నిన్ను కోరి మే 12 ఎపిసోడ్: చంద్రకళను కోడలిగా ఒప్పుకున్న జగదీశ్వరి- కామాక్షి, శృతి ఛాలెంజ్- విరాట్ బెడ్ రూమ్‌లో చంద్ర!

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి మే 12 ఎపిసోడ్: చంద్రకళను కోడలిగా ఒప్పుకున్న జగదీశ్వరి- కామాక్షి, శృతి ఛాలెంజ్- విరాట్ బెడ్ రూమ్‌లో చంద్ర!

 

నిన్ను కోరి సీరియల్ మే 12 ఎపిసోడ్‌లో విరాట్ తాళి కట్టినట్లు చంద్రకళ చెబుతుంది. దాంతో చంద్రకళను కోడలిగా జగదీశ్వరి ఒప్పుకుని ఇంట్లో ఉండమంటుంది. చంద్రకళను ఇంట్లోంచి వెళ్లగొడతామంటూ తనతో కామాక్షి, శ్రుతి, శాలిని ఛాలెంజ్ చేస్తారు. విరాట్ బెడ్ రూమ్‌లోకి వెళ్లి వయ్యారంగా పడుకుంటుంది చంద్రకళ.

 
నిన్ను కోరి సీరియల్ మే 12 ఎపిసోడ్‌
 

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంటికి వెళ్లిన చంద్రకళతో కామాక్షి గొడవ పడుతుంది. విరాట్ బయటకు వెళ్లమని చంద్రతో అంటాడు. దీనికి ఇలా చెబితే కుదరదు బాబు అని చంద్రకళను కొట్టబోతుంది కామాక్షి. కానీ, కామాక్షి చేయి పట్టుకుని ఎదురు తిరుగుతుంది చంద్రకళ. దాంతో ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు.

 

తాళి చూపించిన చంద్రకళ

మీరు ఏది అంటే అది పడటానికి పాత చంద్రకళను కాదు. నేను ఇంటి కోడలిని. విరాట్ బావ భార్యను. ఈ ఇంటి పెద్ద కోడలిగా అడుగుపెట్టాను అని చంద్రకళ అంటుంది. పెళ్లి జరిగితే కదా నువ్ ఇంటి కోడలివి అయ్యేది. జరగకుండా నీకు నువ్వే ఊహించుకుంటున్నావా అని శాలిని అంటుంది. పెళ్లి జరిగిపోయింది అని విరాట్ కట్టిన తాళిని అందరికి చూపిస్తుంది చంద్రకళ.

అది చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది. అదెవరు కట్టారు, ఎక్కడికి వచ్చావ్, ఎవరితోనే తాళి కట్టించుకుని ఇక్కడికి వచ్చి కోడలు అంటే ఏంటీ అర్థం అని శ్రుతి అంటుంది. నాకు తాళి కట్టింది ఎవరో కాదు స్వయానా విరాట్ బావే. గుడిలో దేవుడి సాక్షిగా ఇందాకే తాళి కట్టాడు అని చంద్రకళ అంటుంది. దాంతో జగదీశ్వరి అవాక్కవుతుంది. రేయ్ విరాట్ ఏంట్రా ఇది.. శిక్ష వేస్తానన్నావ్, సమస్యను పరిష్కరించాను అన్నావ్. ఇదేనా.. అని కొడుకును నిలదీస్తుంది జగదీశ్వరి.

ఇద్దరికి శిక్ష వేశాను

అంటే అమ్మా అది.. వరదరాజులు పరువు, గౌరవం అని ఇవన్నీ చేశాడుగా. వరదరాజులుకు పరువు కావాలి. చంద్రకు నాతో పెళ్లి కావాలి. అందుకే చంద్ర మెడలో తాళి కట్టి అటు వరదరాజులు పరువు, ఇటు చంద్రకు శిక్ష వేశాను అని చెబుతాడు విరాట్. శిక్ష అంటే ఇదా అని ఆశ్చర్యపోతుంది జగదీశ్వరి. తర్వాత ఏది ఏమైనా తాళి కట్టావ్ కాబట్టి చంద్రకళ ఇక్కడే ఉంటుంది అని కోడలిగా ఒప్పుకున్నట్లుగా జగదీశ్వరి అంటుంది.

 

దానికి చంద్రకళ సంతోషిస్తుంది. జగదీశ్వరి, విరాట్, క్రాంతి వెళ్లిపోతారు. చంద్రకళను ఇంట్లోంచి పంపించేస్తామని శృతి శాలిని కామాక్షి ముగ్గురు ఛాలెంజ్ చేస్తారు. నేను వెళ్తానా, మీరు వెళ్తారా అని చంద్రకళ వాళ్ల ఛాలెంజ్‌కు సవాల్ విసురుతుంది. అనంతరం రాత్రి చంద్రకళ పడుకోవడానికి విరాట్ బెడ్ రూమ్‌కి వెళ్తే తన మొహం మీద డోర్ వేస్తాడు. దాంతో అక్కడే గది పక్కనే ఉండిపోతుంది చంద్రకళ.

అది చూసిన క్రాంతి వచ్చి చంద్రకళకు ఇంకో బెడ్ రూమ్ చూపించి అందులో ఉండమని చెబుతాడు. దాంతో ఆ గదిలోకి వెళ్లిచంద్రకళ కూర్చుని బాధపడుతుూ ఉంటుంది. ఆ గదిలో పెళ్లి బొమ్మ కనిపిస్తుంది. దాంతో తనకు జరిగిన పెళ్లి గుర్తుకు వస్తుంది. మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటుంది చంద్రకళ.

ఎక్కడో తప్పు జరిగింది

మరోవైపు చంద్రకళని ఎలా పంపించాలని శృతి శాలిని కామాక్షి ప్లాన్ వేస్తుంటారు. ఇక జరిగిన విషయాల పట్ల జగదీశ్వరి బాధపడుతూ ఉంటుంది. క్రాంతి కూడా చంద్రకళని చూసి కన్సన్ చూపించి బాధపడుతుంటాడు. చంద్ర వదిన ఇలా చేసేది కాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం చంద్రకళ ఎక్కడ ఇంట్లో కనిపించదు.

 

దాంతో ఇంట్లో వాళ్లంతా చంద్రకళ ఎక్కడికెళ్లిందని కంగారుపడిపోతారు. ఇంట్లో ఒక్కొక్కళ్లని చంద్రకళ ఎక్కడ అని అడుగుతారు. ఇంతలో చంద్రకళ షాపింగ్ కవర్స్ బ్యాగ్‌తో ఎంట్రీ ఇస్తుంది. నేను కట్టుబట్టలతో పుట్టిల్లు వదిలి అత్తింటికి వచ్చాను కదా. నాకు బట్టలు లేవు. అందుకే షాపింగ్‌కు వెళ్లాను. నా బట్టల కోసం మీ క్రెడిట్ కార్డ్ వాడుకున్నాను బావ అని చంద్రకళ చెబుతుంది.

దాంతో ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోతారు. విరాట్ చేసేదేం లేక లోపలికి వెళ్లిపోతాడు. విరాట్‌తో శృతి చనువుగా ఉండటం చూసి.. ఇక నుంచి నా బావతో దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది చంద్రకళ. తర్వాత విరాట్ బెడ్ రూమ్‌కు చంద్రకళ వెళ్తుంది. వెళ్లి డోర్ వేస్తుంది. అది చూసి విరాట్ షాక్ అవుతాడు. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్. వెళ్లు. వెళ్లి నీ గదిలో పడుకో పో అని విరాట్ అంటాడు.

బెడ్ రూమ్‌లో చంద్ర

బెడ్ మీద పడుకోడానికి నీకు భయమైతే చెప్పు నేను ఆ సోఫాలో పడుకుంటాను, అంతేకానీ నన్ను బయటకు వెళ్లమని చెప్పే హక్కు నీకు లేదు అని చంద్రకళ అంటుంది. దాంతో సోఫాలో చంద్రకళ వయ్యారంగా పడుకుంటుంది. విరాట్‌ను చూస్తూనే ఉంటుంది. విరాట్ కూడా చంద్రకళను చూస్తూ ఉంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 

Best Web Hosting Provider In India 2024