Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 10 ఎపిసోడ్: కావ్య చెడు తిరుగుళ్లు, రుద్రాణి నిందలు- ట్విస్ట్ ఇచ్చిన ఇంట్లోవాళ్లు- యామిని కొత్త లవ్ ప్లాన్!
బ్రహ్మముడి సీరియల్ మే 10 ఎపిసోడ్‌లో రాజ్‌కు కావ్య గురించి తప్పుగా చెబుతుంది. ఇక కావ్య పెద్ద తప్పు చేశానంటూ ఫీల్ అవుతుంది. రామ్ అనే పరాయి మగాడితో కావ్య చెడు తిరుగుళ్లు తిరుగుతుందని రుద్రాణి నిందలు వేస్తుంది. దానికి ఇంట్లోవాళ్లు రుద్రాణికి పెద్ద ట్విస్ట్ ఇస్తారు. ఇక యామిని కొత్త ప్లాన్ వేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో కావ్య గురించి యామినిని అడుగుతాడు. పార్టీ కోసం అని పిలిచింది. ఆ అవసరం తీరిపోయింది. కళ్లు తిరిగి పడిపోయేసరికి ఎవరితోనే నిన్ను పంపించి. పార్టీలో అక్కడే ఉండిపోయింది అని యామిని అబద్ధం చెబుతుంది. నువ్వు చెప్పేది నిజమా అని రాజ్ అంటాడు.
నీ గురించే అడుగుతున్నాడు
తనెందుకు వస్తుంది. నా అంతలా నిన్ను ఎవరు ప్రేమిస్తారు అని రాజ్‌కు కావ్య గురించి చెడుగా చెబుతుంది యామిని. చూశావా వదినా నీ గురించి యామిని చెడుగా చెప్పిన అన్నయ్య కళ్లు తెరవగానే నీ గురించి అడుగుతున్నాడు. ఇంకెందుకు కంగారుపడుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. లేదు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను పాపిష్టిదాన్ని, నా నీడ కూడా ఆయన మీద పడటానికి వీళ్లేదు. నేను మాట్లాడిన కలిసినా ఆయన గతాన్ని గుర్తు చేసినట్లే అవుతుందని ఆస్పత్రి నుంచి కావ్య వెళ్లిపోతుంది.
మరోవైపు ఇంట్లో కావ్య ఇంకా రాలేదేంటని ఇందిరాదేవి, అపర్ణ మాట్లాడుకుంటారు. ఎలా వస్తారు. గతం గుర్తుకు తెచ్చేసరికి మళ్లీ కోమా స్టేజీకి వెళ్లిపోయాడు కదా రాజ్ అని రుద్రాణి అంటుంది. రామ్ అని అది ఆడుతున్న నాటకాన్ని దాంతోనే ఎలా ముగుస్తానో చూడు అని రుద్రాణి అంటుంది. ఇంతలో కావ్య వాళ్లు వస్తారు. అక్కడ జరిగింది చెప్పకు. ఇలా జరిగిందని తెలిస్తే అంతా కంగారుపడతారు అని కల్యాణ్ అంటాడు.
ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావ్ ఏం చేసి వచ్చావ్ అని రుద్రాణి అంటుంది. ఎందుకు నిలదీస్తున్నావ్ ఇప్పుడు అని ఇందిరాదేవి అంటుంది. ఏం చెప్పి ఎక్కడికి వెళ్లింది. రిసార్టుకు వెళ్లి ఏం చేసిందో అడగండి అని రుద్రాణి అంటుంది. నేను చిరాకులో ఉన్నాను. నా జోలికి రాకండి అని కావ్య అంటుంది. నీ మూడ్ స్వింగ్స్‌ను బట్టి వస్తారా. దుగ్గిరాల కోడలు అంటే ఓ స్థాయి ఉంది. ఈరోజు నువ్ అది దిగజారి ప్రవర్తించావ్ అని రుద్రాణి అంటుంది.
నీ హస్తం లేదుగా
దాంతో అపర్ణ కోపంగా పైకి లేస్తుంది. మరి తప్పుగా మాట్లాడితే కోపం వస్తే.. పరాయి మగాడితో రిసార్టులో తిరిగితే తప్పు లేదా. కావ్య తిరిగిన వాడి పేరు రామ్ అని రుద్రాణి అంటుంది. సరిపోయింది ఎవరికి తెలియొద్దు అనుకున్నామో వారికే తెలిసింది. ఇందులో నీ హస్తం ఏం లేదుగా అని ధాన్యలక్ష్మీతో అంటాడు ప్రకాశం. నేను మరి అంత చీప్‌గా కనిపిస్తున్నానా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
నేను చెప్పంది నిజమో కాదో అడిగి తెలుసుకోండి అని రుద్రాణి అంటుంది. మనకు అసలు నిజం తెలిసిందని తెలిస్తే మా చెల్లి గుండె ఆగిపోతుందేమో అని ప్రకాశం అంటాడు. అలా పరాయి మగాడితో తరిగితే మన పరువేం కావాలి. అక్కడ ప్రవిత్రమైన విషయం ఏంటంటే ఆ రామ్ అచ్చం మన రాజ్‌లా ఉండటం. ఎలాగు భర్త రాడు కాబట్టి అతనితో సెటిల్ అవ్వాలనుకుంది. అందుకే ఈ చెడు తిరుగుళ్లు తిరుగుతుంది అని అక్రమ సంబంధం అంటగట్టినట్లుగా రుద్రాణి మాట్లాడుతుంది.
అపర్ణ కోపంగా చూస్తుంది. నిలదీయాల్సింది నీ కోడలిని. వెళ్లి తన రెండు చెంపలు వాయించి ఎందుకు ఇంత దిగజారిపోయావంటూ గడ్డిపెట్టు అని రుద్రాణి అంటుంది. దిగజారింది తను కాదు నువ్వు. ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతిసారి మమ్మల్ని నిరూత్సాహపరుస్తూనే ఉన్నావ్ అని జెర్సీ మూవీలోని హీరోయిన్ డైలాగ్ కొడుతుంది అపర్ణ. ఇంతకంటే దిగజారిపోతూనే ఉన్నావ్ అని అపర్ణ అంటుంది.
ఇదేం ట్విస్ట్
ఇంతపెద్ద నిజం చెబితే కావ్యకు బదులు మమ్మల్ని తిడతారేంటీ. ఇదేం ట్విస్ట్ అని రాహుల్ మనసులో అనుకుంటాడు. ప్రాణం పోయిన తన మనసులో ఇంకొకరికి అవకాశం ఇవ్వదు అని అపర్ణ అంటుంది. ఆ కావ్య నిన్ను మాత్రమే కాదు కుటుంబాన్నే మోసం చేస్తుంది. రామ్‌తో తిరుగుతుంది. కావాలంటే అడుగు అని రుద్రాణి అంటుంది. నాకు అన్ని విషయాలు తెలుసు. రామ్ వేరు రాజ్ వేరు కాదు. ఆ ఇద్దరు ఒక్కటే అన్న విషయం నాకు తెలుసు. నాకే కాదు ఈ ఇంట్లో ఆ విషయం అందరికి తెలుసు అని అపర్ణ అంటుంది.
వీళ్లు ఆడుతున్న నాటకంలో మేము జోకర్లమని తెలిసింది అని రాహుల్ అనుకుంటాడు. అంటే, రాజ్‌కు గతం మర్చిపోయి యామిని ఇంట్లో ఉండటం అంతా తెలుసా అని రుద్రాణి అంటే.. యామినితో పెళ్లి జరగబోతుందని కూడా తెలుసు అని ప్రకాశం అంటాడు. అంటే, ఇంట్లో అంతా ఒక్కటైపోయి నన్ను పరాయిదాన్ని చేశారా. నన్ను పిచ్చిదాన్ని చేశారా అని రుద్రాణి అంటుంది.
రాజ్‌ని తీసుకురావడానికే నీకు చెప్పలేదు అని సుభాష్ అంటాడు. గట్టిగా మాట్లాడితే ఆ రిసార్ట్ ప్లాన్ వేసిందే మేము. కావ్యను ఒప్పించి పంపించింది మేమే అని ఇందిరాదేవి అంటుంది. నిజం తెలిసిపోయింది కదా అని పిచ్చి పిచ్చి వేశాలు వేయకుండా నోరు మూసుకుని ఇంట్లో ఉండు అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. మీ కోడలు చేసిన నిర్వాకానికి మళ్లీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు అని రుద్రాణి అంటుంది.
ఏడుస్తూ వెళ్లిపోయిన కావ్య
ఏమైందని అని అపర్ణ బాధగా అడుగుతుంది. దాంతో కల్యాణ్ నిజం చెబుతాడు. అన్నయ్య బాగానే ఉన్నాడు చెబుతాడు. కానీ, తన ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా కవిగారు. తప్పు చేశాను. మొదటిసారి ఆయన విషయంలో నేను తప్పు చేశాను అని కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు డిశ్చార్జ్ అయిన రాజ్ కావ్య గురించి ఆలోచిస్తుంటాడు.
కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు. కానీ, కావ్య లిఫ్ట్ చేయదు. దాంతో ఏమై ఉంటుంది అని రాజ్ కంగారుపడతాడు. ఎందుకు నన్ను ఇలా అవైడ్ చేస్తుందనుకుంటాడు. రామ్ దగ్గరికి యామిని తల్లిదండ్రులు వచ్చి ఎలా ఉందని పరామర్శిస్తారు. ఏం ఆలోచిస్తున్నారు అని వైదేహి అడిగితే.. కళావతి గురించి ఆలోచిస్తున్నాడు. నీతో అంత క్లోజ్‌గా మూవ్ అయిన కళావతి ఇంకా నీవైపుకు రాదు బావా అని యామిని అంటుంది. రాకుండా చేశాను అని మనసులో అనుకుంటుంది యామిని.
టెంపరరీ మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. ఇలాంటి సంఘటన జరిగితే మాకేందుకులే అని వెళ్లిపోతారు. వేస్ట్ పీపుల్ గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోకు అని యామిని అంటుంది. ఇది మన ఫ్యామిలీ, ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఇప్పుడు మన పెళ్లికంటే నీ ఆరోగ్యం, నీ సంతోషం, నా అంగీకారమే నాకు ముఖ్యం. నీకు నువ్వుగా నన్ను పెళ్లి చేసుకుంటాను అనేవరకు నేను పెళ్లి టాపిక్ తీయను అని యామిని అంటుంది.
ప్రేమ నింపబోతున్నా
తర్వాత ఏమైంది. సడెన్‌గా పెళ్లి గురించి అలా మాటిచ్చావ్ అని వైధేహి అంటుంది. మా ఇద్దరి రిలేషన్‌లో ప్రేమ ఉండాలనే లాజిక్ మిస్ అయ్యాను. అందుకే ఆ కావ్య ఎంటర్ అయింది. కట్టుకున్న భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి ఏ భార్య రావాలనుకోదు. అది ఇచ్చే గ్యాప్‌లో బావతో నా ప్రేమను నింపబోతున్నాను. నా వైపు కాకుండా ఈసారి బావ రూట్‌లో వెళ్లి నరుక్కురాబోతున్నాను. తన నోటితోనే నన్ను పెళ్లి చేసుకుంటాను అనేలా చేయబోతున్నాను అని యామిని అంటుంది.
ఎందుకో ఈ సారి యామిని మెచ్యూర్‌డ్‌గా ఆలోచిస్తుందని అనిపిస్తుందని వైధేహి అంటుంది. యామిని చెప్పినట్లుగా కళావతి గారు ఆలోచించరు. ఆస్పత్రికి రాకుండా ఉండటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. తప్పకుండా అది తెలుసుకోవాలని మళ్లీ రాజ్ కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ, కావ్య లిఫ్ట్ చేయదు. అది అపర్మ, కల్యాణ్ వాళ్లు చూస్తారు.
రాజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. మాట్లాడి ఏం చేయమంటారు. మీరు ఎప్పుడైతో తొందరపెట్టారో. మీరు గతం గుర్తుచేయమని పట్టుబట్టారో అప్పుడే పెద్ద తప్పు చేశాను అని కావ్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.