




Best Web Hosting Provider In India 2024

మెదడు నరాలు రిలాక్స్ అవ్వాలంటే ప్రతిరోజు ఈ మూడు ఆసనాలు ప్రయత్నించండి
యోగా చేయడం శారీరక ఆరోగ్యానికే కాదు, మనసుకు కూడా ఎంతో ప్రయోజనకరం. కొన్నిరకాల యోగాసనాలు మెదడును రిలాక్స్ గా ఉంచుతాయి. ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి.
ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఒత్తిడి వల్ల మెదడు తీవ్రంగా అలసిపోతుంది. దీనివల్ల మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మెదడులోని నరాలలో ఫ్లాక్ పేరుకుపోవడం వల్ల ఆ నరాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంటే నరాలలో అడ్డంకులు ఏర్పడుతాయి.దీనివల్ల మెదడులోని రక్తనాళాలు పగిలిపోతాయి. ఒక్క రక్తనాళం పగిలినా చాలు… బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. కాబట్టి సిరల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తలనొప్పి ఆకస్మికంగా పెరిగిపోవడం, మాట్లాడడంలో ఇబ్బంది పడడం, దృష్టి మసకబారడం, తరచూ తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ సంకేతాలు మెదడు వ్యాధులను సూచిస్తాయి. వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి తగిన చికిత్సలు తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు మెదడును రిలాక్స్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం మీకు కొన్ని రకాల యోగాసనాలు ఉపయోగపడతాయి. ఇక్కడ మేము మూడు రకాల యోగాసనాల గురించి చెప్పాము. ఇవి మీకు మెదడును రిలాక్స్ గా ఉంచేందుకు ప్రయోజనకరంగా ఉంటాయి.
అధోముఖ స్వనాసనం
అధోముఖ స్వనాస్వనం చేయడం ద్వారా మెదడులో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసుకోవచ్చు. ఈ యోగాసనం చేస్తే మీకు మనసు, మెదడు తాజాగా అనిపిస్తుంది. ఈ ఆసనం వేయడం చాలా సులువు. మొదట నిటారుగా నిలబడాలి. తర్వాత మీ రెండు చేతులను నిలువుగా చాచాలి. వాటిని అలాగే నేలపైకి ఉంచాలి. అంటే వంగి నేలపైన ఆ రెండు అరచేతులను ఉంచాలి. అప్పుడు మీ శరీరం V ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీ తలను నేల వైపుకు ఉంచి లోతైన శ్వాస తీసుకోండి. ఇలా మీరు కొన్ని సెకన్ల పాటు ఉండి మరల ఇదే పద్ధతిలో ఆసనాన్ని వేస్తూ ఉండాలి.
హలాసనం
హలాసనం చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఈ ఆశ్రమం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొంచెం వేయడం కష్టంగానే అనిపిస్తుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి హలాసనం కష్టమైన ఆసనమనే చెప్పాలి. ఈ ఆసనం వేయడానికి ముందుగా మీరు నేలపై పడుకోవాలి. వీపును నేలకు తాకేలా ఉంచి పడుకోవాలి. దీని తర్వాత మీ రెండు కాళ్ళను పైకెత్తి అలా ముఖం మీద నుంచి తల మీద వైపుగా నేలను తాకించాలి. మీ పాదాలు నేలని తాకుతూ ఉండాలి. ఆ సమయంలో మీ రెండు చేతులు నేలపైనే నిటారుగా చాపాలి. అంతే ఈ హలాసనం వేసినట్టే. ఇది వేయడం కొంచెం కష్టమే. మొదట నిపుణుల పర్యవేక్షణలో వేస్తే మంచిది. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారు ఈ హలాసనం వేయడానికి కష్టపడాల్సి వస్తుంది.
సర్వాంగాసనం
మెదడుకు మేలు చేసే మరొక ఆసనం సర్వంగాసనం. ఇది తలలో రక్త ప్రవాహం పెరిగేలా చేస్తుంది. ఈ యోగాసనం వేయడం వల్ల మెదడులోని విష పదార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ ఆసనం వేయడానికి మొదట మీరు కింద పడుకోవాలి. తర్వాత మెల్లగా మీ కాళ్ళను పైకెత్తాలి. తర్వాత మీ రెండు చేతులతో మీ నడుమును పట్టుకొని…నడుమును కూడా కాళ్లతో పాటు నిటారుగా పైకెత్తాలి. కేవలం భుజం దగ్గర భాగాలు మాత్రమే నెలకు అనేలా ఉంటాయి. నడుము నుంచి కాళ్ల వరకు గాలిలో నిటారుగా నిలబెట్టాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉంచి మరల మెల్లగా కాలు కిందకు దించాలి. ఐదు నిమిషాలు పాటు ఈ ఆసనాన్ని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు మీకు మెదడుపై ఎంతో సానుకూల ప్రభావం పడుతుంది.
టాపిక్