మదర్స్ డే రోజున అమ్మ కోసం అదిరిపోయే స్వీట్ తయారు చేయండి! నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి దీని సొంతం!

Best Web Hosting Provider In India 2024

మదర్స్ డే రోజున అమ్మ కోసం అదిరిపోయే స్వీట్ తయారు చేయండి! నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి దీని సొంతం!

Ramya Sri Marka HT Telugu

మదర్స్ డేకి మీ అమ్మ కోసం ప్రత్యేకమైన నోరూరించే స్వీట్ చేయాలనుకుంటున్నారా? రొటీన్ కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు కాకుండా అన్ని స్వీట్ల రుచిని ఒకేసారి అందించే ఈ అద్భుతమైన డెజర్ట్ ట్రై చేయండి. అదే క్రీమీ రస్క్ పుడ్డింగ్! చాలా సులభంగా తయారుచేసుకోగలిగే ఈ స్వీట్ రుచిలో అమోఘంగా ఉంటుంది. తప్సకుండా ట్రై చేయండి.

క్రీమీ రస్క్ పుడ్డింగ్ (Pinterest)

మదర్స్ డేకి మీ అమ్మ కోసం తియ్యటి, నోరూరించే స్వీట్ చేయాలనుకుంటున్నారా? రొటీన్ కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు కాకుండా ప్రత్యేకమైన స్వీట్ అయితే బాగుంటుంది అని ఫీలవుతున్నారా? అయితే క్రీమీ రస్క్ పుడ్డింగ్ డెజర్ట్ ను ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి, మలాయి కేక్ మృదుత్వం, ఐస్‌క్రీమ్ చల్లదనం, రసమలై తియ్యదనం… అన్నీ కలగలిపి ఒకేదానిలో ఉండే ప్రత్యేకమైన, అమొఘమైన స్వీట్‌ ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.

ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే, క్షణాల్లో దీన్ని తయారు చేయండి. ఈ ఈ మదర్స్ మే 11, 2025 డేకి మీ అమ్మ మీద మీకున్న ప్రేమను రుచిగా చూపించండి. ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్ ఆమెకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపొదాం పదండి.

రస్క్ పుడ్డింగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  • ఖచ్చితంగా, సరిచేసిన రెసిపీ ఇదిగో:
  • నీరు – 1 కప్పు
  • చక్కెర – అర కప్పు
  • యాలకుల పొడి – 1/4 స్పూన్
  • పాలు – 2 కప్పులు
  • చక్కెర – 3 స్పూన్లు
  • పాలు – 5 స్పూన్లు (కస్టర్డ్ మిశ్రమం కోసం)
  • కస్టర్డ్ పౌడర్ – 1 స్పూన్
  • కార్న్ ఫ్లోర్ – 1 స్పూన్
  • పాల మీగడ – 2 స్పూన్లు
  • రస్క్ (టోస్ట్) – తగినన్ని
  • తురిమిన ఎండు కొబ్బరి (మీ ఇష్టమైతేనే)
  • డ్రై ఫ్రూట్స్ – గార్నిష్ కోసం

క్రీమీ రస్క్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలి

1. రస్క్ పుడ్డింగ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి, అదే కప్పుతో దాదాపు అర కప్పు చక్కెర వేయండి.

2. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే యాలకుల పొడిని వేసి రెండు మూడు నిమిషాల పాటు నీటిని బాగా మరిగించండి. ఇది కాస్త చిక్కబడి పాకంలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి.

3. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల పాలు పోసి అందులో 3 స్పూన్ల చక్కెర వేసి కాసేపు మరిగించండి.

4. పాలు మరుగుతున్న సమయంలో ఒక చిన్న గిన్నెలో 5 స్పూన్ల చల్లటి పాలు, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి.

5. పాలు మరుగుతున్న సమయంలో మంటను తగ్గించి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పాలలో వేస్తూ కలుపుతూ ఉండండి.

6. ఇలా కస్టర్డ్ బాగా చిక్కగా అయ్యాక అందులో ఫ్రెష్ పాల మీగడను వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. క్రీమీ కస్టర్డ్ రెడీ కాగానే పక్కకు పెట్టుకోండి.

7. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో రస్క్‌లను ఒక వరుసలో అమర్చండి.

8. ఈ రస్క్‌ల మీద కొద్దిగా వేడి పాకాన్ని సమానంగా పోయండి. తర్వాత, తయారుచేసిన కస్టర్డ్‌ను ఒక పొరలాగా వేయండి.

9. మళ్లీ దీనిపై రస్క్‌లను ఒక పొరలాగా అమర్చండి. ఆపైన మరోసారి పాకం, కస్టర్డ్‌తో ఇంకో పొర వేయండి. మీకు కావాలంటే మరిన్ని పొరలు కూడా వేసుకోవచ్చు.

10. చివరగా, పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదా తురిమిన ఎండు కొబ్బరితో గార్నిష్ చేయండి.

11. ఈ పుడ్డింగ్‌ను ఫ్రిజ్‌లో దాదాపు రెండు మూడు గంటలు పెట్టి ఉంచారంటే.. మీ రుచికరమైన క్రీమీ రస్క్ పుడ్డింగ్ రెడీ.

ఇది మలాయి కేక్, ఐస్‌క్రీమ్, రసమలై, కస్టర్డ్ రుచుల కలయికతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని మదర్స్ డే రోజున మీ అమ్మకు మీరే స్వయంగా చేసి తినిపించారంటే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతారు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024