




Best Web Hosting Provider In India 2024
రాజకీయాల్లోకి రోహిత్.. టెస్టు రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర సీఎంతో మీటింగ్.. బీజేపీలోకి చేరబోతున్నారనే చర్చ!ఫొటోలు వైరల్
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ రాజకీయాల్లోకి రాబోతున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? తాజాగా మహారాష్ట్ర సీఎంను రోహిత్ కలవడంతో అతని పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీ20లకూ గుడ్ బై చెప్పిన రోహిత్ ఇప్పుడు కేవలం వన్డేల్లోనే ఆడతాడు. అందుకే రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నాడేమోననే కామెంట్లు వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను రోహిత్ కలవడం హాట్ టాపిక్ గా మారింది.
సీఎంతో మీటింగ్
టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ మంగళవారం (మే 13) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను వారి అధికారిక నివాసం వర్షాలో కలిశాడు. ఈ మీటింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
“భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం వర్షాలో కలిసి, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. టెస్ట్ క్రికెట్ నుంచి అతని రిటైర్మెంట్, రోహిత్ ప్రయాణంలో తదుపరి అధ్యాయంలో నిరంతర విజయం కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!” అని సీఎం ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆ ఫొటోలతో
రోహిత్ ను కలిసిన విషయాన్ని ఎక్స్ లో పోస్టు చేసిన మహారాష్ట్ర సీఎం.. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. రోహిత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ అచ్చం పొలిటికల్ లీడర్ లాగే ఉన్నాడని మరికొందరు అంటున్నారు. మహారాష్ట్ర తర్వాతి సీఎం రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బీజేపీలోకి హిట్ మ్యాచ్ చేరబోతున్నాడని అంటున్నారు. రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ ఈ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
టెస్టులకు రిటైర్మెంట్
11 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ రోహిత్ మే 7న గుడ్ బై చెప్పాడు. అతని టెస్ట్ కెరీర్ 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో మొదలైంది. అతను 67 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రోహిత్ 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు, వీటిలో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లో ఓ ఇన్నింగ్స్ లో 212 పరుగులు చేశాడు. అదే అతని హై స్కోరు.
ఇలా మొదలై
2013లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అతని టెస్ట్ అరంగేట్రం 177 పరుగులతో అద్భుతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో సవాళ్లను ఎదుర్కొన్నాడు. 2013 నుంచి 2018 వరకు కేవలం 27 టెస్టుల్లో ఆడాడు. 39.63 సగటుతో 1,585 పరుగులు చేశాడు. వీటిలో మూడు శతకాలే ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
2019లో దక్షిణాఫ్రికాతో హోం సిరీస్ లో ఓపెనర్ గా టెస్టుల్లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు రోహిత్. తర్వాత జరిగిన 40 టెస్టుల్లో, రోహిత్ 41.15 సగటుతో 2,716 పరుగులు సాధించాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link