




Best Web Hosting Provider In India 2024

ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత – పలుచోట్ల తేలికపాటి వర్షాలు..!
ఏపీలో క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతుంది. ఓవైపు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ… పలుచోట్ల మాత్రం వడగాల్పులు వీస్తున్నాయి. ఇవాళ కొన్నిచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ… మరికొన్నిచోట్ల మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు…
ఇవాళ(మే 9) ప్రకాశం జిల్లాలోని దరిమడుగులో42 డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని గంగుడుపల్లెలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు (శనివారం) పలుచోట్ల 42 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
శనివారం(మే 10) ఏపీలోని 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 23 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి,చిత్తూరు,అన్నమయ్య,శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో63.7మిమీ, చొప్పెలలో 55 మి. మీ అధిక వర్షపాతం నమోదైనట్లు వివరించింది.
తెలంగాణలోనూ వర్షాలు…
తెలంగాణలో రేపు (శనివారం) పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
మే 12వ తేదీన మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మే 13, 14 తేదీల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.
టాపిక్