




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో దుమ్మురేపుతున్న తమన్నా సినిమా.. థియేటర్లలో ప్లాఫ్ అయినా స్ట్రీమింగ్లో అదుర్స్.. ట్రెండింగ్లో టాప్
ఓదెల 2 చిత్రం థియేటర్లలో నిరాశపరిచింది. అయితే, తమన్నా నటించిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ట్రెండింగ్లో దూసుకొచ్చేసింది.
తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ఓదెల 2 మొదటి నుంచి మంచి హైప్ దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన ఈ మూవీ చాలా అంచనాలతో ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయింది. సీక్వెల్ క్రేజ్, సంపత్ నంది బ్రాండ్ వర్కౌట్ కాలేదు. అయితే, ఓటీటీలో మాత్రం ఓదెల 2 ప్రస్తుతం అదరగొడుతోంది.
నేషనల్ వైడ్ ట్రెండింగ్లో టాప్
ఓదెల 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం నేషనల్ వైడ్ సినిమాల ట్రెండింగ్లో టాప్ ప్లేస్కు వచ్చేసింది. ఈ మూవీ మే 8వ తేదీన ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. మూడు రోజుల్లోనే ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో అగ్రస్థానానికి ఓదెల 2 దూసుకొచ్చేసింది.
మొదటి నుంచే ప్రైమ్ వీడియోలో ఓదెల 2 మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. తమన్నా భాటియా ఉండటంతో తెలుగే కాకుండా హిందీలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ ఉంది. దీంతో ప్రస్తుతం (మే 11) ఈ చిత్రం ట్రెండింగ్లో టాప్ ప్లేస్కు వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఈ మూవీ జోరు కంటిన్యూ చేస్తుందో చూడాలి.
సంపత్ నంది.. కథ, దర్శకత్వ పర్యవేక్షణ
ఓదెల 2 సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మరో డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్ కావడం, సంపత్ నంది భాగస్వామ్యం ఎక్కువగా ఉండటంతో ఓదెల 2పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది.
ఓదెల 2లో తమన్నా.. భైరవి అనే నాగసాధువుగా నటించారు. దీనివల్ల ఈ మూవీకి చాలా క్రేజ్ వచ్చింది. దుష్టశక్తిపై దైవశక్తితో పోరాడటం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో వశిష్ట సింహ, హెబ్బా పటేల్, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
బాక్సాఫీస్ నిరాశ
ఓదెల 2 చిత్రం సుమారు రూ.25కోట్ల బడ్జెట్తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ మూవీ రూ.10కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురైంది. చాలా హైప్తో వచ్చిన ఈ మూవీ ఆ రేంజ్ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. కానీ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం జోరు చూపిస్తోంది. ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లు నిర్మించాయి.
దుష్టశక్తితో పోరు
ఓదెల గ్రామాన్ని ఓ దుష్టశక్తి నుంచి భైరవి (తమన్నా) కాపాడేందుకు ప్రయత్నించడం చుట్టూ ఓదెల 2 స్టోరీ సాగుతుంది. చనిపోయిన తిరుపతి (వశిష్ట) అతీత శక్తులను కూడగట్టుకొని ఆత్మగా ఓదెలకు వస్తాడు. దీంతో వరుస మరణాలు సంభవిస్తాయి. దీంతో తన సోదరి బైరవిని రాధ (హెబ్బా పటేల్).. తీసుకొస్తుంది. ఆ తర్వాత తిరుపతి ఆత్మతో భైరవి పోరాడుతుంది. మరి ఓదెల గ్రామాన్ని భైరవి కాపాడిందా అనేది ఓదెల 2లో ఉంటుంది.
సంబంధిత కథనం