




Best Web Hosting Provider In India 2024

ద్రోణి ఎఫెక్ట్ – మరో 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురువనున్నాయి. ద్రోణి ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నాయి. వర్ష సూచన నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు వేసవి వేళ ఎండల తీవ్రత ఉండగా… మరోవైపు వానలు కూడా కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ద్రోణి ప్రభావం….
అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… దక్షిణతెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా ఉత్తర -దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఇది ఉంది. ఇక నైరుతి రుతుపవనాలు మే 12 నాటికి దక్షిణ అండమాన్ సముద్ర, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చు. బలమైన ఈదురుగాలులు గంటకు 40- 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చు. బలమైన ఈదురుగాలులు గంటకు 40- 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడొచ్చు. బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలోనూ వర్షాలు :
తెలంగాణలోనూ మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపు (మే 9) భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాజద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలోనూ రాత్రి సమయంలో తేలికపాటి వర్షాలు పడొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్