ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క్లైమ్యాక్స్ చూస్తే బిత్తరపోవాల్సిందే.. తెలుగులోనూ ఫ్రీగానే స్ట్రీమింగ్..

Best Web Hosting Provider In India 2024

ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క్లైమ్యాక్స్ చూస్తే బిత్తరపోవాల్సిందే.. తెలుగులోనూ ఫ్రీగానే స్ట్రీమింగ్..

Hari Prasad S HT Telugu

చూస్తే మలయాళం థ్రిల్లర్ సినిమాలే చూడాలని ఊరికే అనరేమో. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ క్లైమ్యాక్స్ చూస్తే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. ఓ మర్డర్ కేసులో హంతకుడిని పట్టుకునే తీరు ఊహకందని విధంగా సాగుతుంది.

ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క్లైమ్యాక్స్ చూస్తే బిత్తరపోవాల్సిందే.. తెలుగులోనూ ఫ్రీగానే స్ట్రీమింగ్..

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంటాయి. ఓ మర్డర్ కేసులో పోలీసుల విచారణ ఎలా సాగుతుందో కళ్లకు కట్టేలా అక్కడి ఫిల్మ్ మేకర్స్ చూపిస్తారు. చివరి వరకు అసలు హత్య ఎవరు చేశారో కనిపెట్టడం ప్రేక్షకులకు సాధ్యం కాని విధంగా కథను నడిపిస్తారు. అలాంటిదే అన్వేషిపిన్ కండెతుమ్ మూవీ.

అన్వేషిపిన్ కండెతుమ్ మూవీ స్టోరీ ఇదీ

ప్రముఖ మలయాళం నటుడు టొవినో థామస్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ అన్వేషిపిన్ కండెతుమ్ (Anweshippin Kandethum). అంటే జాగ్రత్తగా వెతికితే దొరకనిదంటూ ఏదీ ఉండదు అని దీని అర్థం. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది.

సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మనకు అర్థమవుతుంది. ఈ సినిమా ఇద్దరు అమ్మాయిల హత్యలను పరిష్కరించే ఎస్ఐ ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చుట్టూ తిరుగుతుంది. ఇది రెండూ వేర్వేరు హత్య కేసులు.

మొదటి అమ్మాయి హత్య కేసులో తన ఉన్నతాధికారులు కావాలని పక్కదారి పట్టించిన కేసును అతడు సమర్థంగా పరిష్కరిస్తాడు. అయితే తీరా దోషిని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో అతడు పారిపోవడానికి ప్రయత్నించి చనిపోవడంతో అతడు ఉద్యోగం కోల్పోతాడు.

కానీ ఆ జిల్లా ఎస్పీకి అతనిపై ఉండే నమ్మకంతో ఆరేళ్లుగా పరిష్కారం కాని మరో అమ్మాయి హత్య కేసును అతనికి అప్పగిస్తాడు. స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ వాళ్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పరిష్కరించలేని ఆ హత్య కేసును ఆనంద్ ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ అన్వేషిపిన్ కండెతుమ్ మూవీ స్టోరీ.

దిమ్మదిరిగే క్లైమ్యాక్స్

సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటేనే పోలీసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ వాళ్లు బయటపెట్టే రహస్యాలతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హత్య కేసుల్లో అసలు దోషి ఎవరన్నది ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా కథను నడిపించినప్పుడే ఇలాంటి సినిమాలు రక్తి కడతాయి.

ఈ అన్వేషిపిన్ కండెతుమ్ సరిగ్గా అలాంటి సినిమాయే. ఎస్ఐ ఆనంద్ పరిష్కరించే రెండు హత్య కేసుల్లోనూ చివరి వరకూ అసలు దోషి ఎవరన్నది ఊహించడం కష్టమే. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో చూసే ప్రేక్షకులను పక్కదారి పట్టించడానికి కొందరు అనుమానితులను చూపించడం సహజమే. ఈ సినిమాలోనూ అలాంటి వాళ్లు ఉంటారు.

కానీ రెండో హత్య కేసులో దర్యాప్తు సాగే తీరు, అంతకుముందు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ ఉత్తరం ఆధారంగా కేసును పరిష్కరించడం, అసలు ఊహకందని క్లైమ్యాక్స్ చూసే ఆడియెన్స్ కు థ్రిల్ పంచుతుంది. అసలు మొదటి నుంచి చివరి వరకూ సినిమాలో ఎలాంటి డైవర్షన్ లేకుండా రెండు హత్య కేసుల దర్యాప్తు సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది.

మాంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

అన్వేషిపిన్ కండెతుమ్ ఓ మాంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అందులోనూ రెండు హత్యలకు సంబంధించిన మిస్టరీ మరికాస్త ఎక్కువగానే థ్రిల్ చేస్తుంది. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నా లీడ్ రోల్ ఎస్ఐ ఆనంద్ నారాయణన్ చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రలో టొవినో థామస్ జీవించేశాడు.

గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీలో 7.4 రేటింగ్ నమోదైంది. ఆ తర్వాత మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే యూట్యూబ్ లోనూ అది కూడా తెలుగు ఆడియోతో ఫ్రీగా సినిమా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాలకు అభిమానులైతే దీనిని మాత్రం అస్సలు మిస్ కావద్దు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024