ఓటీటీలోని చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు మిస్ కాకుండా చూడండి

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోని చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు మిస్ కాకుండా చూడండి

Hari Prasad S HT Telugu

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉన్నాయి. జీ5, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. మరి వీటిలో ఐదు మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో ఒకసారి చూద్దాం.

ఓటీటీలోని చాలా తక్కువ మందికి తెలిసిన బెస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు మిస్ కాకుండా చూడండి

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి త్వరలోనే క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ రాబోతోంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సిరీస్. అయితే ఇది వచ్చే ముందే కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాల్సినవి ఉన్నాయి. ఒకవేళ వీటిని ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి. నిజానికి తక్కువ మందికే ఈ సిరీస్ గురించి తెలుసు. కానీ చూస్తే మాత్రం మంచి థ్రిల్ గ్యారెంటీ.

ముర్షిద్ – జీ5 ఓటీటీ

ముర్షిద్ గతేడాది ఆగస్ట్ లో జీ5 ఓటీటీలోకి వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్రముఖ బాలీవుడ్ నటుడు కేకే మేనన్ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ముర్షిద్ పఠాన్ అనే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో అతడు నటించాడు. చాలా రోజుల కిందటే అండర్‌వరల్డ్ వదిలేసి వెళ్లిన అతడు.. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మరోసారి అందులోకి దిగాల్సి వస్తుంది. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సిరీస్ ఇది. కేకే మేనన్ తోపాటు తనూజ్ వీర్వానీ, జాకిర్ హుస్సేన్ లాంటి వాళ్లు కూడా నటించారు.

తనావ్ – సోనీలివ్ ఓటీటీ

కశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్. ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు కశ్మీర్ ఉగ్రవాదం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ సిరీస్ చూడొచ్చు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, స్పెషల్ టాస్క్ గ్రూప్ మధ్య జరిగే యుద్ధమే ఈ సిరీస్. లీడ్ రోల్ కబీర్ ఫరూఖీ పాత్రలో మానవ్ విజ్ నటించాడు. సోనీ లివ్ ఓటీటీలో ఈ సిరీస్ చూడొచ్చు.

క్రైమ్ బీట్ – జీ5 ఓటీటీ

క్రైమ్ బీట్ కూడా మాంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది అభిషేక్ సిన్హా అనే ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. పారిపోయి ఇండియాకు తిరిగి వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీని అతడు కవర్ చేస్తుంటాడు. క్రైమ్ రిపోర్టర్లు ఫీల్డ్ లో ఎదుర్కొనే సవాళ్లు, నేరాలు, రాజకీయాలు, మీడియా ఎథిక్స్ లాంటి అంశాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

గ్యారా గ్యారా – జీ5 ఓటీటీ

గ్యారా గ్యారా కూడా జీ5 ఓటీటీ అందించిన మరో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది 1990ల్లోని ఓ పోలీస్ అధికారి భవిష్యత్తులో ఓ కేసును విచారిస్తున్న మరో పోలీస్ అధికారితో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఇవ్వడం చుట్టూ తిరిగే కథ. ఈ ఇద్దరినీ కలిపేది ఓ వాకీటాకీ కావడం విశేషం. ప్రతి రోజూ రాత్రి 11:11 సమయంలో గతంలోని ఆ అధికారి ఆ వాకీటాకీ ద్వారా యుగ్ ఆర్య (రాఘవ్ జుయెల్) అనే పోలీస్ అధికారితో మాట్లాడుతుంటాడు. కొరియన్ సిరీస్ సిగ్నల్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది.

నక్సల్బరీ – జీ5 ఓటీటీ

గడ్చిరోలిలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ నక్సలైట్ ను అణచివేయడానికి ప్రయత్నించే ఓ ఎస్టీఎఫ్ ఏజెంట్ చేపట్టే మిషన్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది. నక్సలైట్ల ఉద్యమ మూలాలు, స్థానిక ప్రజానీకంపై వాళ్ల ప్రభావంలాంటి అంశాలను ఈ సిరీస్ ద్వారా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాజీవ్ ఖండేల్వాల్, రాఘవ్ జోషి, టీనా దత్త, కేతకీలాంటి వాళ్లు నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024