ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న సింగిల్ సినిమా.. ఎన్ని కోట్లంటే..

Best Web Hosting Provider In India 2024

ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న సింగిల్ సినిమా.. ఎన్ని కోట్లంటే..

సింగిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతోంది. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు దక్కించుకుంది. భారీ గ్రోత్ సొంతం చేసుకుంది. రెండు రోజుల కలెక్షన్లు లెక్కలు ఎంతంటే..

ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు.. దుమ్మురేపుతున్న సింగిల్ సినిమా.. ఎన్ని కోట్లంటే..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ మూవీ.. ట్రైలర్‌ తర్వాత మంచి హైప్ తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఈ శుక్రవారం మే 9వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి ఓపెనింగ్ దక్కింది. రెండో రోజు ఈ మూవీ మరింత సత్తాచాటింది. ఫస్ట్ డేతో పోలిస్తే వసూళ్లలో గ్రోత్ దక్కించుకుంది.

రెండు రోజుల కలెక్షన్లు

సింగిల్ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.2కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ మూవీ టీమ్ నేడు (మే 11) అధికారికంగా వెల్లడించింది. తక్కువ బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ మంచి హిట్ దిశగా దూసుకెళుతోంది.

ఫస్ట్ డే కంటే ఎక్కువగా..

సింగిల్ సినిమా తొలి రోజు రూ.4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. దీన్నిబట్టి రెండో రోజు ఈ సినిమా రూ.7.05 కోట్లను దక్కించుకుంది. తొలి రోజుతో పోలిస్తే సెకండ్ డే కలెక్షన్లలో 70శాతానికిపైగా పెరుగుదల కనిపించింది. పాజిటివ్ మౌత్ టాక్ స్ట్రాంగ్‍గా ఉండటంతో ఈ ఎంటర్‌టైనింగ్ మూవీ జోరు బాక్సాఫీస్ వద్ద కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు హీరోయిన్లు

శ్రీవిష్ణుకు జోడీగా సింగిల్ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకిి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ట్రాయాంగిల్ లవ్‍, కామెడీతో ఈ మూవీని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కూడా ఓ కీరోల్ చేశారు. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రంలో సత్య, వీటీ గణేశ్, రాజేంద్ర ప్రసాద్, రెబ్బా మోనికా జాన్, మానస కీలకపాత్రలు చేశారు.

సింగిల్ సినిమాను గీతా ఆర్ట్స్, కాల్యా ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరీ నిర్మించారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. వెల్‍రాజ్ సినిమాటోగ్రఫీ చేశారు.

శ్రీవిష్ణు, కిశోర్ హైలైట్

సింగిల్ చిత్రంలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టేశారు. వీరి కాంబినేషన్‍లో కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయనే కామెంట్లు వచ్చాయి. కేతిక, ఇవానా పర్ఫార్మెన్స్ కూడా మెప్పించింది. కథ అంత కొత్తగా లేకపోయినా కామెడీ పండటంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. మూడో రోజైన ఆదివారం కూడా మంచి కలెక్షన్లు వస్తాయని బుకింగ్స్ ట్రెండ్‍తో అర్థమవుతోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024