేల్చారు. మందుపాతర పేల్చిన తర్వాత గాయపడిన పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని వీరభద్రాపురం, తడపాల గుట్టలపై మావోయిస్టుల కోసం గాలిస్తున్న గ్రేహౌండ్స్‌ ప్రమాదానికి గురయ్యారు.

గత నెల 21 నుంచి కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్‌లో బుధవారం పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తెలంగాణ గ్రేహౌండ్స్‌ రొటీన్‌ కూంబింగ్ చేపట్టాయి.

బలగాల కోసం మాటు వేసిన మావోయిస్టులు తెల్ల వారు జామున కూంబింగ్‌ కోసం వచ్చిన వారు లక్ష్యంగా మందుపాతరలు పేల్చారు. ఈ పేలుడుతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

MaoistsTelangana NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsTs Police
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024