వివాహం తర్వాత ఆ వ్యాధి వచ్చే అవకాశం పెరిగిపోతుందట, పెళ్లయిన వారు జాగ్రత్త

Best Web Hosting Provider In India 2024

వివాహం తర్వాత ఆ వ్యాధి వచ్చే అవకాశం పెరిగిపోతుందట, పెళ్లయిన వారు జాగ్రత్త

Haritha Chappa HT Telugu

వివాహం తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి అని చెబుతోంది కొత్త అధ్యయనం. వివాహం చేసుకున్న తర్వాత డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

పెళ్లి తరువాత డిమెన్షియా? (Pixabay)

జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన భాగం. వివాహం తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. కేవలం భౌతిక జీవితంలోనే కాదు ఆరోగ్యంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా వివాహం తర్వాత మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వివరిస్తోంది.

జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ అసోసియేషన్లో ప్రచురించిన ఒక కొత్త పరిశోధన ప్రకారం వివాహం అయినవారిలో మెదడు సంబంద వ్యాధి అయినా డిమెన్షియా అంటే చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువ.

వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి అనుబంధానికి దాని సొంత భావోద్వేగ వ్యవస్థ ఉంటుంది. అలాగే వివాహం మాత్రమే డిమెన్షియాకు ప్రధాన కారణం అని చెప్పలేము. అయితే ఇది రావడానికి ఇంకా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. భారతదేశంలో మాత్రం వివాహిత స్త్రీలలో చిత్త వైకల్యం రావడానికి వారి కుటుంబాలే కారణమని తెలుస్తోంది. వారు వివాహం అయ్యాక తమ కుటుంబం కోసం వ్యక్తిగత ఇష్టాలను, తమ కెరీర్ ను త్యాగం చేస్తారు. కానీ వారికి తగిన గుర్తింపు మాత్రం రాదు. ఆ బాధ వారిలో మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

డిమెన్షియా వంటి వ్యాధులు

వివాహం తర్వాత ఎవరైనా మానసికంగా, సంతృప్తిగా లేకపోతే వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహం తర్వాత భాగస్వాములు ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోయినా కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పెళ్లయిన వారిలోనే ఇలాంటి చిత్తవైకల్య వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు కొత్త పరిశోధనా చెబుతోంది.

చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అధికంగా తినేవారిలో కూడా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కూడా చిత్తవైకల్యం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మీపై మీరు శ్రద్ధ పెట్టండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులను చేయండి. కుటుంబం కోసం త్యాగం చేయడంలో తప్పులేదు కానీ మిమ్మల్ని మీరే త్యాగం చేసుకోకూడదు. అధిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల కూడా చిత్త వైకల్యం, డిమెన్షియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024