షాకింగ్.. వరుస ఓటములు.. కోచ్ పై వేటు వేసిన జకోవిచ్.. 6 నెలలకే ముర్రేకు గుడ్ బై

Best Web Hosting Provider In India 2024


షాకింగ్.. వరుస ఓటములు.. కోచ్ పై వేటు వేసిన జకోవిచ్.. 6 నెలలకే ముర్రేకు గుడ్ బై

టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ తన కోచ్ ఆండీ ముర్రేకు షాకిచ్చాడు. ఆరు నెలల్లోనే కోచ్ కు గుడ్ బై చెప్పాడు. ఈ పరిణామం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.

కోచ్ ఆండీ ముర్రేతో నొవాక్ జకోవిచ్ (REUTERS)

టెన్నిస్ ప్రపంచానికి షాక్ కలిగించే వార్త ఇది. ఆరు నెలల్లోనే తన కోచ్ ఆండీ ముర్రేకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ గుడ్ బై చెప్పాడు. తమ ఆరు నెలల పార్ట్‌న‌ర్‌షిప్‌ ముగిసిందని మంగళవారం (మే 13) జకోవిచ్, ముర్రే ప్రకటించారు. గత కొంతకాలంగా జకోవిచ్ వరుస ఓటములు చవిచూడటమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.

అనుభవం లేకపోయినా

గతంలో జకోవిచ్, ముర్రే కోర్టులో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ముర్రే తన కెరీర్ లో మూడు గ్రాండ్ స్లామ్ లు గెలిచాడు. ఈ మూడింట్లో రెండు ఫైనల్స్ లో జకోవిచ్ నే ఓడించాడు ముర్రే. 2012 యుఎస్ ఓపెన్, 2013 వింబుల్డన్ ఫైనల్స్‌లో జకోవిచ్ పై ముర్రే గెలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ముర్రే టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు. అయితే ముర్రేకు కోచ్ గా అనుభవం లేకపోయినా జకోవిచ్ నియమించుకున్నాడు.

అప్పటి నుంచి

రిటైర్ అయిన ముర్రేను, కోచ్‌గా ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని తన ఆఫ్-కోర్ట్ టీమ్‌కు నాయకత్వం వహించడానికి నియమించుకున్నట్లు 2024 నవంబర్‌లో జకోవిచ్ ప్రకటించాడు. టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ ఈ బంధం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండలేకపోయింది. వారి భాగస్వామ్యం బాగానే ప్రారంభమైంది.

జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించాడు. అయితే అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో గాయం కారణంగా వైదొలిగాడు. అప్పటి నుంచి వరుసగా ఓడుతున్నాడు. చివరగా ఆడిన రెండు టోర్నీల్లోనూ జకోవిచ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.

25వ టైటిల్ పై గురి

37 ఏళ్ల జకోవిచ్ రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ పై కన్నేశాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 24 టైటిళ్లున్నాయి. పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ ల రికార్డు అతనిదే. ఓవరాల్ గా మార్గరెట్ కోర్ట్ తో కలిసి జాయింట్ గా అగ్రస్థానంలో ఉన్నాడు. మరొక్క గ్రాండ్ స్లామ్ గెలిస్తే 25వ టైటిల్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడు. కానీ జకోవిచ్ కు అదంత సులువుగా దక్కడం లేదు. గాయాలు, ఫామ్ లేమి అతణ్ని వెనక్కి లాగుతున్నాయి.

జకోవిచ్ కు థ్యాంక్స్

“కలిసి పనిచేయడానికి నమ్మశక్యం కాని అవకాశం ఇచ్చినందుకు నోవాక్‌కు థ్యాంక్స్. గత ఆరు నెలలుగా కష్టపడ్డ అతని జట్టుకు ధన్యవాదాలు. మిగిలిన సీజన్ కు జకోవిచ్ ఆల్ ది బెస్ట్’’ అని ఆండీ ముర్రే తెలిపాడు.

“గత ఆరు నెలలుగా కోర్టులో, బయట కష్టపడి పని చేసినందుకు, మద్దతుగా నిలిచినందుకు కోచ్ ఆండీకి ధన్యవాదాలు’’ అని జకోవిచ్ పేర్కొన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link