మజ్జిగ చారు ఇలా చేశారంటే మామూలుగా ఉండదు, మూడు పూటలా తిన్నా తనివితీరదు!

Best Web Hosting Provider In India 2024

మజ్జిగ చారు ఇలా చేశారంటే మామూలుగా ఉండదు, మూడు పూటలా తిన్నా తనివితీరదు!

Ramya Sri Marka HT Telugu

మజ్జిగ చారు రెసిపీ: వేసవిలో మజ్జిగ చేసే మేలు ఏదీ చేయలేదు. అయితే రోజూ దీన్ని మామూలుగా తినాలంటే బోరే కదా. అప్పుడప్పుడు ఇలా చారులా కూడా చేసుకోండి. ఈ రెసిపీతో మజ్జిగ చారు చేశారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పిల్లలైతే గ్లాసులో పోసుకుని మరీ తాగేస్తారు.

మజ్జిగ పులుసును ఇలా తయారు చేశారంటే మతి పోతుంది

వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు వేడి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు మజ్జిగ శరీరానికి అవసరమైన ఎలక్ట్రో లైట్లను అందిస్తుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.ఇందులో ఉండే కాల్షియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న మజ్జిగ రోజూ ఒకే రుచిలో ఏం తింటాం. ఈసారి కొత్తగా చారులా ట్రై చేయండి. ఇక్కడున్న రెసిపీతో ట్రై చేశారంటే మీ మజ్జిగకు ఫ్యాన్స్ అవుతారు. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం రండి.

మజ్జిగ చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  • ఒక కప్పు పెరుగు,
  • ఒక కప్పు నీరు(మీకు చిక్కగా కావాలంటే అర కప్పు నీరు సరిపోతుంది)
  • రుచికి సరిపడా
  • రెండు టేబుల్ స్పూన్ల నూనె
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • అర టీస్పూన్ ఆవాలు
  • పావు టీ స్పూన్ ఎండు మిరప గింజలు
  • సన్నగా తరిగి పెట్టుకున్న ఇంచు అల్లం ముక్క
  • నాలుగు లేదా అయిదు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు
  • మూడు లేదా నాలుగు సన్నా తరిగి పెట్టుకున్న పచ్చి మిర్చీ ముక్కలు
  • గుప్పెడు కరివేపాకు
  • పావు టీ స్పూన్ పసుపు
  • గుప్పెడు కొత్తిమీర

మజ్జిగ చారు తయారు చేసే విధానం:

  1. మజ్జిగ చారు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు వరకూ పెరుగు తీసుకొండి. కాస్త పుల్లటి పెరుగు అయితే చారు మరింత రుచిగా ఉంటుంది.
  2. ఈ పెరుగును ఒక మిక్సింగ్ బౌల్ లో వేసి బాగా చిలకండి. పెరుగు పూర్తిగా కరికి గడ్డలు లేకుండా మారిన తర్వాత దీంట్లో మీ రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత దీన్ని అలా పక్కకు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయండి.
  4. నూనె కాస్త వేడెక్కగానే దాంట్లో ఎండు మిరపకాయ గింజలు(రెడ్ చిల్లీ ఫ్లాగ్స్) వేసి వేయించండి.
  5. తర్వాత దీంట్లోనే అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించండి.
  6. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించండి.
  7. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చీ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించండి.
  8. ఉల్లిపాయలు బాగా మాడకుండా కాస్త నూనెలో వేగితే చాలు. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించండి.
  9. అన్నీ చక్కగా నూనెలో వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసి కాసేపు వేయించండి. ఇలా అన్నింటినీ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించండి.
  10. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి బాగా కలపండి.
  11. ఇప్పుడు ఈ తాళింపు మిశ్రమాన్ని తీసుకెళ్లి ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో వేసి బాగా కలపండి.ఇదే సమయంలో మరో సారి రుచి చూసి ఉప్పు కలిపారంటే కమ్మటి మజ్ఝిక చారు రెడీ అయిపోయినట్టే.

వేసవిలో ఈ మండే ఎండల మధ్య మజ్జిక చారుతో ముద్ద తిన్నారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఆలస్యం చేయకుండా మజ్జిక చారును ఇవాళే ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024