బ్రహ్మముడి మే 17 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ చెడగొట్టిన అన్నయ్యలు- కావ్య పెళ్లి ఫొటో చూసేసిన రాజ్- యామినిని ముంచిన రుద్రాణి

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 17 ఎపిసోడ్: రుద్రాణి ప్లాన్ చెడగొట్టిన అన్నయ్యలు- కావ్య పెళ్లి ఫొటో చూసేసిన రాజ్- యామినిని ముంచిన రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్ మే 17 ఎపిసోడ్‌లో రాజ్ ఇంటికి వచ్చే సమయానికి కావ్య ఇంట్లో లేకుండా ఉండేందుకు రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్‌ను అన్నయ్యలు సుభాష్, ప్రకాశం చెడగొడతారు. ఇక కావ్య పెళ్లి ఫొటోను రాజ్‌కు చూపించేలా మరో ప్లాన్ వేస్తుంది రుద్రాణి. ఆ ప్లాన్ స్వప్న వినేస్తుంది. కానీ, రాజ్ ఆ ఫొటో చూస్తాడు.

 
బ్రహ్మముడి సీరియల్‌ మే 17వ తేది ఎపిసోడ్
 

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అప్పును ఆపుతుంది ధాన్యలక్ష్మీ. నా కొడుకు అనుభవిస్తున్న బాధ మీకు తెలియట్లేదు అని ధాన్యం అంటే.. నేను సంతోషంగా ఉన్నానని కల్యాణ్ అంటాడు. వెళ్తున్న అమ్మాయిన గడప ముందు ఆపి గొడవ ఏంటీ. అసలు నీకు ఏం కావాలి అని ఇందిరాదేవి అంటుంది.

 

సక్రమంగా కాపురం చేయాలి

నా కొడుకుకు న్యాయం కావాలి. వాడు సక్రమంగా కాపురం చేయాలి. సంతోషంగా పిల్లల్ని కనాలి. అది నేను చూడాలి. అదేమో ఉద్యోగం పేరుతో అర్థరాత్రులు తిరుగుతుంది. వీడేమో దానికోసం ఎదురుచూస్తూ నిద్రహారాలు మానేస్తున్నాడు. అలా అయితే వాళ్లు ఎప్పుడు కాపురం చేసేది పిల్లల్ని ఎప్పుడుకనేది అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది మా ఇద్దరికి సంబంధించిన విషయం అని కల్యాణ్ అంటాడు.

అసలు నీకు ఏం కావాలని అడుగుతున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. అప్పు పోలీస్ ఉద్యోగం మానేయాలి. ఇంటి కోడలిగా హౌజ్ వైఫ్‌లా నా కొడుకు బాగోగులు చూసుకుంటూ ఉండాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంటే నువ్వు అనేది. అది పోలీస్ కావాలని వాడి గురించి కూడా పక్కన పెట్టి కష్టపడ్డాడు. అలాంటి వాడి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయాలనుకుంటున్నావా అని ఇందిరాదేవి అంటుంది.

అసలు అప్పు మనసులో ఏముందో కనుక్కున్నావో. తన కష్టం గురించి ఒక్కసారైన ఆలోచించావా అని అపర్ణ అంటుంది. కొడుకు సంతోషం కోసం కోడలి కలల్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు అని సుభాష్ అంటాడు. ఇప్పుడు తను సంపాదించకపోతే వచ్చే నష్టం ఏంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. అందరూ డబ్బుకోసమే కష్టపడతారనుకుంటావేంటీ. కొంతమంది సంతోషం కోసం చేస్తారు అని కల్యాణ్ అంటాడు.

 

నా విలువ తెలుస్తుంది

సరే ఇంట్లో వాళ్లంతా కలిసి ఆవిడ గారెకే సపోర్ట్ చేస్తున్నారు కదా. అలాగే కానివ్వండి. ఈరోజు ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఏదో ఒక రోజు మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు నా విలువ ఏంటో అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. ఏంటీ పొట్టి అలా చూస్తున్నావ్. మా అమ్మ మాటలకు బాధపడుతున్నావా. నేను అన్నమాటలకు పడిపోయావా అని కల్యాణ్ చాలా కూల్ చేస్తుంది. దాంతో అప్పు సిగ్గుతో వెళ్లిపోతుంది.

భార్యను అర్థం చేసుకునే భర్త దొరకడం చాలా అదృష్టంరా. అందులో అప్పు చాలా లక్కీ. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. ఎప్పుడు ఇలాగే ఉండండి అని అపర్ణ అంటుంది. మరోవైపు ఆఫీస్‌లోని ఒకరికి రుద్రాణి కాల్ చేసి అంతా చెప్పానుగా. వెంటనే కావ్యకు కాల్ చేసి శంషాబాద్ బ్రాంచ్‌కి వచ్చేలా చేయు అని రుద్రాణి అంటుంది. నాకు భయం వేస్తుంది. కావ్య మేడమ్ ఇక్కడికి వస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిసిపోతుంది కదా అని అతను అంటాడు.

ఏదోటి చెప్పు. తిడితే తిట్టించుకో. కొడితే కొట్టించుకో. ఊరికే డబ్బులు రావు. లక్ష రూపాయలు అంటే నీ మూడు నెలల జీతం అని రుద్రాణి అంటుంది. పాప స్కూల్ ఫీజ్ కోసం ఈ తప్పు చేస్తున్నా అని రుద్రాణి అంటే.. నువ్ సపోర్ట్ చేస్తే పాప స్కూల్ ఫీజ్ కూడా నేనే కడతా అని రుద్రాణి అంటుంది. మరోవైపు రెడీ అవుతున్న కావ్యకు సతీష్ కాల్ చేసి తమ బ్రాంచ్‌కు రమ్మంటాడు.

 

అదే కారణం చెబుతా

రావాల్సిన రా మెటీరియల్ రాలేదు. ప్రొడక్షన్ ఆగిపోయిందని సతీష్ చెబుతాడు. మెటీరియల్ వచ్చినట్లు నాకు మెసేజ్ వచ్చింది. సెక్యూరిటీ వాళ్లా.. వాళ్లేందుకు ఆపుతారు. నేను సెక్యురిటీ ఇంఛార్జ్‌కు కాల్ చేస్తాను అని కావ్య అంటుంది. దీంతో ఏదోటి కవర్ చేసేందుకు సతీష్ చెబుతాడు. ఏంటో మీ పిండం గోల. సరే వస్తాను అని కావ్య అంటుంది. ఆ మాటలు విన్న రుద్రాణి చాలా సంతోషిస్తుంది.

ఎలాగు ఆయన వచ్చేప్పుడు నాకు ఇంట్లో ఉండాలని లేదుగా అదే కారణం చెప్పి వెళ్తా అని కావ్య అనుకుంటుంది. ఇది ఇప్పుడు హ్యాపీగా వెళ్తుంది. అనుకుంది జరుగుతుంది అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు రాజ్ కారులో హుషారుగా పాటలు పెట్టుకుని చిరంజీవి పాటలు పాడుకుంటూ వస్తుంటాడు. అత్తయ్య ఆఫీస్‌కు వెళ్తున్నాను అని కావ్య అంటే.. రాజ్ వస్తున్న విషయం గురించి చెబుతారు.

అర్జంట్ వర్క్ పడింది వెళ్లాలి అని కావ్య అంటుంది. నా కొడుకు కంటే ఆఫీస్ ఎక్కువయిందా అని అపర్ణ అంటుంది. వీళ్లేంటీ నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నారు. ఎలాగైనా ఆపాలి అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో దూరి ఆ కంపెనీ మనదే కదా. సమస్య వచ్చిందంటుంది కదా వినండి అని రుద్రాణి అంటుంది. నువ్వేంటీ కావ్య మీద ప్రేమ చూపిస్తున్నావ్ అని ఇందిరాదేవి అడుగుతుంది.

 

నోర్మూసుకుని వెళ్లి

ప్రేమ కాదు. కంపెనీకి సమస్య వస్తే మనం కూడా సఫర్ అవుతాం కదా అని చెబుతున్నా అని రుద్రాణి అంటుంది. ఇంతలో ప్రకాశం, సుభాష్ వచ్చి కిశోర్ కాల్ చేసి చెప్పాడు. ఆల్రెడీ రా మెటీరియల్ వెళ్లిపోయింది. గంటలో వర్క్ స్టార్ట్ అవుతుంది అని సుభాష్ అంటాడు. రుద్రాణిని ప్రకాశం, సుభాష్ ఇద్దరూ చూసుకుంటూ నవ్వుతారు. నోర్మూసుకుని ఇంట్లోకి వెళ్లి వాడు వచ్చాకా ఏం చేసి పెట్టాలో ఆ వంట గురించి ఆలోచించు అని అపర్ణ అంటుంది.

మీరంతా ఉన్నారుగా. మళ్లీ నేనేందుకు అని కావ్య అంటుంది. ఇష్టం లేకుండా ఉండమని చెప్పింది మాతో కాదు వాడితో. లోపలికి వెళ్లి పని చూడు అని ఇందిరాదేవి అంటుంది. ఇంకా కొడుకు రాలేదేంటీ అని అపర్ణ అంటుంది. యామినిని దాటుకుని రావాలిగా అని సుభాష్ అంటాడు. కోటకు లంకినిలా అడ్డుగా ఉండి ఉంటుంది. నువ్వేంటీ అంత కంగారుపడుతున్నావ్. కావ్య ఇంట్లో ఉండటం ఇష్టం లేదా ఏంటీ అని ఇందిరాదేవి అంటుంది.

నాకేం ఇబ్బంది. నెత్తిమీద పెట్టుకోండి అని రుద్రాణి చెప్పేసి పైకి వెళ్తుంది. అన్నయ్యలు ఇద్దరు కలిసి నా ప్లాన్ మొత్తం చెడగొట్టారు అని రుద్రాణి ఫీల్ అవుతుంటే యామిని కాల్ చేస్తుంది. కావ్యను పంపించేశారా అని యామిని అడుగుతుంది. కుదర్లేదు. నేను ప్లాన్ చేశాను మా అన్నయ్యలు చెడగొట్టారు అని రుద్రాణి అంటుంది. మీరే ఏదో పొడిచేస్తారనుకుని నమ్ముకుంటే ఇలా అర్ధాంత్రంగా ముంచేస్తారేంటీ అని యామిని అంటుంది.

 

పెళ్లయిన అమ్మాయి చుట్టూ

ఈరోజు రాజ్ రాగానే కావ్య కలుస్తుంది. కానీ, వాళ్లు పర్మనెంట్‌గా విడిపోతారు. రాజ్ ఇంటికి రాగానే ఏదో ఒక సమయం చూసి కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫొటో చూపిస్తాను. కావ్య మెడలో తాళి బొట్టు చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇన్నాళ్లు పెళ్లయిన అమ్మాయి చుట్టూ తిరిగినందుకు బాధపడుతాడు. మోసం చేసిన కావ్యను అసహ్యించుకుంటాడు అని రుద్రాణి అంటుంది. ఆ మాటలు స్వప్న వింటుంది.

అలా అయితే తన భర్తే రాజ్ అని తెలుస్తుందిగా అని యామిని అంటుంది. కేవలం సింగిల్ ఫొటో మాత్రమే చూపిస్తాం. ఇంట్లోవాళ్లు కూడా భర్త ఎవరు అనేది చెప్పరు. రాజ్ రావడం, కావ్య ఫొటో చూసి షాక్ అయి తిట్టేసి వెళ్లడం అంతా ఒకే ఫ్రేమ్‌లో జరుగుతుంది అని రుద్రాణి అంటుంది. అమ్మా నా అత్తో వెనుక నుండి ఇంత నడిపిస్తున్నావా. నా చెల్లిని ఇరికిద్దామని చూస్తున్నావా. నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని స్వప్న అనుకుంటుంది.

రాజ్ కోసం అంతా ఎదురుచూస్తుంటే.. ఇంతలో రాజ్ వచ్చేస్తాడు. సరదాగా మాట్లాడుతుంటాడు. నువ్ స్ట్రిక్ట్‌గా మాట్లాడకుండా సరదాగా ఉండాలనే ఉందిరా అని సుభాష్ అంటే.. అసలు నేను ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉన్నా నాన్న అని రాజ్ అంటాడు. ప్రతి దానికి ప్రశ్నలు వేస్తావేంట్రా మనవడా. ఫ్యూచర్‌లో స్ట్రిక్ట్‌గా ఉండకు అని చెబుతున్నాడు అంతే అని ఇందిరాదేవి అంటుంది.

 

నాకు కాబోయే ఇల్లు

మీకు ఇలా నచ్చితే పర్మనెంట్‌గా ఇలాగే ఉండిపోతా అని రాజ్ అంటాడు. వరుసలు బాగానే కలుపుకున్నారు కానీ మళ్లీ ఎందుకు వచ్చారు అని కావ్య అడుగుతుంది. నిన్నే చెప్పాను అని రాజ్ అంటాడు. మర్యాదగా వెళ్లిపోండి. ఇది నా ఇల్లు అని కావ్య అంటే.. ఇది నాకు కాబోయే ఇల్లు అని రాజ్ అంటాడు. ఏదో కాబోయే పెళ్లాం అన్నట్లు అంటున్నారు అని కావ్య అంటుంది.

అవును, వీళ్లు దత్తత తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంటే ఈ ఇంటికి కావాల్సిన దత్త పుత్రుడిని. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అవసరం అయితే ఇక్కడే ఉంటాను అని రాజ్ అంటాడు. ఇక్కడే రూమ్ కూడా ఏర్పాటు చేస్తాను అని అపర్ణ అంటే.. చూశారా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని రాజ్ అంటాడు. ఆ ఫ్యాన్స్‌ను పట్టుకని వేలాడండి అని రాజ్ అంటాడు.

మీ వాళ్లు నాకు సపోర్ట్ చేస్తున్నారని జెలసీ మీకు అని రాజ్ అంటే.. ఆస్తి మీకు రాసి ఇస్తారని కడుపు మంటగా ఉందని కావ్య అంటుంది. ఆత్మీయులు కావాలి కానీ ఆస్తులు అవసరం లేదు అని రాజ్ అంటాడు. గతం మర్చిపోయిన క్యారెక్టర్ మర్చిపోలేదు మనోడు అని రుద్రాణి అంటుంది. ఏంటీ అని రాజ్ అడిగితే.. ఇందిరాదేవి కవర్ చేస్తుంది. నీకు రుద్రాణి గురించి చెప్పానుగా అని ఇందిరాదేవి అంటుంది.

 

తాళితో కావ్య ఫొటో

రుద్రాణి అంటే ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ల మధ్య పెంట పెడుతుంది. ఎదుటి వాళ్ల ఆనందం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటుంది. పాత సినిమాల్లో సూర్య కాంతం టైపు ఆవిడే కదా అని రాజ్ అంటాడు. దాంతో రుద్రాణి కోప్పడుతుంది. నా మనవడితో పద్ధతిగా నడుచుకో అని ఇందిరాదేవి అంటే.. అమ్మమ్మ అప్పుడే పార్టీ మార్చేశారా అని కావ్య అంటుంది. ఎప్పుడో మార్చేశానే అని ఇందిరాదేవి అంటుంది.

మరోవైపు తాళితో ఉన్న కావ్య ఒక్క ఫొటోనే కనపడేలా బెడ్‌పై పెడుతుంది రుద్రాణి. నా గదిలో నీకోసం ఏసీ పెట్టు కూల్ ఉంచాను. ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో అని రుద్రాణి తన గదికి రాజ్‌ను పంపిస్తుంది. దాంతో వెళ్లిన రాజ్ అక్కడ తాళితో ఉన్న కావ్య ఫొటో చూసి షాక్ అవుతాడు. అది చూసి రుద్రాణి సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Best Web Hosting Provider In India 2024