బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌ను ఇంట్లోంచి వెళ్లిపోమన్న కావ్య- యామినితో రామ్ పెళ్లి- భర్తకు శాశ్వతంగా దూరంగా కళావతి!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ప్రోమో: రాజ్‌ను ఇంట్లోంచి వెళ్లిపోమన్న కావ్య- యామినితో రామ్ పెళ్లి- భర్తకు శాశ్వతంగా దూరంగా కళావతి!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్ ఎన్నిసార్లు కాల్స్ చేసిన కావ్య లిఫ్ట్ చేయదు. ఇంటికి వచ్చిన రాజ్‌ను తన మాటలతో బాధపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోమంటుంది కావ్య. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో తనవల్లే రాజ్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని కావ్య కుమిలిపోతు ఉంటుంది. హాస్పిటల్‌కు కావ్య ఎందుకు రాలేదో కారణం తెలుసుకునేందుకు కళావతికి రాజ్ ఫోన్ కాల్స్ చేస్తుంటాడు. కానీ, ఎన్నిసార్లు రాజ్ కాల్ చేసిన కళావతి ఫోన్ లిఫ్ట్ చేయదు.

లిఫ్ట్ చేయకుండా ఏంటీ

మరోవైపు రాజ్ తనను ప్రేమించేలా చేసేందుకు యామిని స్కెచ్ వేస్తుంది. తనంతట తానే పెళ్లికి ఒప్పుకునేలా యామిని ప్లాన్ వేస్తుంది. కావ్య దగ్గరికి అపర్ణ, స్వప్న, కల్యాణ్, అప్పు వస్తారు. అప్పుడు కూడా కావ్య ఫోన్‌కు రాజ్ కాల్ వస్తుంటుంది. కానీ, కావ్య లిఫ్ట్ చేయదు. అది చూసిన అపర్ణ రాజ్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అక్కడ నిలిచున్నావేంటని అడుగుతుంది అపర్ణ.

మాట్లాడి ఏం చేయమంటారు. మాట్లాడి మళ్లీ గతం గుర్తు చేయమంటారా. మీకు ఆయన గురించి చెప్పకముందు ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే మీరు గతం గుర్తు చేయమని తొందరపెట్టారో అప్పుడే నేను తప్పు చేశాను అని కావ్య అంటుంది. ఇప్పుడు అన్నయ్యకు బాగానే ఉంది కదా వదినా. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావ్ అని కల్యాణ్ అడుగుతాడు.

ప్రాణాలతో ఉండటమే ముఖ్యం

లేదు కవిగారు. కాస్తలో ప్రమాదం తప్పింది. లేకపోతే నా చేతులతో నేనే ఆయన ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినదాన్ని అయ్యేదాన్ని అని కావ్య అంటుంది. అలా అని ఇప్పుడు ఇలాగే ఉంటావా. నీ భర్తను నువ్ తెచ్చుకోవా. ఆ యామినీకే వదిలేస్తావా అని అపర్ణ అడుగుతుంది. నాకు ఆయన ప్రాణాలతో క్షేమంగా ఉండటం ముఖ్యం. దానికోసం నేను దూరమైన పర్వాలేదు అని కావ్య అంటుంది.

ఇకనుంచి నేను ఆయన మొహం చూడను. ఆయనతో మాట్లాడను. ఆయనకు శాశ్వతంగా దూరంగా ఉంటాను అని కావ్య అంటుంది. ఇంతలో కారులో దుగ్గిరాల ఇంటికి రాజ్ వస్తాడు. అది చూసి అపర్ణ, కల్యాణ్ వాళ్లు సంతోషిస్తారు. చూశావా. నువ్ ఎంత వద్దనుకున్న రాజ్ మాత్రం కావాలనుకుంటున్నాడు. అందుకే నువ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నిన్ని వెతుక్కుంటూ ఇంటికే వచ్చేశాడు అని అపర్ణ అంటుంది.

ఇలా అంటారనుకోలేదు

నేను ఆయనకేదో చెప్పుకుని పంపించేస్తాను. మీరు వెళ్లండి. కవిగారిని, అప్పును ఇక్కడ చూస్తే ఆయనకు డౌట్ వస్తుందని కావ్య అంటుంది. కావ్యతో రాజ్ మాట్లాడుతుంటాడు. ఎందుకొచ్చారు అని కావ్య అడుగుతుంది. ఎలా ఉన్నారు అని అడుగుతారనుకున్నాను. కానీ, ఇలా అంటారని ఊహించలేదు అని రాజ్ అంటాడు. కనపడుతున్నారుగా ఎలా ఉన్నారో. ఇంకా అడగటం దేనికి అని కావ్య అంటుంది.

హాస్పిటల్‌లో పడిపోతే కనీసం చూడాలని కూడా అనిపించలేదా అని రాజ్ దీనంగా అడుగుతాడు. మీరు హాస్పిటల్‌లో ఉంటే నేనేందుకు చూడటానికి రావాలి అని కావ్య అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. పదే పదే కాల్స్ చేసి విసిగిస్తున్నారు. మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేనేందుకు లిఫ్ట్ చేసి మాట్లాడాలి. నాకా అవసరం ఏంటీ అని రాజ్‌ను గద్దిస్తుంది కావ్య.

యామినితో రామ్ పెళ్లి

మీకు నాకు ఏం సంబంధం ఉందని మీకు నేను సమాధానం చెప్పాలి. వెళ్లండి ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తుంది కావ్య. కళావతి అలా ఇంట్లోంచి వెళ్లిపో అనడంతో ఏం చేయలేక బాధతో రాజ్ వెళ్లిపోతాడు. కావ్యను చూస్తూనే మెల్లిగా అడుగులు వేస్తూ రాజ్ వెళ్లిపోతాడు. కావ్య కూడా బాధపడుతుంది. ఇంటికెళ్లిన రాజ్ కావ్య చేసినదానికి ఆలోచనలో పడతాడు.

తర్వాతి రోజు నుంచి రాజ్‌ను యామిని మచ్చిక చేసుకుంటుంది. మొత్తానికి యామినితో రాజ్ పెళ్లికి ఒప్పుకునేలా చేస్తుంది. తర్వాత కొద్దిరోజులకే యామిని, రామ్ పూలదండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటారు. దాంతో రాజ్ యామిని సొంతం అయితే కావ్య శాశ్వతంగా దూరం అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024