Best Web Hosting Provider In India 2024

మీ బాత్రూమ్‌కు ఎలాగో యాక్సెస్ ఉండదు కదా.. హీరోయిన్‌తో కాంట్రవర్సీ ఎస్‌కేఎన్ కామెంట్లు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మరోసారి కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. హీరోయిన్ తోనే నేరుగా బాత్రూమ్ యాక్సెస్ ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ నాయుడు (ఎస్‌కేఎన్) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ తోనే నేరుగా ఎలాగో నీ బాత్రూమ్ లోకి యాక్సెస్ లేదు కదా అని అనేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎస్‌కేఎన్ పై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అతను ఇక మారడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకు ఏం జరిగిందంటే?
ఆ ఇంటర్వ్యూలో
టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘సింగిల్’. ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లు. వెన్నెల కిశోర్ కీ రోల్ ప్లే చేశారు. తాజాగా ఈ మూవీ టీమ్ తో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రమోషన్లలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. గీతా ఆర్ట్స్ ఛానల్ లో ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు.
డైరెక్ట్ గా ఆ ప్రశ్న
సింగిల్ మూవీ టీమ్ తో ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కామెంట్లు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీశాయి. ఈ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, ఇవానా, కేతిక శర్మ పాల్గొన్నారు. కేతికను ప్రశ్న అడుగుతూ ఎస్‌కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రభాస్ గారి ఇంటర్వ్యూలో చూశాను. చూస్తే.. మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్ కు ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి.. మీరు ఇక్కడకు వచ్చారు కాబట్టి.. ఒక సాంగ్ పాడితే మేం అందరం హ్యాపీగా ఫీలవుతాం’’ అని కేతికతో ఎస్‌కేఎన్ అన్నారు.
హీరోయిన్ స్టన్
బాత్రూమ్ కు యాక్సెస్ లేదు కదా అని ఎస్‌కేఎన్ అనగానే హీరోయిన్ కేతిక కాస్త స్టన్ అయినట్ల కనిపించింది. ‘‘మేం తెలీదు కానీ నువ్వయితే హ్యాపీగా ఫీలవుతావ్’’ అని వెంటనే వెన్నెల కిశోర్ ఎస్‌కేఎన్ కు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కేతిక ఓ సాంగ్ పాడింది. ఇప్పుడీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్‌కేఎన్ ఇక మారరు? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాత్రూమ్ యాక్సెస్ ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు కాయదుతో
డ్రాగన్ సినిమా హీరోయిన్ కాయదు లోహర్ ను ఉద్దేశించి గతంలో ఎస్‌కేఎన్ చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. కాయదు లోహర్ పై డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టారు ఎస్‌కేఎన్. ‘‘ఈ సినిమా హీరోయిన్ కాయల్.. కాయలా? పళ్లా? తెలుగులో కాయలు, పళ్లు అంటే చాలా అర్థాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై అప్పుడు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.