సచిన్ కూతురు సారా టెండూల్కర్ సినిమాల్లోకి వస్తోందా.. ఇదీ ఆమె సమాధానం.. కెమెరాలంటే భయమంటూ..

Best Web Hosting Provider In India 2024

సచిన్ కూతురు సారా టెండూల్కర్ సినిమాల్లోకి వస్తోందా.. ఇదీ ఆమె సమాధానం.. కెమెరాలంటే భయమంటూ..

Hari Prasad S HT Telugu

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ సినిమాల్లోకి వస్తోందా? ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెడుతోందన్న వార్తల్లో నిజమెంత? దీనిపై సారానే స్పందించింది. అయితే తనకు కెమెరాలంటేనే భయమని చెప్పడం విశేషం.

సచిన్ కూతురు సారా టెండూల్కర్ సినిమాల్లోకి వస్తోందా.. ఇదీ ఆమె సమాధానం.. కెమెరాలంటే భయమంటూ.. (Instagram/ saratendulkar)

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురుగా ప్రపంచానికి పరిచయమైన సారా టెండూల్కర్ ఆ తర్వాత తన అందంతో అభిమానులను ఆకర్షించింది. మోడలింగ్ వైపు రావడంతో ఆమె తర్వాత సినిమాల్లోనూ అడుగుపెడుతోందన్న వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సారా స్పందించింది. తనకు అసలు యాక్టింగ్ అంటేనే పడదని స్పష్టం చేసింది.

నేనో ఇంట్రావర్ట్.. యాక్టింగ్ నాకు సరిపడదు

సారా టెండూల్కర్ వోగ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇందులో తన చిన్నతనం, బయోమెడికల్ సైన్సెస్ పై తనకున్న ఆసక్తి, నటనలాంటి వాటిపై స్పందించింది. బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నావా అని అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.

“నేను ఒకటికి మించి పనులు చేస్తుంటాను. ఫౌండేషన్ పైనే ప్రస్తుతం నా దృష్టంతా. కానీ నేను ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ రంగాల్లోనూ క్రియేటర్ గా పని చేస్తాను. నాకు ఏది సరైనదనిపిస్తే అది చేస్తాను. నేను ప్రతిదానికీ సరే అని అనను. నటనలో నాకు ఎలాంటి ఆసక్తి లేదు.

నేనో ఇంట్రావర్ట్. కెమెరాలు నన్ను భయపెడతాయి. నాకు వచ్చిన అన్ని సినిమా అవకాశాలను వద్దనుకున్నాను. నేను దానికి న్యాయం చేయలేనని తెలుసు. అది నాకు సంతృప్తి కంటే ఎక్కువగా యాంగ్జైటీనే ఇస్తుంది” అని సారా టెండూల్కర్ స్పష్టం చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ రియాలిటీ కాదు

సారా తండ్రి సచిన్ ఓ క్రికెటర్, తల్లి అంజలి ఓ డాక్టర్. కానీ సారా మాత్రం ఎప్పుడూ స్పోర్ట్స్ వైపు చూడలేదు. బయోమెడికల్ సైన్స్ లో డిగ్రీ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో ఆమె మాస్టర్స్ చేసింది. సచిన్ నెలకొల్పిన ఫౌండేషన్ లో డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఎప్పుడూ అందంగా కనిపించాలన్న ఒత్తిడిపైనా సారా స్పందించింది.

“మనలో బలహీనతల గురించి ఎంతలా చూస్తుంటే అంతలా దొరుకుతూనే ఉంటాయి. ఇవాళ చేతులు, రేపు ముక్కు, ఆ తర్వాత జుట్టు. దీనికి ఎప్పుడూ ముగింపు ఉండదు. కొన్నిసార్లూ నాకూ అనిపిస్తుంది.. అరె ఆమె చర్మం చాలా బాగుంది అని. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడూ రియాలిటీ కాదు. ఎంతో మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు 15 స్టెప్ నైట్ రొటీన్ అంటూ చెబుతారు. కానీ దానిని కొనసాగించడం కష్టం. మనకు ఏది సూటవుతుందో అదే చేయాలి” అని సారా చెప్పింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024