నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 6 మలయాళం థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 6 మలయాళం థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

 

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎన్నో సూపర్ హిట్ మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ థ్రిల్లర్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం. వీటిలో కొన్ని తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

 
నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 6 మలయాళం థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూడండి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
 

థ్రిల్లర్ సినిమాలు, అందులోనూ మలయాళం నుంచి వచ్చిన వాటికి మీరు పెద్ద అభిమానులా? అయితే మీరు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న ఈ మూవీస్ ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఈ సినిమాలకు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ నమోదైంది. మరి ఆ సినిమాలు ఏవి, వాటిని ఎందుకు చూడాలో తెలుసుకోండి.

 

కురుప్ – ఐఎండీబీ రేటింగ్ 7

కురుప్ 2021లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించాడు. ఇదో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. సుకుమార కురుప్ అనే క్రిమినల్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తన లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో వ్యక్తిని చంపి పారిపోయిన వ్యక్తి ఆ తర్వాత దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తాడు? కొన్ని దశాబ్దాలుగా అతడు పోలీసుల కళ్లుగప్పి ఎలా తప్పించుకు తిరుగుతున్నాడన్నదే ఈ కురుప్ మూవీ. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ది టీచర్ – ఐఎండీబీ రేటింగ్ 6.3

అమలా పాల్ నటించిన మూవీ ది టీచర్. 2022లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఆమె నటించింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన నాలుగురు స్టూడెంట్స్ పై ప్రతీకారంతో రగిలిపోయే టీచర్ స్టోరీ ఇది. చివరి వరకూ మంచి ఉత్కంఠ రేపుతూ సాగే సినిమా.

ఇరట్టా – ఐఎండీబీ రేటింగ్ 7.7

జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించిన థ్రిల్లర్ మూవీ ఇరట్టా. ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ లోనే కన్నుమూస్తాడు అతని తలపై బుల్లెట్ గాయం ఉంటుంది. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకునే అతని కవల సోదరుడు.. దీనిని ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ మూవీ స్టోరీ. తెలుగులోనూ చూడొచ్చు.

 

అన్వేషిపిన్ కండెతుమ్ – ఐఎండీబీ రేటింగ్ 7.4

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన మూవీ అన్వేషిపిన్ కండెతుమ్. ఇది ఇద్దరు అమ్మాయిల హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే స్టోరీ. పోలీస్ డిపార్ట్‌మెంట్ కు సవాలుగా మారిన రెండు వేర్వేరు హత్య కేసులను ఓ పోలీస్ అధికారి ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఐఎండీబీలో 7.4 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది.

నాయట్టు – ఐఎండీబీ రేటింగ్ 8

నాయట్టు 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఓ అనవసర కేసులో తమను ఇరికించడంతో ముగ్గురు పోలీస్ అధికారులు పరారీలో ఉంటారు. వాళ్లను పట్టుకోవడానికి కేరళ పోలీస్ మొత్తం గాలిస్తుంటారు. ఆ ముగ్గురి జీవితాలు ఏం కాబోతున్నాయన్నదే ఈ నాయట్టు మూవీ స్టోరీ. జోజు జార్జ్, కుంచకో బొబన్, నిమిషా సజయన్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు.

జన గణ మన – ఐఎండీబీ రేటింగ్ 8.3

జన గణ మన 2022లో లీగల్ థ్రిల్లర్ మూవీ. ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించాడు. ఓ ప్రొఫెసర్ మృతి, ఆ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

 

Best Web Hosting Provider In India 2024