45 కోట్లకు పైగా వ్యూస్.. పెళ్లి బరాత్ లో కచ్చితంగా ఉండే పాట.. బుల్లెట్ బండి సాంగ్ లిరిక్స్ ఇవే.. అమ్మాయిలూ పాడేయండి

Best Web Hosting Provider In India 2024

45 కోట్లకు పైగా వ్యూస్.. పెళ్లి బరాత్ లో కచ్చితంగా ఉండే పాట.. బుల్లెట్ బండి సాంగ్ లిరిక్స్ ఇవే.. అమ్మాయిలూ పాడేయండి

పెళ్లిల్ల సీజన్ సాగుతోంది. పెళ్లి బరాత్ లో కచ్చితంగా ఓ పాట మాత్రం వినిపిస్తోంది. అదే ‘బుల్లెట్టు బండి’ సాంగ్. పెళ్లికి రెడీ అవుతున్న అమ్మాయిలూ, భర్త కోసం కలలు కంటున్న వనితలూ ఈ పాట మీకోసమే.

బుల్లెట్టు బండి సాంగ్ (youtube)

నాలుగేళ్ల క్రితం వచ్చింది ‘బుల్లెట్ బండి’ సాంగ్. ఇప్పటికీ పెళ్లి బరాత్, వివాహా వేడుకల్లో ఈ తెలంగాణ జానపద పాట మార్మోగుతూనే ఉంది. కొత్తగా వివాహం చేసుకున్న అమ్మాయిలు బరాత్ లో ఈ పాటను పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఇదిగో సాంగ్ లిరిక్స్.. అమ్మాయిలూ పాడేయండి.

పాటతో ఫేమస్

సింగర్ మోహన భోగరాజు ‘బుల్లెట్ బండి’ సాగ్ తో ఫేమస్ అయిపోయారు. పాట పాడటమే కాదు వీడియో సాంగ్ లో డ్యాన్స్ తోనూ అదరగొట్టారు మోహన. ఈ పాట యూట్యూబ్ లో 45 కోట్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. 2021, ఏప్రిల్ 7న రిలీజ్ అయిన ఈ పాటను లక్ష్మణ్ రాశారు. తరుణ్ కుమార్ కొరియోగ్రాఫర్. ఎస్కే బాజి మ్యూజిక్ అందించారు.

ఇదిగో లిరిక్స్

హే పట్టుచీరనే గట్టుకున్నా, గట్టుకున్నుల్లో గట్టుకున్నా

టిక్కీబొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నుల్లో వెట్టుకున్నా

నడుముకు వడ్డాణం జుట్టుకున్నా, జుట్టుకున్నుల్లో జుట్టుకున్నా

దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా

పెళ్ళికూతురు ముస్తాబురో, నువ్వు యాడంగ వస్తావురో

చెయ్యి నీ చేతికిస్తానురో, అడుగు నీ అడుగులేస్తానురో

నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తా, రానీ వెంటా

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

చెరువు కట్టపొంటి చేమంతి వనం, బంతివనం చేమంతివనం

చేమంతులు దెంపి దండ అల్లుకున్నా, అల్లుకున్నుల్లో అల్లుకున్నా

మా ఊరు వాగంచున మల్లె వనం, మల్లె వనములో మల్లెవానమ్మ

మల్లెలు దెంపి ఒళ్ళో నింపుకున్నా, నింపుకున్నుల్లో నింపుకున్నా

నువ్వు నన్నేలుకున్నావురో, దండ మెళ్ళోన ఏస్తానురో

నేను నీ ఏలువట్టుకోని, మల్లె జల్లోన ఎడతానురో

మంచి మర్యాదలు తెలిసినదాన్ని, మట్టి మనుషుల్లోనా పెరిగినదాన్ని

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో, పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో

మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో, ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో

ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో, దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో

మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో, ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో

పండు ఎన్నల్లో ఎత్తుకొని, ఎన్న ముద్దలు వెట్టుకొని

ఎన్ని మారాలు జేస్తు ఉన్నా, నన్ను గారాలు జేసుకొని

చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను, నీ చేతికిస్తారా నన్నేరా నేను

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా, వెట్టినంకుల్లో, వెట్టినంకా

సిరిసంపద సంబురం గల్గునింకా, గల్గునింకుల్లో, గల్గునింకా

నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా, అన్నుకుంటుల్లో, అన్నుకుంటా

నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా, పంచుకుంటుల్లో, పంచుకుంటా

సుక్క పొద్దుకే నిద్రలేసి, సుక్కలా ముగ్గులాకిట్లేసి

సుక్కలే నిన్ను నన్ను చూసి, మురిసిపోయేలా నీతో కలిసి

నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా, నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా

డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ

అందాల దునియానే సూపిత్త పా

చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024