నిన్ను కోరి మే 9 ఎపిసోడ్: గుడిలో చంద్రకళ మెడలో తాళి కట్టిన విరాట్- వరదరాజులకు జీవితకాలం శిక్ష- కామాక్షి ప్లాన్ ఫెయిల్!

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 9 ఎపిసోడ్: గుడిలో చంద్రకళ మెడలో తాళి కట్టిన విరాట్- వరదరాజులకు జీవితకాలం శిక్ష- కామాక్షి ప్లాన్ ఫెయిల్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 9 ఎపిసోడ్‌లో చంద్రకళను గుడిలో చూసిన కామాక్షి ప్రదక్షిణలు జరగకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ, అలా జరగదు. దాంతో కామాక్షి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇక గుడిలో చంద్రకళ మెడలో తాళి కడతాడు విరాట్. దానికి తెగ సంతోషపడుతుంది చంద్రకళ. ఇంతలోనే విరాట్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు.

నిన్ను కోరి సీరియల్ మే 9 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంట్లో అవమానం జరిగిన తర్వాత చంద్రకళ గుడికి వెళ్తుంది. రఘురాం మావయ్య కోలుకోవాలని, అలాగే విరాట్ బావతో పెళ్లి జరగాలని మనసులో కోరుకుంటుంది చంద్రకళ. మనసులోని కోరికలు నెరవేరాలంటే గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలని పంతులు సలహా ఇస్తాడు. కానీ, ఒక్కసారి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాక ఏం జరిగిన ఆపకూడదు. అరిష్టం. కోరుకున్నవి జరగవు అని పంతులు హెచ్చరిస్తాడు.

ప్రదక్షిణలకు భంగం కలిగించేలా

దాంతో అలాగే అని చంద్రకళ చేస్తుంది. గుడి చుట్టూ చంద్రకళ 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంతలో అదే గుడికి విరాట్ ఫ్యామిలీ వస్తుంది. రఘురాం కోలుకోవాలని గుడిలో విరాట్ కుటుంబం యజ్ఞం జరిపిస్తుంది. అక్కడ చంద్రకళని శృతి శాలిని కామాక్షి చూస్తారు. ప్రదక్షిణలకు భంగం కలిగిస్తే అరిష్టం అని చంద్రకళ చేస్తున్న ప్రదక్షిణలకు భంగం కలిగించాలని ప్లాన్ చేస్తారు. ఎలాగైనా చంద్రకళ ప్రదక్షిణలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు.

కానీ, కామాక్షి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎలా ప్రయత్నించిన చంద్రకళ ప్రదక్షిణలు చేయడం మానదు. దాంతో కామాక్షి, శాలిని, శృతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇంతలో విరాట్‌ను చంద్రకళ చూస్తుంది. మీతో మాట్లాడాలని విరాట్‌తో చంద్రకళ అంటుంది. దానికి విరాట్ ఫ్యామిలీ ఏం మాట్లాడతావ్, చేసింది చాలు అని అడ్డుపడతారు. కానీ, విరాట్ మాత్రం నేను చంద్రకళతో మాట్లాడి సమస్యకి పరిష్కారం చెప్పి వస్తానని అంటాడు.

నీకు చెప్పేదాన్ని కదా బావ

విరాట్ అలా చెప్పి తన ఫ్యామిలీని గుడి నుంచి పంపించేస్తాడు. దాంతో విరాట్ కుటుంబం అంతా వెళ్లిపోతుంది. ఏం మాట్లాడాలో చెప్పమని చంద్రకళని విరాట్ అడుగుతాడు. దానికి మా పెద్దనాన్న మనల్ని విడగొట్టడానికి వచ్చాడని నాకు ముందుగా తెలియదు. లేకపోతే ఈ విషయాన్ని నేను నీకు చెప్పేదాన్ని కదా బావ అని విరాట్‌తో చెబుతుంది చంద్రకళ.

ఇదంతా మా పెద్దనాన్న పరువు ప్రతిష్ఠ కోసం చేశాడు. మీతో నా పెళ్లి జరిగితే పెద్దనాన్నకు పరువు పోయినట్లుగా అనుకుంటున్నాడు. అందుకే ఇంతటి దారుణాలకు ఒడిగట్టాడు. కావాలనే ఇదంతా చేశాడు. కానీ, నాకు ఇదంతా ఏం తెలియదు అని చంద్రకళ చెబుతుంది. దానికి చంద్రకళ చెప్పింది నిజమే అని నమ్మినట్లు విరాట్ ప్రవర్తిస్తాడు. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడుగుతాడు.

ఏడు అడుగులు వేసిన జంట

దానికి సంతోషంగా చంద్రకళ అవును అంటుంది. అయితే, పెళ్లి చేసుకొందామని విరాట్ అంటాడు. విరాట్, చంద్రకళ కలిసి ఏడు అడుగులు వేస్తారు. తర్వాత చంద్రకళ మెడలో తాళి కడతాడు విరాట్. దానికి తెగ సంబరపడిపోతుంది చంద్రకళ. తను కోరుకున్నది నెరవేరిందని చాలా సంతోషిస్తుంది చంద్రకళ. కానీ, ఇంతలోనే ఇప్పుడు వెళ్లి మీ పెద్దనాన్న పరువు, మర్యాద, గౌరవం ఎలా నిలబెట్టుకుంటాడో చూస్తాను అని విరాట్ అంటాడు.

ఇందాక కూడా మీ పెద్దనాన్నని నువ్ వెనక వేసుకొచ్చావ్ అని విరాట్ అంటాడు. మీ పెద్దనాన్న పరువు, మర్యాద అని మాట్లాడి మా నాన్నని ఈ స్థితికి తీసుకొచ్చారు. అలాంటి వాళ్లని నేను ఎప్పటికీ క్షమించను. మీ పెద్ద నాన్నకి నేను కచ్చితంగా శిక్ష వేస్తాను. ఆ శిక్షతో మీ పెద్దనాన్న పరువు, మర్యాద, గౌరవం ఎలా నిలబెట్టుకుంటాడో కూడా చూస్తాను అని విరాట్ అంటాడు.

పెద్దనాన్న మీద కోపంతో

విరాట్ మాటలు చంద్రకళకు అర్థం కాకపోవడంతో అయోమయంగా చూస్తుంది. ఏంటీ అర్థం కావట్లేదా నీకు తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదు. మీ పెద్దనాన్న మీద కోపంతో అని విరాట్ అంటాడు. దానికి చంద్రకళ ఉలిక్కిపడుతుంది. అలా చంద్రకళకు తాళి కట్టి వరదరాజులుకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా విరాట్ పెద్ద శిక్ష వేస్తాడు.

ఇక చంద్రకళ మనసులో కోరిక నెరవేరినప్పటికీ అది పెద్దనాన్నపై కోపంతో, శిక్ష వేయాలన్న ఉద్దేశంతో మూడు ముళ్లు వేశాడని చంద్రకళ బాధపడుతుంది. వెళ్లి ఈ తాళిని చూసుకుంటూ మీ పెద్దనాన్న ముందర పడి ఏడు అని విరాట్ కోపంగా అంటాడు. విరాట్ ఇచ్చిన ట్విస్ట్‌కు గుడిలో కుప్పకూలి ఏడుస్తుంది చంద్రకళ. చంద్రకళకు తాళి కట్టి అటు వరదరాజులకు, ఇటు చంద్రకళకు విరాట్ జీవితకాలం శిక్ష వేస్తాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024