




Best Web Hosting Provider In India 2024

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంత.. 8 ముఖ్యమైన అంశాలు
ఆపరేషన్ సింధూర్‌తో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్‌లు మోగుతున్నాయి. యుద్ధం అంటూ.. వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఒకవేళ యుద్ధం వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్‌గా పాక్ దాడులకు తెగబడుతోంది. జమ్ము కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని.. 12 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. పూంచ్, అర్నియా, అఖ్నూర్, సాంబా, గురేజ్, ఆర్‌ఎస్‌పురా, ఉదంపూర్, జమ్ము, పఠాన్‌కోట్, జలంధర్, పోఖ్రాన్, జైసల్మేర్‌లో పాక్ దాడులు చేసింది. అయితే.. పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చేశాయి. పాక్ దాడులను మన త్రివిధ దళాలు తిప్పికొట్టాయి. మరోవైపు యుద్ధం వస్తుందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది.
8 ముఖ్యమైన అంశాలు..
1.భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుద్ధం జరగవచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో యుద్ధం వస్తే.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.
2.దేశంలోని సరిహద్దు రాష్ట్రాలు కాకుండా ఇతర స్టేట్స్‌లోని ప్రజలకు హాని కలగాలంటే.. పాక్ యుద్ధ విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించాలి.
3.పాక్ యుద్ధ విమానాలు మన దేశంలోనికి ప్రవేశించే అవకాశం లేదని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. ఎందుకంటే.. సరిహద్దులో మన రక్షణ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని వివరించారు.
4.పాక్ యుద్ధ విమానాలను పసిగట్టి.. పేల్చేసే వ్యవస్థ భారతదేశానికి ఉందని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ వివరించారు. తెలుగు రాష్ట్రాల వరకు ఆ యుద్ధ విమానాలు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
5.యుద్ధం వస్తోంది.. ప్రజలు సరుకులు కొని నిల్వ ఉంచుకోవాలని జరిగే ప్రచారంపై లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మార్కెట్ పెంచుకోవడానికి జరిగే కుట్ర అని చెప్పారు.
6.సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని లక్ష్మీనారాయణ ప్రజలకు సూచించారు. ఏ సమాచారం అయినా ప్రభుత్వం నుంచి అధికారికంగా వస్తేనే పాటించాలని స్పష్టం చేశారు.
6.లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ రాడార్‌లు భారత్‌లో బలంగా ఉన్నాయి. ఇవి చాలా దూరం నుండి వచ్చే విమానాలను గుర్తించగలవు. దేశ సరిహద్దులు, వ్యూహాత్మక ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. మీడియం రేంజ్ రాడార్‌లు.. ఇవి మధ్యస్థ దూరంలో ఉన్న లక్ష్యాలను పసిగడతాయి. షార్ట్ రేంజ్ రాడార్‌లు.. ఇవి తక్కువ ఎత్తులో, దగ్గరగా వచ్చే లక్ష్యాలను గుర్తిస్తాయి. ముఖ్యంగా క్లిష్టమైన ప్రదేశాల రక్షణ కోసం వీటిని ఉపయోగిస్తారు.
7.భారత ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్.. ఈ వ్యవస్థలు శత్రువుల రాడార్ సిగ్నల్స్‌ను గుర్తిస్తాయి. వాటిని జామ్ చేస్తాయి. తప్పుదారి పట్టిస్తాయి. అలాగే తమ రాడార్లను శత్రువుల నుండి కాపాడుతాయి.
8.ఆప్టికల్ సెన్సార్లు, ఇన్‌ఫ్రారెడ్ సిస్టమ్స్.. కొన్నిసార్లు రాడార్లను తప్పించుకుని వచ్చే విమానాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. రాడార్‌లు, ఇతర సాంకేతిక పరికరాలతో పాటు.. శిక్షణ పొందిన సిబ్బంది కూడా విమానాల కదలికలను నిరంతరం గమనిస్తూ ఉంటారు. కాబట్టి.. పాక్‌తో యుద్ధం వచ్చినా.. మనకు పెద్దగా ముప్పు ఉండబోదోని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్