థియేటర్లలో రిలీజై 15 నెలలు.. మొత్తానికి ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ మూవీ.. పరమ భక్తుడు నాస్తికుడిగా మారితే..

Best Web Hosting Provider In India 2024

థియేటర్లలో రిలీజై 15 నెలలు.. మొత్తానికి ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ మూవీ.. పరమ భక్తుడు నాస్తికుడిగా మారితే..

Hari Prasad S HT Telugu

ఓ మలయాళ కామెడీ మూవీ థియేటర్లలో రిలీజైన 15 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. గతేడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఓ పరమ భక్తుడు నాస్తికుడిగా మారితే ఎలా ఉంటుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

థియేటర్లలో రిలీజై 15 నెలలు.. మొత్తానికి ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ మూవీ.. పరమ భక్తుడు నాస్తికుడిగా మారితే..

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో కామెడీ మూవీ అయ్యర్ ఇన్ అరేబియా (Iyer in Arabia). టైటిల్ కు తగినట్లే ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి మిడిల్ ఈస్ట్ కు వెళ్లి ఎలా నాస్తికుడిగా మారిపోతాడో ఈ మూవీలో సరదాగా చూపించారు. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. 15 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

అయ్యర్ ఇన్ అరేబియా ఓటీటీ రిలీజ్ డేట్

ప్రముఖ మలయాళ నటుడు ధ్యాన్ శ్రీనివాసన్ తోపాటు ఊర్వశి, ముకేష్ లాంటి వాళ్లు నటించిన కామెడీ డ్రామా ఈ అయ్యర్ ఇన్ అరేబియా. ఈ సినిమాను మే 16 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

గతేడాది ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ 4.6 రేటింగ్ మాత్రమే నమోదైంది. ఎంఏ నిషాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొత్తానికి వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

అయ్యర్ ఇన్ అరేబియా మూవీ స్టోరీ ఇదీ..

అయ్యర్ ఇన్ అరేబియా ఓ బ్రాహ్మణ కుటుంబం చుట్టూ తిరిగే స్టోరీ. ఇందులో శ్రీనివాస అయ్యర్ గా ముకేష్, అతని భార్య ఝాన్సీ రాణీగా ఊర్వశి, వాళ్ల కొడుకు రాహుల్ గా ధ్యాన్ శ్రీనివాసన్ నటించారు. శ్రీనివాస అయ్యర్ పరమ భక్తుడు. విశ్వాసాలు చాలా ఎక్కువ. అదే సమయంలో ఝాన్సీ రాణి మాత్రం ఓ నాస్తికురాలు. అసలు ఏ పట్టింపులూ ఉండవు.

ఈ నేపథ్యంలో రాహుల్ ఓ ఉద్యోగం కోసం దుబాయ్ కు వెళ్తాడు. అక్కడ అతడు వేరే మతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు అయ్యర్ అనుమానిస్తాడు. దీంతో భార్యతో కలిసి అతడు ఆ దేశానికి వెళ్తాడు. అక్కడ అతనికి పూర్తిగా ఓ భిన్నమైన ప్రపంచం కనిపిస్తుంది.

అన్ని రోజులూ పరమ భక్తుడిగా, ఎన్నో విశ్వాసాలు ఉన్న అయ్యర్.. క్రమంగా వాటిని పక్కన పెట్టి నాస్తికుడిగా మారిపోతాడు. ఈ క్రమాన్ని సినిమాలో సరదాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఓటీటీలో ప్రేక్షకులు ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024