




Best Web Hosting Provider In India 2024

అపరాధి రివ్యూ – సినిమా మొత్తం మూడే పాత్రలు – సీరియల్ కిల్లర్‌గా ఫహాద్ ఫాజిల్ – రొటీన్‌కు భిన్నమైన క్లైమాక్స్
ఫహాద్ ఫాజిల్, దర్శనా రాజేంద్రన్, సౌబీన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో అపరాధి మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన అపరాధి మూవీ గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సౌబీన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మలయాళం మూవీ ఇరుల్‌కు అనువాదంగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
వీకెండ్ ట్రిప్‌లోకి సీరియల్ కిల్లర్…
అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఓ రైటర్ కమ్ బిజినెస్‌మెన్. అతడు రాసిన నవల పెద్ద హిట్టవుతుంది. అర్చన ( దర్శనా రాజేంద్రన్) అనే లాయర్‌ను ప్రేమిస్తాడు అలెక్స్. ఆమెతో కలిసి సర్‌ప్రైజ్ వీకెండ్‌ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఆ ట్రిప్‌లోనే అర్చనకు తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటాడు. ఈ ట్రిప్‌కు ఫోన్స్ తీసుకురాకూడదని అలెక్స్, అర్చన కండీషన్స్ పెట్టుకుంటారు.
ట్రిప్‌కు వెళుతోండగా…వర్షం కారణంగా ఓ కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట్రబుల్ ఇస్తుంది. దగ్గరలో ఓ ఇళ్లు కనిపించడంతో రాత్రికి అందులోనే ఉండాలని అనుకుంటారు. ఆ ఇంట్లో ఉన్ని (ఫహాద్ ఫాజిల్) ఒంటరిగా కనిపిస్తాడు. అలెక్స్,అ ర్చనలకు షెల్టర్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అనుకోకుండా అక్కడ ఓ మహిళ డెడ్‌బాడీ అలెక్స్‌కు కనిపిస్తుంది. ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ భావిస్తాడు.
అదే టైమ్‌లో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా అర్చనకు తెలుస్తాయి. ఉన్ని ఉన్న ఆ ఇంటికి ఓనర్ అలెక్స్ అనే నిజం బయటపడుతుంది. అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు. అలెక్స్, ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? ఆ బంగాళ నుంచి ప్రాణాలతో అర్చన బయటపడిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
మూడు పాత్రలు…
అపరాధి సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కేవలం మూడు పాత్రలతో ఒకే ఇంట్లో ఈ మూవీ సాగుతుంది. ఈ సినిమా రన్‌టైమ్ కూడా గంటన్నర మాత్రమే. సరదాగా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసిన ఓ జంట…ప్రియురాలికి సర్‌ప్రైజ్ ఇద్దామని అనుకున్న ప్రియుడు…అనుకోకుండా వారి మధ్యలోకి ఓ సీరియల్ కిల్లర్ రావడంతో ఏం జరిగింది అనే పాయింట్‌ను చివరి వరకు థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించాడు దర్శకుడు.
ఉన్ని, అలెక్స్‌లలో ఎవరు సీరియల్ కిల్లర్ అన్నది క్లైమాక్స్ వరకు రివీల్ కాకుండా సస్పెన్స్‌ను హొల్డ్ చేసిన విధానం బాగుంది.
సాధారణంగా సీరియల్ కిల్లర్ మూవీస్‌లో ట్విస్ట్‌లు ఎంత బాగా రాసుకుంటే సినిమా అంతగా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఆడియెన్స్ మెదడుకు పదునుపెట్టే ట్విస్ట్‌లేవి ఈ సినిమాలో కనిపించవు. ఒకటి, రెండు మలుపులు ఉన్నాఅవి ఈజీగానే గెస్ చేసేలా ఉన్నాయి.
డైలాగ్స్‌తోనే కథ…
అలెక్స్, అర్చన పాత్రల పరిచయం, వీకెండ్ ట్రిప్ ప్లాన్ లాంటి సన్నివేశాలతో సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఉన్ని ఇంట్లోకి అర్చన, అలెక్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా స్పీడు పెరుగుతుందా అంటే అదీ లేదు. ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ చెబుతూ పోతుంటారు. చాలా వరకు డైలాగ్స్‌తోనే కథను నడిపించాడు డైరెక్టర్.
రొటీన్‌కు భిన్నమైన క్లైమాక్స్…
ఉన్నిని సీరియల్ కిల్లర్‌గా అలెక్స్ భావించడం…అలెక్స్‌కు సంబంధించిన ఒక్కో సీక్రెట్‌ను ఉన్ని బయటపెట్టి అర్చనలో కన్ఫ్యూజ్‌ను క్రియేట్ చేసే సీన్స్ మాత్రం బాగున్నాయి. సాధారణంగా ప్రతి సినిమా క్లైమాక్స్‌లో విలన్ చనిపోతాడు. హీరోహీరోయిన్లు బతుకుతారు. ఈ సినిమాను మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఎండ్ చేశారు.
ఎవరికి వారే పోటీ…
యాక్టింగ్ పరంగా ఫహాద్ ఫాజిల్, దర్శన రాజేంద్రన్, సౌబీన్ షాహిర్ ఎవరికి ఎవరికి వారే పోటీపడి నటించారు. సీరియల్ కిల్లర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. డిఫరెంట్ లుక్, మ్యానరిజమ్స్తో అదరగొట్టాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే యువతిగా దర్శనరాజేంద్రన్ నాచురల్ యాక్టింగ్ తో మెప్పించింది. రైటర్ పాత్రకు సౌబీన్ షాహిర్ న్యాయం చేశాడు.
ప్రయోగాత్మక సినిమా…
ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను అపరాధి మూవీ మెప్పిస్తుంది. ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం ఈ మూవీ చూడొచ్చు.
సంబంధిత కథనం