



Best Web Hosting Provider In India 2024
ఎల్లప్పుడూ అధికారం మీది కాదు.. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు : సజ్జల రామకృష్ణా రెడ్డి
కూటమి నేతలు పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారని.. సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదన్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలను తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తుస్తోందని.. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదన్న సజ్జల.. రేపు తాము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. గుంటూరు సీఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నాకేమీ తెలియదు అని చెప్పాను..
‘టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారు. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చా. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చా. ప్రజాస్వామ్యంలో పట్టాభి లాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను’ అని సజ్జల వివరించారు.
రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి..
‘రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నికలకు ముందునుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ అయిన మహిళ పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము ఇలానే చేస్తే.. ఎలా ఉంటుంది..
‘మా వాళ్లు కేసు ఇస్తే తీసుకోలేదు. వాళ్లు ఇస్తే మాత్రం దుర్మార్గంగా అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వంలో పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుంది? మీరు వేసిన విత్తనం చాలా ప్రమాదకరమైనది’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎంతమందిని జైల్లో పెడతారు..
‘పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వారిని కూడా వదలటం లేదు. ఇలాంటి ఉన్మాద చర్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఆలోచించండి. మీరు ఎంతమందిని జైలులో పెడతారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు సృష్టిస్తున్నారు. లిక్కర్ స్కాం కూడా తప్పుడు కేసే. ఏడాది దాటింది. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి. లేకపోతే జనం తరిమికొట్టే రోజులు వస్తాయి’ అని సజ్జల హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్