Best Web Hosting Provider In India 2024

ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ లిరిక్స్: బేబీ మూవీలోని సూపర్ హిట్ లవ్ సాంగ్.. 11 కోట్లకుపైగా వ్యూస్
బేబీ మూవీలోని ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలుసు కదా. రెండున్నరేళ్లుగా ఈ పాట ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉంది. యూట్యూబ్ లో ఏకంగా 11 కోట్లకుపైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.
ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ లిరిక్స్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన మూవీ బేబీ. ఎప్పుడో రెండున్నరేళ్ల కిందట వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలన హిట్. ముఖ్యంగా అందులోని ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ అయితే మరో లెవెల్. యువతకు ఇప్పటికే ఫేవరెట్ లవ్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ గురించి..
సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన మూవీ బేబీ. ఓ డిఫరెంట్ స్టోరీలైన్ తో వచ్చి సక్సెస్ సాధించిన ఈ మూవీ.. పాటలతోనే ఆకట్టుకుంది. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ అయితే అదిరిపోయే మెలోడీతో మాయ చేసింది. అనంత్ శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు.
శ్రీరామచంద్రతోపాటు వేద వాగ్దేవి, హర్షిత, తన్షిక, ఉజ్వల్, అనఘ, వీక్షిత్ లాంటి పిల్లలు కోరస్ అందించారు. ఈ పాటలో ఈ పిల్లల కోరసే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ అయితే మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. మరి ఆ పాట లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి. మీరూ పాడుకోండి.
ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ లిరిక్స్
పల్లవి
ఏం మాయే ఇదీ.. ప్రాయమా
అరె ఈ లోకమే.. మాయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో..
వేరయ్యే ఊసే రాదే.. తుళ్ళే ఆశల్లో
ఇద్దరిది ఒకే ప్రయాణంగా
ఇద్దరిది ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా.. మెల్లగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
చరణం 1
తోచిందే ఈ జంట
కలలకే ఏ ఏ ఏఏ.. నిజములా..
సాగిందే దారంతా
చెలిమికే.. ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ
కంటీ రెప్ప కనుపాపలాగ
ఉంటారేమో కడదాక
సందామామ సిరివెన్నెల లాగ
వందేళ్లయిన విడిపోక
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఓ రెండు ప్రేమ మేఘాలిలా
దూకాయి వానలాగా
ఆ వాన వాలు ఏ వైపుకో
తేల్చేది కాలమేగా
ఏం మాయే ఇదీ.. ప్రాయమా
అరె ఈ లోకమే.. మాయమా
వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో..
వేరయ్యే ఊసే రాదే.. తుళ్లే ఆశల్లో..
ఇద్దరిదీ ఒకే ప్రయాణంగా
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది
మెల్లగా.. మెల్లగా..