ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే వచ్చేసిన ఐదు తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో రకం.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే వచ్చేసిన ఐదు తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో రకం.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి గురువారం ఒక్కరోజే ఏకంగా ఐదు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్‌లో ఉన్నప్పటికీ రెండు మాత్రం హారర్ ఎలిమెంట్స్‌తో ఒకేలా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహాలలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి నిన్న ఒక్కరోజే వచ్చేసిన ఐదు తెలుగు సినిమాలు.. ఒక్కోటి ఒక్కో రకం.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి నిన్న గురువారం (మే 8) ఒక్కరోజే ఏకంగా ఐదు సినిమాలు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ 5 తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, స్టార్ హీరోయిన్ త్రిష నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో నిన్నటి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో వంటి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపుగా రూ. 270 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.

జాక్ ఓటీటీ

టిల్లు స్క్వైర్ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా జాక్. చాలా కాలం గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఇన్వెస్టిగేటివ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జాక్ ఓటీటీలోకి నిన్న వచ్చేసింది.

మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో జాక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో జాక్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన జాక్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.

ఓదెల 2 ఓటీటీ

మిల్కీ బ్యూటి తమన్నా నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఐదెల 2. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఓదెల 2 ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్, హిందీ వంటి 3 భాషల్లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓటీటీ

బుల్లితెర యాంకర్స్ అయిన ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి మొదటిసారిగా జంటగా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 8న ఈటీవీ విన్‌లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓటీటీ రిలీజ్ అయింది.

అపరాధి ఓటీటీ

మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇరుల్. మలయాళ స్టార్ యాక్టర్స్ ఫహాద్ ఫాజిల్, దర్శన రాజేంద్రన్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇరుల్ మూవీకి కాస్తా హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కించారు. 2021 తర్వాత అంటే నాలుగేళ్లకు తెలుగులో నిన్నటి నుంచి ఇరుల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఇరుల్ మూవీని తెలుగులో అపరాధి అనే టైటిల్‌తో డిజిటల్ ప్రీమియర్ చేశారు. మే 8 నుంచి ఆహాలో అపరాధి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా మే 8 ఒక్కరోజే ఐదు తెలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాగా.. వాటిలో రెండు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024