





Best Web Hosting Provider In India 2024

యుద్ధం వద్దన్న ఐశ్వర్య రాజేష్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ యుద్ధం వద్దంటూ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు. ఇండియా యుద్ధం చేయడం లేదని, డిఫెండ్ చేసుకుంటోందని ఆమెకు చెబుతున్నారు.
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ద్వారా మన సాయుధ దళాలకు సంఘీభావంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. అయితే వీళ్లలో కొందరు యుద్ధం వద్దని, దీనివల్ల నష్టం తప్ప ఒరిగేదేమీ లేదని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా అలాంటి పోస్ట్ చేసింది.
ఐశ్వర్య రాజేష్ పోస్ట్ ఇలా..
ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు వారికి మరింత దగ్గరైన నటి ఐశ్వర్య రాజేష్. ఆమె తాజాగా ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణంపై తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆమె ఏమన్నదంటే.. “యుద్ధానికి నో చెప్పండి. ఓ ప్రజాస్వామ్య దేశ పౌరురాలిగా నేను ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఘర్షణ బదులు శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి.
పరస్పర అవగాహనకు వచ్చిన అనవసరంగా ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా చూద్దాం. సైనికులు, నైపుణ్యం ఉన్న వ్యక్తులు, అమాయక పౌరులు చనిపోకూడదు. ప్రతి ఒక్కరికీ ఈ సందేశం చేరాలి. దీనిపై అవగాహన కల్పించి, మరో యద్ధం రాకుండా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి” అని ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేసింది.
నెటిజన్ల ట్రోలింగ్
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి.. దీనికి ప్రతిగా పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడాన్ని ప్రస్తుతం దేశంలో ఎంతో మంది సమర్థిస్తున్నారు. అందుకు వ్యతిరేకంగా యుద్ధం వద్దంటున్న వారిపై మండిపడుతున్నారు. అలా అంటున్న వారిని ట్రోల్ చేస్తున్నారు.
పాకిస్థాన్ చేస్తున్న దాడి నుంచి భారత్ తన భూభాగాన్ని కాపాడుకుంటుంది తప్ప యుద్ధానికి కాలు దువ్వడం లేదని వాళ్లు వాదిస్తున్నారు. కానీ ఐశ్వర్య రాజేష్ లాంటి వాళ్లు మాత్రం ఈ ఘర్షణలో ఇండియా, పాకిస్థాన్ లను ఒకేగాటన కట్టినట్లు కామెంట్స్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. అసలు అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆమెకు కనీస అవగాహన అయినా ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం