బాలీవుడ్‍లో శ్రీలీల సినిమా.. నేరుగా ఓటీటీలోకే!

Best Web Hosting Provider In India 2024

బాలీవుడ్‍లో శ్రీలీల సినిమా.. నేరుగా ఓటీటీలోకే!

దోస్తానా 2 సినిమాను నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారని సమాచారం బయటికి వచ్చింది. ఓ దశలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

 
బాలీవుడ్‍లో శ్రీలీల సినిమా.. నేరుగా ఓటీటీలోకే!
 

దోస్తానా 2 చిత్రం బాలీవుడ్‍లో ఒకప్పుడు హాట్ టాపిక్ అయింది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కాస్త అయిపోయాక రద్దయింది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ ప్రారంభమైనా 2019లో క్యాన్సిల్ అయింది. అయితే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను మళ్లీ పట్టాలెక్కించారు ఈ మూవీ నిర్మాత కరణ్ జోహార్. ప్రధాన నటీనటులు మారారు. అయితే, దోస్తానా 2 డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‍కు ప్లాన్‍లు జరుగుతున్నాయని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

 

జాన్వీ స్థానంలో శ్రీలీల!

దోస్తానా 2 చిత్రం నుంచి కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ తప్పుకున్నారు. కరణ్‍తో విభేదాల వల్లే కార్తీక్ వైదొలిగారనే టాక్ ఉంది. కార్తీక్ ఆర్యన్ స్థానంలో ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ప్లేస్‍లో తెలుగు హీరోయిన్ శ్రీలీల ఆ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో లీల హీరోయిన్‍గా ఛాన్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కిల్ చిత్రంతో పాపులర్ అయిన లక్ష్య కూడా దోస్తానా 2లో మరో ముఖ్యమైన పాత్ర చేయనున్నారు. మొత్తంగా ఎట్టకేలకు ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీక్రెట్ సూపర్ స్టార్, లాల్ సింగ్ చద్దా చిత్రాలతో అద్వైత్ ఫేమస్ అయ్యారు.

డైరెక్ట్ ఈ ఓటీటీలోకే!

దోస్తానా 2 సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలుస్తోంది. థియేట్రికల్‍గా రిలీజ్ చేద్దామని కరణ్ జోహార్ ముందుగా అనుకున్నారట. దీంతో థియేట్రికల్ రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేలా డీల్ కోసం చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, మేకర్స్ ఇప్పుడు మనసు మార్చుకొని డైరెక్ట్ ఓటీటీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నిర్ణయించారట. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ

కాగా, కార్తీక్ ఆర్యన్‍ హీరోగా నటిస్తున్న సినిమాతో బాలీవుడ్‍లో శ్రీలీల ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదిలోనే థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుంది. అంతలోనే దోస్తానా 2లో లీల ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

Best Web Hosting Provider In India 2024