ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ లేటెస్ట్ కామెడీ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి.. బాగా ఎంజాయ్ చేస్తారు..

Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ లేటెస్ట్ కామెడీ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి.. బాగా ఎంజాయ్ చేస్తారు..

 

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన ఓ కామెడీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ సిరీస్ పంచాయత్ ను నిర్మించిన టీవీఎఫ్ సంస్థే ఈ సిరీస్ ను కూడా తెరకెక్కించింది. దాదాపు అదే ఫీలింగ్ కలిగిస్తూనే దేశంలోని గ్రామాల్లో ఉన్న ప్రాథమిక చికిత్సా కేంద్రాల దురవస్థను కళ్లకు కడుతుంది.

 
ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ లేటెస్ట్ కామెడీ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి.. బాగా ఎంజాయ్ చేస్తారు..
 

ప్రైమ్ వీడియోలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ హిందీ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ ను పంచాయత్ సిరీస్ మేకర్స్ అయిన టీవీఎఫ్ (ది వైరల్ ఫీవర్) నిర్మించింది. ఐఎండీబీలో 7.3 రేటింగ్ ఉన్న గ్రామ్ చికిత్సాలయ్ (Gram Chikitsalay) సిరీస్ ఎలా ఉందో చూడండి.

 

గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ రివ్యూ

పంచాయత్ వెబ్ సిరీస్ గురించి తెలుసు కదా. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది తెలుగులోనూ సివరపల్లి పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓ మారుమూల గ్రామానికి పంచాయతీ సెక్రటరీగా వెళ్లే ఓ యువకుడు అక్కడ పడే కష్టాలతోపాటు ఆ గ్రామంలోని రాజకీయాలను కళ్లకు కట్టింది. తాజాగా ప్రైమ్ వీడియోలోకే గ్రామ్ చికిత్సాలయ్ పేరుతో అలాంటిదే మరో సిరీస్ వచ్చింది.

ఇది పల్లెల్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రాల దురవస్థను చూపించింది. ఢిల్లీలాంటి నగరంలో సొంతంగా ఓ పెద్ద హాస్పిటల్ ఉన్నా కూడా గ్రామంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జార్ఖండ్ లోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లే ఓ యువ డాక్టర్ స్టోరీ ఇది. కేవలం ఐదు ఎపిసోడ్ల పాటే సాగే ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్లో ఆ డాక్టర్ ఎదుర్కొనే ఒక్కో సవాలును చూపించే ప్రయత్నం చేసింది.

గ్రామ్ చికిత్సాలయ్ ఎలా ఉందంటే?

గ్రామ్ చికిత్సాలయ్ డాక్టర్ ప్రభాత్ (అమోల్ పరాశర్) అనే యువ వైద్యుడి చుట్టూ తిరుగుతుంది. రాహుల్ పాండే డైరెక్ట్ చేశాడు. ది వైరల్ ఫీవర్ స్టూడియో తెరకెక్కించింది. పంచాయత్ వెబ్ సిరీస్ లాగే ఈ సిరీస్ కూడా ఓ గ్రామీణ వాతావరణంలో సాగిపోతుంది.

 

ఎన్నో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ను బాగు చేసి, అక్కడి ప్రజలకు ఒక రూపాయికే వైద్యం అందించాలని కలలు కనే డాక్టర్ ప్రభాత్ కు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. అక్కడి ప్రజలు ప్రభుత్వ వైద్యుడిని కాకుండా స్థానికంగా ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్న వ్యక్తిని ఎక్కువగా నమ్ముతారు. వాళ్ల నమ్మకాన్ని సంపాదించేందుకు ప్రభాత్ ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాడు.

దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉండే ప్రాథమిక చికిత్సా కేంద్రాల దుస్థితిని ఈ వెబ్ సిరీస్ కళ్లకు కట్టింది. సరదాగా సాగుతూనే.. ఎంతో ప్రధానమైన ఈ సమస్యను ఎత్తి చూపింది. కేవలం ఐదే ఎపిసోడ్లతో వచ్చిన సిరీస్ ఇది. మొత్తంగా మూడు గంటల్లోనే ముగుస్తుంది. ఏ కాస్త ఖాళీ టైమ్ దొరికినా కచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి.

 

Best Web Hosting Provider In India 2024