




Best Web Hosting Provider In India 2024

హీరోలుగా మారిన కమెడియన్లు – హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా బద్మాషులు – రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన బద్మాషులు మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాలీవుడ్ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి హీరోలుగా నటించిన మూవీ బద్మాషులు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్ మురళీధర్ గౌడ్ మరో లీడ్ రోల్‌లో కనిపిస్తోన్నాడు. ఈ మూవీకి శంకర్ చేగూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ సినిమా రిలీజ్ డేట్‌ను శనివారం మేకర్స్ అనౌన్స్ చేశారు.
జూన్ 6న రిలీజ్…
బద్మాషులు మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీపా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోంది.
తెలంగాణ యాసలో…
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ మూవీ ఇదని మేకర్స్ చెబుతోన్నారు. . కథ, కథనాలతో పాటు కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటుందని అన్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలంగాణ యాసలో సాగే డైలాగ్స్‌తో ఈ టీజర్ నవ్వించింది. బలాదూర్‌గా తిరితే ఇద్దరు యువకులు చేసే అల్లరి పనులతో ఈ మూవీ సాగనుంది. డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. బద్మాషులు మూవీని బి. బాలకృష్ణ, సీ రామ శంకర్ నిర్మిస్తున్నారు.
మంచి రెస్పాన్స్…
“ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇది మన ఊరి కథ అని ఆడియెన్స్ ఫీలయ్యేలా సినిమాలోని క్యారెక్టర్స్ చాలా నాచురల్‌గా ఉంటాయి. వంద శాతంఆడియెన్స్‌ను నవ్వించాలనే ఉద్దేశ్యంతో బద్మాషులు సినిమాను తెరకెక్కించాం” అని డైరెక్టర్ అన్నారు.
వెబ్‌సిరీస్‌లు, సినిమాలు..
తెలుగులో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో మహేష్ చింతల కమెడియన్‌గా కనిపించాడు. కీడాకోలా, ఈ నగరానికి ఏమైందితో పాటు మాయాబజార్, కుబుల్ హై వెబ్‌సిరీస్‌లు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. బలగం, డీజే టిల్లు, మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలతో నటుడిగా బిజీ అయ్యారు మురళీధర్ గౌడ్. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో వెంకటేష్ మావయ్య పాత్రలో నవ్వించాడు.
సంబంధిత కథనం