





Best Web Hosting Provider In India 2024

లేటెస్ట్ మలయాళ బ్లాక్‌బస్టర్ తుడరుమ్.. ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. రీజన్ ఇదేనా?
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా తుడరుమ్ కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది. ఈ మోహన్ లాల్ బ్లాక్‌బస్టర్ మూవీ అదరగొడుతోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అందుకు మరింత వెయిటింగ్ తప్పకపోవచ్చు.
వరుసగా సూపర్ హిట్ మూవీస్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు సీనియర్ హీరో మోహన్ లాల్. తాజాగా ‘తుడరుమ్’తో మలయాళ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్లలో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి హిట్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఏ ఓటీటీలో?
తుడరుమ్ డిజిటల్ రైట్స్ ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇందు కోసం ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసినట్లు టాక్. తుడరుమ్ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన అయిదు వారాల తర్వాత ఓటీటీలోకి రావాలనే కండీషన్ ఉంది. ఈ మేరకు మే నాలుగో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు.
అందుకే లేట్
తుడరుమ్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ థియేటర్లలో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతోంది. అందుకే ఇప్పుడే ఓటీటీ రిలీజ్ చేయొద్దని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిసింది. మరికొన్ని రోజులు థియేటర్లలో ఈ మూవీ రన్ అవుతుందని టాక్. అందుకే ఓటీటీ రిలీజ్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ లో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
రూ.100 కోట్ల గ్రాస్
కేరళ బాక్సాఫీస్ దగ్గర తుడరుమ్ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. సరికొత్త చరిత్ర నమోదు చేసింది. కేరళలోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఫస్ట్ మలయాళ మూవీగా తుడరుమ్ నిలిచింది. మోహన్‌లాల్ లేటెస్ట్ ఫిల్మ్ తుడరుమ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మోహన్‌లాల్ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
‘‘ఎక్స్ క్యూజివ్ గా కేరళ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రూ.100 కోట్ల మార్క్ తో తుడరుమ్ రికార్డు బుక్స్ లో చోటు దక్కించుకుంది. మనం కలిసి ఈ మైలురాయి క్రియేట్ చేశాం. థ్యాంక్ యూ కేరళ’’ అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.
కలెక్షన్ల మోత
ఏప్రిల్ 25న రిలీజైన మలయాళ బ్లాక్ బస్టర్ తుడరుమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. 20 రోజుల్లో ఈ మూవీ ఇండియాలో రూ.104.34 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని సక్కిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు ఇప్పటికే రూ.200 కోట్లు దాటేశాయి. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్, రికార్డుల కారణంగా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో మలయాళ సినిమాగా ఈ మూవీ నిలిచింది.
సంబంధిత కథనం