సినిమా నచ్చకుంటే టికెట్ వెనక్కి అడిగే హక్కు మీకుంది.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

సినిమా నచ్చకుంటే టికెట్ వెనక్కి అడిగే హక్కు మీకుంది.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా మే 16న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 11) లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సినిమా నచ్చకుంటే టికెట్ వెనక్కి అడిగే హక్కు మీకుంది.. హీరో నవీన్ చంద్ర కామెంట్స్

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా మే 16న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 11) లెవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.

మన సైనికులకు బిగ్ సెల్యూట్

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మనల్ని రక్షించడానికి వీరోచితంగా పోరాడుతున్న మన సైనికులకి బిగ్ సెల్యూట్. జైహింద్. ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. వాళ్ల రియాక్షన్స్ చూసినప్పుడు నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది” అని అన్నాడు.

ప్రశ్నించే హక్కు మీకుంది

“మే 15న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌ని ప్లాన్ చేశాం. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు నేను అక్కడే నిల్చుని ఉంటాను. ఒకవేళ మీకు సినిమా నచ్చకపోయి ఉంటే మీ టికెట్‌ని వెనక్కి అడిగే హక్కు మీకు ఉంది. ఒకవేళ సమయం వృథా అయిందని అనిపించినా ప్రశ్నించే హక్కు కూడా మీకు ఉంటుంది” అని షాకింగ్ కామెంట్స్ చేశాడు నవీన్ చంద్ర.

కథలు, పాత్రలు బాగుంటాయని

“నేను చేసే కథలు, పాత్రలు బాగుంటాయని ప్రేక్షకులు మొదటి నుంచి ప్రశంసిస్తున్నారు. ఆ గౌరవానికి రిటర్న్‌గా ఈ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమాని నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో తీశారు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం రెడ్ చిల్లీస్‌ని తీసుకొచ్చారు. అది ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకం. ఆడియన్స్కి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు” అని నవీన్ చంద్ర తెలిపాడు.

యూనిక్ కాన్సెప్ట్

“మే 16న సినిమా రిలీజ్ అవుతుంది. నా కథే నా బలం. కచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది . ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్‌ని ఇప్పటివరకు మీరు ఏ థ్రిల్లర్‌లో కూడా చూసి ఉండరు. ఒక 30 మినిట్స్ చాలా ఎమోషన్‌కి గురి అవుతారు. ఆ ఎమోషన్ ఆడియన్స్‌కి ఒక మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది” అని నవీన్ చంద్ర పేర్కొన్నాడు.

కమల్ హాసన్ లాంఛ్ చేయడంతో

“మా ట్రైలర్‌ని లాంచ్ చేసిన కమల్ హాసన్ గారికి ధన్యవాదాలు. ఆయన లాంఛ్ చేయడంతో ట్రైలర్ చాలా అద్భుతమైన రీచ్‌తో వెళ్లింది. ధనుష్ గారు, ఆర్య గారు, సింబు గారు, శ్రీ విష్ణు గారు, సందీప్ కిషన్ గారు, సుహాస్, విశ్వక్‌ సేన్ అందరికీ ధన్యవాదాలు. నేను అడిగినప్పుడల్లా ఈ సినిమా కోసం అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు” అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024