ఏపీ జిల్లా కోర్టుల్లో 230 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు – అర్హతలు, దరఖాస్తు వివరాలివే

Best Web Hosting Provider In India 2024

ఏపీ జిల్లా కోర్టుల్లో 230 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు – అర్హతలు, దరఖాస్తు వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీ జిల్లా కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా 230 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 13 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు షురూ అవుతాయి.

ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి 1,620 ఉద్యోగాలున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు…. వేర్వురు ప్రకటనలను జారీ చేసింది. ఇందులో డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 230 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తులు, అర్హతల వివరాలు…

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 2వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది.
  • దరఖాస్తు చేసుకునే ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 400 ఫీజు చెల్లించాలి.
  • అన్ని జిల్లా కోర్టుల్లో కలిపి మొత్తం 230 ఖాళీలు ఉన్నాయి.
  • డిగ్రీ ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
  • జూనియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి.
  • 2025 జులై 1వ తేదీ నాటికి 18 – 42 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
  • అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా తెలిసి ఉండాలి.

ఎంపిక విధానం…

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సిలబస్ వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు.

జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్….

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. పార్టీ ఏ తో పాటు పార్ట్ బీ పూర్తి చేయాలి. పార్టీ ఏ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ వివరాలతో పార్ట్ బీలో ఉండే అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయవచ్చు. పార్ట్ ఏలో జనరేట్ అయ్యే OTPR ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు https://aphc.gov.in/docs/06052025-2.pdf లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. లేదా ఏపీ హైకోర్టు వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నోటిఫికేషషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap GovtGovernment Of Andhra PradeshRecruitmentHigh Court ApHigh Court Jobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024