గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: అత్తింట్లో బాలుకు దారుణ అవ‌మానం – శివ నోటిదూల – మీనా క‌ష్టాలు కంటిన్యూ

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్‌: అత్తింట్లో బాలుకు దారుణ అవ‌మానం – శివ నోటిదూల – మీనా క‌ష్టాలు కంటిన్యూ

 

గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ మే 16 ఎపిసోడ్‌లో సంవ‌త్స‌రీకం రోజు తండ్రి ఫొటోకు హార‌తి ఇవ్వ‌బోతాడు శివ‌. కానీ చేయి నొప్పి ఎక్కువ‌గా ఉండ‌టంతో హార‌తి ప‌ళ్లెం ప‌డేస్తాడు. అది చూసి బాలుతో మీనా పెళ్లి జ‌రిపించి త‌ప్పు చేశామ‌ని పార్వ‌తి అంటుంది. అత్త మాట‌ల‌ను బాలు వింటాడు.

 
గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ మే 16 ఎపిసోడ్‌
 

త‌న స‌ప్ల‌య‌ర్ జాబ్‌ పోయిన సంగ‌తి రోహిణికి చెబుతాడు మ‌నోజ్‌. ఆ మాట విన‌గానే రోహిణి కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. ఎక్క‌డ రెండు వారాల‌కు మించి ప‌నిచేయ‌వా? ఒక్క నెల అయినా జాబ్ చేసి శాల‌రీ ఎప్పుడైనా తెచ్చి ఇచ్చావా అని క్లాస్ ఇస్తుంది. నీకు చ‌దువు ఉంది…టాలెంట్ ఉంది కానీ ఒక్క రూపాయి అయినా సంపాదించావా అని నిల‌దీస్తుంది.

 

నిన్ను వెన‌కేసుకొచ్చి త‌ప్పు చేశాన‌ని ఆవేద‌న‌కు లోన‌వుతుంది. ఈ విష‌యం బాలుకు తెలిస్తే ఎన్ని మాట‌లు అంటాడో అని భ‌య‌ప‌డుతుంది. బాలుకు భ‌య‌ప‌డుతున్నావా అని మ‌నోజ్ అంటాడు. నీకేం నువ్వు దులిపేసుకొనిపోతావు. అంద‌రిలో అవ‌మానాల పాల‌య్యేది నేనేన‌ని రోహిణి అంటుంది.

కావాల‌ని జాబ్ పోగొట్టుకోలేదు…

ఓన‌ర్ న‌న్ను అవ‌మానించాడ‌ని, కావాల‌ని తాను జాబ్ పోగొట్టుకోలేద‌ని మ‌నోజ్ చెబుతాడు. ఓన‌ర్లు అన్న‌ప్పుడు వంద అంటారు…న‌న్ను కొన్నిసార్లు ప‌నిమ‌నిషిల్లా క‌స్ట‌మ‌ర్స్ ట్రీట్ చేస్తారు. వాటికి బాధ‌ప‌డి వ‌చ్చి ఇంట్లో కూర్చోలేదుగా అని మ‌రోజ్‌పై ఫైర్ అవుతుంది రోహిణి.

మ‌రో జాబ్ వెతుక్కుంటాన‌ని మ‌నోజ్ అంటాడు. అది కూడా వ‌దిలేస్తావుగా… అలాంట‌ప్పుడు ఇంకో జాబ్‌లో జాయిన్ కావ‌డం ఎందుకు అని వెట‌కారంగా రోహిణి అంటుంది. నీతో మాట్లాడ‌టం వేస్ట్ అని మ‌నోజ్‌ను ఛీ కొట్టి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది రోహిణి.

బాలు ఇంకా రాలేదా…

సాంబ‌య్య సంవ‌త్స‌రీకానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు మీనా, పార్వ‌తి. తండ్రి ఫొటో చూస్తూ అత‌డితో ప‌డిన గొడ‌వ‌ల‌ను శివ గుర్తుచేసుకొని ఎమోష‌న్ అవుతాడు. బాలు ఇంకా రాలేదా…అస‌లు వ‌స్తాడా అని ప‌క్కింటి ఆవిడ వెట‌కారంగా మీనాతో అంటుంది. వ‌స్తే వ‌చ్చాడు…లేక‌పోతే లేదు అని శివ కోపంగా అంటాడు.

 

ఇప్పుడు ఆయ‌న రాక‌పోతే ఏమ‌వుతుంది అని త‌న మ‌న‌సులో ఉన్న కోపం బ‌య‌ట‌పెడ‌తాడు. న‌న్ను కూడా వెళ్లిపొమ్మంటావా..నాన్న ఫొటోకు దండం పెట్టుకొని వెళ్లిపోతాన‌ని మీనా అంటుంది.మీనా కోపాన్ని పార్వ‌తి కంట్రోల్ చేస్తుంది.

నాలుగు కిలోమీట‌ర్లే దూరం…

ఆ ఇంటికి…మ‌న ఇంటికి నాలుగు కిలోమీట‌ర్లేన‌ని నువ్వ‌నుకుంటున్నావ‌ని, కానీ పెద్దింటికి, పేదింటికి మ‌ధ్య దూరం ఎప్ప‌టికీ త‌ర‌గ‌ద‌ని త‌ల్లితో అంటుంది మీనా. స‌త్యం ఆరోగ్యం బాగాలేద‌ని,బాలును మాత్ర‌మే వెళ్ల‌మ‌న్నాడ‌ని అంటుంది. తండ్రి చెబితే బాలు త‌ప్ప‌కుండా వ‌స్తాడ‌ని అంటుంది.

ఇంటి అల్లుడిగా బాలుకు ఇచ్చే మ‌ర్యాద ఇచ్చి పంపిస్తే చాల‌ని మీనా అంటుంది. పెద్ద‌రికంగా ఇక్క‌డికి వ‌చ్చి బాలు ఏ గొడ‌వ చేయ‌కుండా వెళితే అంతే చాల‌ని పార్వ‌తి కూడా కోపంగా మీనాకు బ‌దులిస్తుంది.

బాలు మంచివాడు అనుకున్నాం…

బాలుకు మీనాకు పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ట‌గా…శివ చేయిని విర‌గొట్టింది మీ అల్లుడేన‌ట‌గా అని ప‌క్కింటి ఆవిడ పార్వ‌తిని అడుగుతుంది. బాలు మంచివాడు, మీనాను బాగా చూసుకుంటాడ‌ని అనుకుంటే ఇలా చేశాడంటి అని మ‌రో పొరిగింటి మ‌హిళ అంటుంది. బాలు తొంద‌ర‌ప‌డ‌డ‌ని, శివ‌నే ఏదో త‌ప్పు చేసి ఉంటాడ‌ని త‌లో మాట అంటారు. వారి సూటిపోటి మాట‌ల‌తో పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.బాలు ఏమైనా క‌లెక్ట‌రా అని శివ అంటాడు.

 

హార‌తి ప‌డేసిన శివ‌…

బాలు రాకుండానే సంవ‌త్స‌రికం మొద‌లుపెడ‌తారు. తండ్రి ఫొటోకు శివ హార‌తి ఇవ్వ‌బోతాడు. కానీ నొప్పి భ‌రించ‌లేక హార‌తి ప‌ళ్లెం కింద‌ప‌డేస్తాడు. నా కొడుకు హార‌తి కూడా ఇవ్వ‌లేక‌పోతాడున్నాడ‌ని, మ‌రి ఇంత మొర‌టుగా కొట్టాలా అని పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

పెద్ద దిక్కు అనుకుంటే…

అప్పుడే బాలు అక్క‌డికి వ‌స్తాడు. నువ్వేదో మంచివాడికి అనుకున్నామ‌ని, ఇంటికి పెద్ద‌దిక్కుగా ఉంటావ‌ని అనుకుంటే శివ చేయి విరిచేస్తావా అని వీధిలోని వారంతా బాలును త‌లోమాట అంటారు. బాలు ఇంట్లో అడుగుపెట్ట‌బోతుండ‌గా…అక్క‌డ కూడా అదే సీన్ క‌నిపిస్తుంది. బాలు ఇంకా మార‌లేదా? ముందు వెనుక ఆలోచించ‌కుండా పిల్ల‌నిచ్చి త‌ప్పు చేశామ‌ని, ఏ రోజు ఏం జ‌రుగుతుందో అని భ‌య‌భ‌యంగా బ‌త‌కాల్సివ‌స్తుంద‌ని పార్వ‌తి అంటుంది. అలాంటి తొంద‌ర‌పాటు మ‌నిషితో మీనా ఎలా కాపురం చేస్తుందోన‌ని పార్వ‌తి అంటుంది. ఇంకా ఏదో చెప్ప‌బోతుండ‌గా బాలు క‌నిపించ‌డంతో మాట‌లు ఆపేస్తుంది.

క‌సి తీరా తిట్టండి…

బాలును చూడ‌గానే శివ కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. ఆపేశారంటి…మీ క‌సి తీరా తిట్టండి అని పార్వ‌తితో బాలు అంటాడు. నీ కూతురిని పెళ్లి చేసుకొని రోజు చిత్ర హింస‌లు పెడుతున్నార‌ని తిట్టండి. నాకు మంచి మ‌ర్యాద ఏం తెలియ‌వుగా…మీ కొడుకును, మిమ్మ‌ల్ని టార్చ‌ర్ పెడుతున్నాన‌ని చెప్పింది పార్వ‌తితో అంటాడు బాలు.

 

ఇంటికి పిలిచి ఇలా నా గురించి అంద‌రికి చెప్పి న‌న్ను రాక్ష‌సుడిని చేస్తారా అని బాలు అంటాడు. బ‌య‌ట ఇద్ద‌రిని బాగానే సెట్ చేశారు. బ‌య‌టే న‌న్ను క‌డిగిప‌డేశారు. అటు నుంచి అటే వెళ్లిపోవాల‌ని అనుకున్నాన‌ని, కానీ పెద్దాయ‌న ముఖం గుర్తొచ్చి ఆగిపోయాన‌ని బాలు అంటాడు.

నేనేంటో తెలిసి కూడా…

మీరు కూడా ప్ర‌పంచంలో ఎక్క‌డ లేనంత దుర్మార్గుడైన మొగుడు దొరికాడ‌ని చెబుతున్నార‌ని, నేనేంటో తెలిసి కూడా ఇంత చెడుగా ప్ర‌చారం చేయాలా అని పార్వ‌తిని నిల‌దీస్తాడు. నేరుగా న‌న్ను ఏం అన‌లేక ప‌దిమందితో తిట్టించాల‌నే న‌న్ను పిలిపించార‌ని అర్థ‌మైంద‌ని బాలు అంటాడు. శివ తండ్రికి హార‌తి కూడా ఇవ్వ‌లేక‌పోయాడ‌ని, ఆ బాధ‌లో అమ్మ మాట్లాడింద‌ని అవేవి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని భ‌ర్త‌తో మీనా అంటుంది. ఇంత మందిలో నా ప‌రువు తీస్తుంటే గుడిలో స్తోత్రం విన్నంత భ‌క్తిగా ఎందుకు వింటున్నాన‌వి మీనాపై ఫైర్ అవుతాడు బాలు.

అమ్మే అస‌హ్యించుకుంటుంది…

పెద్ద‌, చిన్న తేడా లేకుండా వ‌య‌సుకు మించిన మాట‌లు మాట్లాడాడు కాబ‌ట్టే శివ చేయి విర‌గొట్టాన‌ని బాలు అంటాడు. పెద్దా, చిన్న నీకు తెలుసా…మీ ఇంట్లో నీకు మీ నాన్న త‌ప్ప ఎవ‌రైనా మ‌ర్యాద ఇస్తారా? మీ అమ్మే నిన్ను అస‌హ్యించుకుంటుంది. నీ రౌడీయిజాన్ని ఇక్క‌డ చూపించ‌డానికి వ‌చ్చావా? నా చేయి విర‌గొట్టి మా ఇంటికే తిన‌డానికి వ‌చ్చావా? ఎందుకు వ‌చ్చావ‌ని బాలును అవ‌మానిస్తాడు శివ‌.

 

అత‌డి మాట‌ల‌తో శివ కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. శివ‌ను లాగిపెట్టి కొడ‌తాడు. బాలు దెబ్బ‌ల‌తో కింద‌ప‌డిపోతాడు.

మా వాళ్ల‌కు జ‌రిగింది చాలు…

ఇప్ప‌టివ‌ర‌కు మా వాళ్ల‌కు జ‌రిగింది చాలు…మా నాన్న సంవ‌త్స‌రికం రోజు ఆయ‌న ఆత్మ‌కు శాంతి లేకుండా చేయ‌ద్ద‌ని మీనా అంటుంది. ఒక్క నిమిషం ఓపిక ప‌ట్టి ఉంటే శివ ప‌ళ్లు నేనే రాల‌గొట్టేదానిని అని మీనా అంటుంది. మా నాన్న సంవ‌త్స‌రికం ప్ర‌శాంతంగా జ‌రుపుకోనివ్వ‌రా అని మీనా అంటుంది.

వాడు ఏం చేసి ఉంటాడో అని ఇంత మందిలో ఒక్క‌రైనా ఆలోచించారా అని మీనాను నిల‌దీస్తాడు బాలు. ఇలాంటి మ‌ర్యాద తెలియ‌ని కుటుంబానికి న‌న్ను మ‌రోసారి పిల‌వ‌ద్ద‌ని, నాకు ఇలా కావాల్సిందే…ఇలాంటి అవ‌మానం జ‌ర‌గాల్సిందేన‌ని కోపంగా అంటాడు బాలు. మీనా ఆపుతున్న ప‌ట్టించుకోకుండా కోపంగా వెళ్లిపోతాడు.

పార్వ‌తి క‌న్నీళ్లు…

బ‌తికిన్న‌ప్పుడు మా వ‌ల్ల నీకు ఏ రోజు సుఖం లేదు…పోయిన త‌ర్వాత కూడా నీకు శాంతి లేకుండాపోయింద‌ని భ‌ర్త ఫొటో ముందు పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. త‌ల్లిని మీనా ఓదార్చుతుంది. మ‌న అంద‌రి కోసం నాన్న ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడ‌న‌ని, సంవ‌త్స‌రికం రోజు ఆయ‌న‌కు ప్ర‌శాంత‌త లేకుండా చేయ‌ద్ద‌ని అంటుంది. జ‌రిగింది వ‌దిలేయ‌మ‌ని అంటుంది. నాన్న‌ను ప‌స్తులు ఉంచొద్ద‌ని, సంవ‌త్స‌రికం కోసం రోజు వండి వంట‌ల‌ను క‌న్నీళ్ల‌తోనే వ‌డ్డించుకొని తింటుంది.

 

స‌త్యం టెన్ష‌న్‌…

అత్త‌గారింటికి వెళ్లిన బాలు ఏం గొడ‌వ చేసి వ‌స్తాడోన‌ని స‌త్యం టెన్ష‌న్ ప‌డుతాడు. మీనా ఇంటికి రాగానే మీ తండ్రి సంవ‌త్స‌రికానికి బాలు వ‌చ్చాడా అని అడుగుతాడు స‌త్యం. వ‌చ్చాడు…కానీ ఎందుకొచ్చాడా అని మేము అనుకునేలా చేశాడ‌ని మీనా బ‌దులిస్తుంది. శివ‌ను కొట్టిన విష‌యం స‌త్యానికి చెబుతుంది మీనా. అక్క‌డ జ‌రిగిన గొడ‌వ గురించి మొత్తం చేస్తుంది. మేము ఏం పాపం చేశామ‌ని స‌త్యాన్ని నిల‌దీస్తుంది.మా అంద‌రిని బాలు ఏడిపించాడ‌ని అంటుంది.

కార‌ణం లేకుండా…

అప్పుడే బాలు కూడా అక్క‌డికి ఎంట్రీ ఇస్తాడు. మీ అత్త‌గారింటికి వెళ్లావా..అక్క‌డ గొడ‌వ చేశావా అని బాలును నిల‌దీస్తాడు స‌త్యం. నీ కోడ‌లు చెప్పే ఉంటుంది క‌దా అని బాలు స‌మాధాన‌మిస్తాడు. నేను కార‌ణం లేకుండా తొంద‌ర‌ప‌డ‌న‌ని నీకు తెలియ‌దా అని తండ్రితో అంటాడు.

అంత బ‌ల‌మైన కార‌ణం ఏంటో చెప్ప‌మ‌ని బాలును ప్ర‌భావ‌తి అడుగుతుంది. బాలు ఫోన్ చూసి ఆవేశానికి లోను కావ‌డం మీనా చూస్తుంది. బాలు బాత్‌రూమ్‌కు వెళ్ల‌గానే బాలు ఫోన్ ఓపెన్ చేయ‌బోతుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

 

Best Web Hosting Provider In India 2024